Dishha -Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu https://dishha.com Online edition of the largest circulated Telugu daily Dishha. Read todays latest and breaking Telugu news at Dishha online news. Thu, 07 Dec 2023 06:37:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.4.3 https://dishha.com/wp-content/uploads/2022/06/cropped-fc05d74e-4042-47c1-86b3-f526b23afc5e-removebg-preview-1-32x32.png Dishha -Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu https://dishha.com 32 32 ఎత్తుకెళ్లి పోవాలా నా సామిరంగా https://dishha.com/my-samirana-should-be-taken-away/ https://dishha.com/my-samirana-should-be-taken-away/#respond Thu, 07 Dec 2023 06:37:27 +0000 https://dishha.com/my-samirana-should-be-taken-away/ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగా’. అశికా రంగనాథ్‌ కథానాయిక. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తుది దశ చిత్రీకరణ జరుగుతోంది. ‘నా సామిరంగా’ చిత్రం నుంచి తొలిగీతం ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తోంది’ త్వరలో విడుదలవనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లో రైతు గెటప్‌లో నాగార్జున ఆకట్టుకున్నారు. పొలంలో ట్రాక్టర్‌పై కాలు ఉంచి బీడీ కాలుస్తూ సరికొత్త లుక్‌లో కనిపించారు. ప్రసన్నకుమార్‌ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

]]>
https://dishha.com/my-samirana-should-be-taken-away/feed/ 0
‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్.. అసలు విషయం ఏంటంటే..? https://dishha.com/pushpa-actor-jagadish-arrested-what-is-the-real-thing/ https://dishha.com/pushpa-actor-jagadish-arrested-what-is-the-real-thing/#respond Thu, 07 Dec 2023 06:37:24 +0000 https://dishha.com/pushpa-actor-jagadish-arrested-what-is-the-real-thing/ పుష్ప’ (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) పక్కనే ఉండే కేశవ (Keshava) పాత్ర పోషించిన నటుడు జగదీశ్.. ఒక మహిళ ఆత్మహత్య కేసులో అరెస్టయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఓ మహిళకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొద్దిరోజుల తర్వాత విడాకులు తీసుకుని నగరానికి వచ్చింది. సోమాజిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. సినీ పరిశ్రమలో ఆర్టిస్టుగా, చిన్న చిన్న డాక్యుమెంట్లు తీస్తున్న క్రమంలో ఆమెకు జగదీశ్(31)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి కొద్దిరోజులు ఉన్నారు. వివాహం చేసుకుందామని ఆమె అనుకుంది. కానీ, జగదీశ్ (Jagadeesh Prathap Bandari) వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలియగానే ఆమె అతడిని దూరం పెట్టింది.

అయితే, ఆమెను మరిచిపోలేని జగదీశ్ తరచూ ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లేవాడు. అయినా ఆమె అతడిని పట్టించుకోలేదు. అదే సమయంలో మరో యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం సన్నిహిత సంబంధానికి దారి తీసింది. కిందటి నెల 27వ తేదీన.. రాత్రి ఆమె తన ఫ్లాట్‌లోనే ఆ యువకుడితో అర్ధనగ్నంగా ఉండగా వంటింటి కిటికీలో నుంచి జగదీశ్ తన సెల్‌ఫోన్‌లో వారి ఫొటోలు తీశాడు. కొద్దిసేపటి తరువాత తలుపులు కొట్టడంతో ఆమె తలుపులు తెరిచింది. జగదీశ్ తాను తీసిన ఫొటోలను ఆమెకు చూపగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమెతో ఉన్న యువకుడు జగదీశ్‌ను వారించడమే కాక.. పోలీసులకు ఫోన్‌ చేస్తానని హెచ్చరించడంతో అతడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత రెండు రోజులూ జగదీశ్ ఆ మహిళకు.. తాను తీసిన ఫొటోలు వాట్సాప్‌లో పంపించాడు. తన మాట వినకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె ఆందోళనకు గురై 29న తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జగదీశ్‌పై అనుమానం ఉందని వారు తెలపడంతో.. అతడి కోసం గాలింపు ప్రారంభించారు. మృతురాలి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా.. ఆమె మరణించడానికి ముందు ఎవరెవరు ఫోన్‌ చేశారు? ఆమె ఎవరితో మాట్లాడిందో తెలుసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు రోజు వరకూ ఆమెతో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు 27వ తేదీ రాత్రి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఆమె మృతికి ప్రధాన కారకుడిగా భావించి జగదీశ్‌పై ఐపీసీ 354(సి), 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

]]>
https://dishha.com/pushpa-actor-jagadish-arrested-what-is-the-real-thing/feed/ 0
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల విధ్వంసం https://dishha.com/devastation-by-maoists-in-chhattisgarh/ https://dishha.com/devastation-by-maoists-in-chhattisgarh/#respond Thu, 07 Dec 2023 06:37:22 +0000 https://dishha.com/devastation-by-maoists-in-chhattisgarh/ మావోయిస్టు పార్టీ 23వ పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా మంగళవారం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం(Dummugudem) మండల సరిహద్దున ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. పొటకపల్లి-పాలోడి, పొటకపల్లి-దుబ్బమరక ప్రధాన రహదారులపై నాలుగు చోట్ల రోడ్డును తవ్వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా మంగళవారం దుమ్ముగూడెం మండల సరిహద్దు కిష్టారం వారాంతపు సంతకు వెళ్లే వ్యాపారులు ఎప్పటిలానే వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చారు. ముందు జాగ్రత్తల్లో భాగంగా రాత్రి 7.30కు భద్రాచలం-చర్ల సర్వీసును ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులను సైతం నిలిపివేశారు. వారోత్సవాలకు 8వ తేదీ చివరి రోజు కావడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌(Telangana-Chhattisgarh) సరిహద్దుల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

]]>
https://dishha.com/devastation-by-maoists-in-chhattisgarh/feed/ 0
దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. ఈ సారైనా ఆ లోటు తీరుతుందా?.. https://dishha.com/the-indian-team-arrived-in-south-africa-will-the-deficit-be-overcome-this-time/ https://dishha.com/the-indian-team-arrived-in-south-africa-will-the-deficit-be-overcome-this-time/#respond Thu, 07 Dec 2023 06:37:19 +0000 https://dishha.com/the-indian-team-arrived-in-south-africa-will-the-deficit-be-overcome-this-time/ చూస్తుండగానే సౌతాఫ్రికా పర్యటన వచ్చేసింది. ఈ నెల 10 నుంచి భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో సఫారీలతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్టు సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. సౌతాఫ్రికా చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు విమనాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు వారితో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అభిమానులు అడగడంతో టీమిండియా ఆటగాళ్లు కూడా కాదనకుండా ఎంతో ఓపికతో సెల్ఫీలు ఇచ్చారు. ముందుగా వైట్ బాల్ సిరీస్ జరగనుండంతో ప్రస్తుతానికి టీ20, వన్డే సిరీస్ ఆడే జట్లు మాత్రమే సౌతాఫ్రికాకు వెళ్లాయి. టెస్టు సిరీస్ ఆడే జట్టు తర్వాత వెళ్లనుంది.

ఇక సఫారీ పర్యటనలో భారత జట్టు ముందుగా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 10, 12, 14వ తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. వెస్టిండీస్, అమెరికా వేదికగా 2024 జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ఈ సిరీస్‌ను సన్నాహకంగా భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్ తర్వాత టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు మరొక టీ20 సిరీస్ మాత్రమే ఆడనుంది. జనవరిలో భారత్ వేదికగా అప్ఘానిస్థాన్‌తో ఈ సిరీస్ జరగనుంది. ఇక సౌతాఫ్రికా గడ్డపై గతంలో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్‌లను గెలిచింది. కానీ టెస్టు సిరీస్ మాత్రం ఇప్పటివరకు ఒకసారి కూడా గెలవలేదు. దీంతో ఈ సారైనా ఆ లోటు తీరుతుందేమో చూడాలి.

టీమిండియా టీ20 జట్టు

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

టీమిండియా వన్డే జట్టు

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్.

టీమిండియా టెస్టు జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్.షమీ*, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.

]]>
https://dishha.com/the-indian-team-arrived-in-south-africa-will-the-deficit-be-overcome-this-time/feed/ 0
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి https://dishha.com/another-shooting-in-america-three-killed/ https://dishha.com/another-shooting-in-america-three-killed/#respond Thu, 07 Dec 2023 06:37:17 +0000 https://dishha.com/another-shooting-in-america-three-killed/ అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాస్ వెగాస్‌లోని నెవాడా యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో (UNLV) బుధవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు తెగబడిన నిందితుడు కూడా మరణించాడని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కాల్పుల్లో మరణించిన వారి వివరాలను అధికారులు ఇంకా గుర్తించలేదు. కాల్పుల ఘటన అనంతరం యూనివర్సిటీని పోలీసులు ఖాళీ చేయించారు.

‘యూనివర్సిటీలో ముగ్గురి మ‌ృతదేహాలను గుర్తించాం. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అతని పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయినవారిలో కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు.’’ అని లాస్ వెగాస్ మెట్రోపాలిటర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సంఘటన నేపథ్యంలో నెవాడా విశ్వవిద్యాలయం, అన్ని ఇతర దక్షిణ నెవాడా విద్యాసంస్థలను బుధవారం(స్థానిక కాలమానం) మూసివేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. విశ్వవిద్యాలయం సమీపంలోని పలు రహదారులను కూడా పోలీసులు మూసివేశారు. లాస్ వెగాస్ స్ట్రిప్‌కు తూర్పున రెండు మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న నెవాడా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో దాదాపు 25,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 8,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరల్ విద్యార్థులున్నారు.

]]>
https://dishha.com/another-shooting-in-america-three-killed/feed/ 0
సెంటిమెంట్‌ ఫాలో కానీ ఇద్దరు నేతలు https://dishha.com/sentiment-follows-but-two-leaders/ https://dishha.com/sentiment-follows-but-two-leaders/#respond Thu, 07 Dec 2023 06:37:14 +0000 https://dishha.com/sentiment-follows-but-two-leaders/ హైదరాబాద్‌, డిసెంబర్‌ 7
అంకెల్లో దేని ప్రత్యేకత దానిదే.. రాజకీయాల్లో అందుకే ఒకటి ప్లస్‌ ఒకటి.. ఎప్పుడూ పదకొండు కాదు అని చెబుతుంటారు. ఇక అంకెల్లో 6 నంబరుకు ఉన్న ప్రత్యేకత వేరే. దీనిని తిరగేస్తే 9 అవుతుంది. అంటే.. అత్యధికులు లక్కీ నంబరుగా భావించే సంఖ్య వస్తుంది. వాస్తవానికి ఇదంతా నమ్మకాల ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా ఇదే నంబరు లక్కీ అని ఎవరికి ఎవరూ చెప్పలేరు. అయితే, కొంతమంది మాత్రం తమకు నచ్చిన, అచ్చొచ్చిన నంబరును లక్కీగా భావిస్తారు. మొన్నటి వరకు తెలంగాణ సీఎంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ‘‘6’’ లక్కీ నంబరు అనే సంగతి తెలిసిందే. ఆయన కాన్వాయ్‌ వాహనాలు సహా తెలంగాలోని జిల్లాల సంఖ్య కూడా ‘‘6’’ వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. కానీ, అదే 6 ఇప్పుడు తిరగబడిరది. ‘‘9’’ అయింది. ఈ నంబరు తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్‌ రెడ్డికి లక్కీ నంబరు కావడమే ఇక్కడ విశేషం.రేవంత్‌ అదృష్ట సంఖ్య 9 అనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. కేసీఆర్‌ వాహనాలన్నింటిపైనా 6 ఉంటే.. రేవంత్‌ వాహనాలపై 9 ప్రధానంగా ఉంటుంది. కానీ.. కేసీఆర్‌ అదృష్ట సంఖ్య ఈసారి ఆయనకు కలిసిరాలేదు. రేవంత్‌ కు మాత్రం బాగా కలిసొచ్చింది. వాస్తవానికి ఏ పని తలపెట్టినా, ఏ కార్యక్రమాన్నైనా 6 కలసివచ్చేలా చేసేవారు కేసీఆర్‌. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాన్ని పక్కనపెట్టి ముహూర్త బలం, తిథులు, నక్షత్రాలు, శుభ ఘడియలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అయిగే, 9ని తన అదృష్ట సంఖ్యగా భావించే రేవంత్‌ కూడా.. ఈసారి తారాబలం ప్రకారమే ముందుకెళ్లారు. ఆయన యాదృచ్ఛికంగా.. కేసీఆర్‌ లక్కీ నంబర్‌ 6వ తేదీన (నవంబరు) నామినేషన్‌ వేశారు. తారాబలం ప్రకారం ఆ రోజు ఆయనకు ‘క్షేమతార’. అటు కేసీఆర్‌ ఏమో.. తారాబలం ప్రకారం 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్‌ వేశారు.కేసీఆర్‌ సెంటిమెంట్‌ను ఫాలో కాకుండా ఓటమి పాలయ్యారని ఇప్పుడు అందరూ అంటున్నారు. రేవంత్‌ మాత్రం కేసీఆర్‌ లక్కీ నంబరు 6న నామినేషన్‌ దాఖలు చేశారు. కేసీఆర్‌ ఏమో.. రేవంత్‌ లక్కీ నంబరు 9న నామినేషన్‌ వేశారు. ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. దీంతో ఇద్దరూ సెంటిమెంటును ఫాలో కాలేదని చెబుతున్నారు. కాగా, సీఎంగా ఉన్నప్పుడ కేసీఆర్‌ కాన్వాయ్‌లో కూడా 6 అంకె వచ్చేలా చూసుకున్నారు. రేవంత్‌ సీఎం అవుతుండడంతో కాన్వాయ్‌ లో 9 నంబరు ఉండేలా మార్పులు చేశారు. వాస్తవానికి కేసీఆర్‌ లక్కీ నంబరు అయిన 6నే రేవంత్‌ సీఎంగా ప్రమాణం చేస్తారని మొదట కథనాలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్‌ హై కమాండ్‌ ఆలస్యం చేయడంతో ఆగిపోయింది. ఒకవేళ 6 నే రేవంత్‌ ప్రమాణం చేసి ఉంటే అది కేసీఆర్‌ ను ఎగతాళి చేసిట్లే ఉండేది. చివరకు గురువారం.. అంటే ఈ నెల 7న రేవంత్‌ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

]]>
https://dishha.com/sentiment-follows-but-two-leaders/feed/ 0
కమలం… ఆచితూచి అడుగులు https://dishha.com/lotus-achituchi-steps/ https://dishha.com/lotus-achituchi-steps/#respond Thu, 07 Dec 2023 06:37:12 +0000 https://dishha.com/lotus-achituchi-steps/ కరీంనగర్‌, డిసెంబర్‌ 7
కాంగ్రెస్‌ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి? ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో బిజెపి నాయకులు బలంగా చెప్పగలిగితే పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది.ఈసారి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కమల వికాసం తథ్యమని అందరూ అనుకున్నారు. బిజెపి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ 8 సీట్లతోనే ఆ పార్టీ సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. గోషా మహల్‌ మినహా సిట్టింగ్‌ కోల్పోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌, తల్లోజు ఆచారి వంటి వారు ఓడిపోవడం, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో అంబర్‌ పేట లో బిజెపి అభ్యర్థి పరాజయం పాలవడం వంటి ఘటనలు ఆ పార్టీని ఇప్పటికీ అంతర్మథనంలో కొట్టుమిట్టాడేలా చేస్తున్నాయి. గత ఏడాది ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎక్కువగా సీట్లు, ఓట్లు సాధించినప్పటికీ.. బిజెపి అధికారంలోకి రావాలి అంటే అది సరిపోదు.బీసీ అజెండా తో ఈసారి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లిన భారతీయ జనతా పార్టీకి ఆశించినంత మేర ఓటు బ్యాంకు బదిలీ కాలేదు. అది జరగాలంటే బీసీ ముఖ్యమంత్రి అంశం విూదనే భారతీయ జనతా పార్టీ తుది వరకు పని చేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిన నేపథ్యంలో? భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి విధానాన్ని అత్యంత పకడ్బందీగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. అవసరమైతే దీనిని ప్రధాన రాజకీయ అంశంగా తెరపైకి తీసుకురావాలి. ఇక ఎస్సీ ఉప వర్గీకరణ విధానాన్ని కూడా చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలి. ఇది దళిత సామాజిక వర్గం చిరకాల వాంఛ. ఇప్పటివరకు ఎన్నికైన ప్రభుత్వాలు దళితుల ఉప వర్గీకరణ సంబంధించి ఒక పకడ్బందీ నిర్ణయం అంటూ తీసుకోలేదు. మాదిగల విశ్వరూప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళితుల వర్గీకరణ పై నిర్ణయం వెలువరించడం.. మందకృష్ణ మాదిగ సమక్షంలో దానిని ప్రకటించడం ఒక గేమ్‌ చేంజర్‌ అని చెప్పుకోవచ్చు.. అయితే ఈ ఉప వర్గీకరణ విధానాన్ని దళితుల్లో క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్తే భారతీయ జనతా పార్టీకి మరింత ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.. ఇవి మాత్రమే కాకుండా హిందూ ధర్మ పరిరక్షణ, విస్తృతి ఒక ప్రధాన అంశంగా బిజెపి ప్రకటించాల్సిన అవసరం ఉంది. హిందువుల పార్టీ అని చెప్పుకునే బిజెపి 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని విస్మరించడం కొంతమందిని ఇబ్బందికి గురి చేసింది. ఒకవేళ ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి కనుక ఈ విషయం విూద అత్యంత సీరియస్గా దృష్టి సారించి ఉండి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. గత పది సంవత్సరాలలో బలమైన నాయకత్వాన్ని ఏర్పరచుకుంది. క్షేత్రస్థాయి వరకు విస్తరించిన వ్యవస్థలతో అలరారుతోంది. అయితే ఇటువంటి బలాన్ని ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పొందుపరచుకోవాలి. క్షేత్రస్థాయిలో మరింత బలంగా పార్టీని అభివృద్ధి చేసుకోవాలి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని తేడా లేకుండా బలపడాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో ఒక ప్రాంతం అని కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు సాధించింది. ఇక ఈ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ స్థానంలో బిజెపి విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చేసుకుంటే సికింద్రాబాద్‌ తో పాటు మల్కాజి గిరి స్థానంలోనూ బిజెపి గెలిచే అవకాశం ఉంది.. ఎందుకంటే ఈ స్థానాల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు విజయం సాధించారు. అయితే పార్లమెంట్‌ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఇక్కడి ఓటర్ల మనోగతం పూర్తిగా మారిపోతుంది. అందుకే ఈ స్థానాల్లో ఈసారి బిజెపి గెలిచే అవకాశం కనిపిస్తోంది.. ఇదే కాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా పార్లమెంటు స్థానాల్లో కూడా బిజెపి క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా జిల్లాల్లో అధ్యక్షుల పని తీరు అంతంతమాత్రంగా ఉంది. వారిని తప్పించి ఉత్సాహంగా పనిచేసే వారికి అధ్యక్ష పదవి అప్పచెపితే ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి గణనీయమైన సీట్లు సాధించే అవకాశం ఉంది. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది.. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఓడిపోయి నైరాశంలో ఉంది కాబట్టి.. అది జాతీయంగా అడుగులు వేసే అవకాశం అంతంత మాత్రమే కాబట్టి.. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి? ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో బిజెపి నాయకులు బలంగా చెప్పగలిగితే పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది

]]>
https://dishha.com/lotus-achituchi-steps/feed/ 0
స్పీకర్‌ వద్దంటున్న సీనియర్లు https://dishha.com/seniors-who-dont-want-a-speaker/ https://dishha.com/seniors-who-dont-want-a-speaker/#respond Thu, 07 Dec 2023 06:37:09 +0000 https://dishha.com/seniors-who-dont-want-a-speaker/ హైదరాబాద్‌, డిసెంబర్‌ 7
తెలంగాణ సీఎం ఎవరనేది తేలిపోయింది.. మంత్రులు కూడా దాదాపు ఖరారయ్యారు. అయితే, మంత్రుల కంటే ముందు స్పీకర్‌ ఎవరు అనేది తేలాల్సి ఉంది. స్పీకర్‌ పదవి ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదట కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్లు. సీనియర్‌ నేతలంతా తమకు స్పీకర్‌ పదవి వద్దంటే వద్దు అని దూరం జరుగుతున్నారట. స్పీకర్‌గా పని చేస్తే మళ్లీ గెలవరనే ఒక విశ్వాసం రాజకీయ నేతల్లో గాఢంగా ఉంది. గతంలో స్పీకర్‌గా పని చేసిన వారంతా ఓడిపోయారే తప్ప.. ఎన్నడూ గెలిచిన దాఖలాలు లేవు. అయితే, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాత్రం ఆ మూఢ నమ్మకాన్ని బ్రేక్‌ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఏది ఏమైనా.. స్పీకర్‌గా చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పోచారం గెలుపును ఉదాహరణగా చూపించినా.. మాకు వద్దే వద్దంటున్నారు నేతలు. స్పీకర్‌ పదవి ప్రచారంలో తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, శ్రీధర్‌ బాబు, రాజనర్సింహ తమకు స్పీకర్‌ వద్దంటే వద్దు అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. అయితే, ఖమ్మం జిల్లాలో మంత్రి పదవులు దక్కి వారి లిస్ట్‌లో భట్టి విక్రమార్క, కూనంనేని సాంబశివరావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఉండటంతో.. తుమ్మల నాగేశ్వరరావుకే స్పీకర్‌ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్‌లో కాంగ్రెస్‌ గెలుపొంది.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరనే అంశాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం తేల్చేసింది. మంత్రులు పేర్లను కూడా దాదాపు ఫైనల్‌ చేసింది. గురువారం నాడు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు.. మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, స్పీకర్‌ పదవి విషయంలోనే తేడా వస్తోంది. ఈ పదవిని స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఏం చేయాలని ఆలోచనలో పడ్డారు కాంగ్రెస్‌ నేతలు. మరి చివరకు ఆ స్పీకర్‌ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఆరు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ పరాజయంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్‌ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అలాగే కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచారు. అయితే వీళ్లు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామ చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఏకంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అంతేకాదు ప్రస్తుతం గవర్నర్‌ కోటాలో మరో రెండు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపితే ఆరు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఎల్బీస్టేడియంలో రేవంత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎమ్మెల్సీగా రేవంత్‌ ఎవరికి అవకాశం ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే ఎమ్మెల్సీ రేసులో షబ్బీర్‌ అలీ, అద్దంకి దయాకర్‌తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సీపీఐ నేతలకు కూడా అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది.

]]>
https://dishha.com/seniors-who-dont-want-a-speaker/feed/ 0
అసెంబ్లీలో అగ్రకులాలదే పెత్తనం https://dishha.com/the-upper-castes-are-dominant-in-the-assembly/ https://dishha.com/the-upper-castes-are-dominant-in-the-assembly/#respond Thu, 07 Dec 2023 06:37:07 +0000 https://dishha.com/the-upper-castes-are-dominant-in-the-assembly/ హైదరాబాద్‌, డిసెంబర్‌ 7,
119మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలోకి ఈ సారి 43మంది రెడ్డి కులానికి చెందిన వారే అడుగుపెట్టనున్నారు. 13 మంది వెలమలు, నలుగురు కమ్మలు, బ్రాహ్మణ, వైశ్య కులాల నుంచి ఒక్కొక్కరు అసెంబ్లీలో అడుగుపెడతారు. అటు బీసీల ఎమ్మెల్యేల సంఖ్య 19గా ఉంది.తెలంగాణ, ఏపీ రాజకీయాలను కులాలను వేరు చేసి చూడలేం. కులసవిూకరణలు, లెక్కలు లేకుండా ఎన్నికలు జరగవు. ఎస్సీ, ఎస్టీలకు ఫిక్సడ్‌ సీట్లు ఉంటాయి.. మిగిలిన కులాల వారికి ఉండవు. ఎవరైనా ఓపెన్‌గా కంటెస్ట్‌ చేయవచ్చు. గెలవచ్చు.. అసెంబ్లీలోకి అడుగుపెట్టవచ్చు. ఇక ఎన్నికల్లో ఆ కులానికి ఇది చేస్తాం.. ఈ కులం కోసం ఇది చేస్తాం అని చెబుతు ఓట్లు అడుగుతారు అభ్యర్థులు. మహిళా కోటా కావాలని రోడ్లు ఎక్కుతారు కానీ అసలు టికెట్‌ కూడా ఇవ్వరు.. ఇక బీసీల కోసం కులగణన చేపడతామని చెబుతారు కానీ టికెట్లు ఇవ్వడంలో వారికి కూడా మొండిచెయ్యే. తెలంగాణ ఎన్నికలు ఫలితాల తర్వాత ఆసక్తికర లెక్కలు బయటకొచ్చాయి. తెలంగాణలో మొత్తం 119నియోజకవర్గాలున్నాయి. అందులో 31 రిజర్వెడ్‌ సీట్లు. అంటే ఎస్సీ, ఎస్టీ సీట్లు. ఈ సీట్లలో మిగిలినవారు పోటిచేసే ఛాన్స్‌ లేదు. మొత్తం 19సీట్లలో ఎస్సీలు, 12సీట్లలో ఎస్టీలు నిలబడతారు. ఇక మిగిలిన 88సీట్లు ఓపెన్‌ క్యాటగిరి. అంటే ఎవరైనా నిలపడొచ్చు. ఈ 88సీట్లలో ఈసారి 43 మంది రెడ్డిలు, 13 మంది వెలమలు, నలుగురు కమ్మలు, బ్రాహ్మణ, వైశ్యకులాల నుంచి ఒక్కొక్కరు అసెంబ్లీలో అడుగుపెడతారు. అంటే 119 మంది ఎన్నికైన ప్రతినిధులలో 52శాతం అగ్రకులాల వారే ఉన్నారు.ఇటీవలి కాలంలో ఎక్కువగా కులగణన గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చజరిగింది. ముఖ్యంగా బీసీల శాతం తేల్చేందుకు కులగణన చేపడతామని పలు పార్టీలు ప్రకటించాయి. బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల రిజర్వేషన్‌ శాతాన్ని పెంచుతామని చెప్పాయి. ఇక తెలంగాణలో గెలిస్తే ‘బీసీ’నే సీఎంగా చేస్తామని బీజేపీ ప్రకటించింది కూడా. అయితే నిజానికి బీసీ ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టేవారిలో 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 16శాతం మంది బీసీలన్నమాట. అటు బీసీ జనాభా 50శాతానికి పైగా ఉందని అంచనా. ఇక 1983 నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల వరకు రెడ్డిలు, వెలమలు, కమ్మలు వారి జనాభా తక్కువగా ఉన్నా అసెంబ్లీలో మెజారిటీ సీట్లలో వారే ఉంటున్నారు. 40 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా రెడ్డి ఎమ్మెల్యేలు సగటున 30 నుంచి 43, వెలమలు 8 నుంచి 13 మధ్య, కమ్మలు 3`8 మధ్య, బ్రాహ్మణులు 1 నుంచి 7 మధ్య ఉన్నారు.

]]>
https://dishha.com/the-upper-castes-are-dominant-in-the-assembly/feed/ 0
ఐటీ మంత్రిపై చర్చోపచర్చలు https://dishha.com/discussions-on-the-it-minister/ https://dishha.com/discussions-on-the-it-minister/#respond Thu, 07 Dec 2023 06:37:04 +0000 https://dishha.com/discussions-on-the-it-minister/ హైదరాబాద్‌, డిసెంబర్‌ 7
తెలంగాణ ఐటీ మినిస్టర్‌ ఎవరు అన్నదానిపై సోషల్‌ విూడియాలో కొంత కాలంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం కేటీఆర్‌ బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ అని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సోషల్‌ విూడియాలో ట్రెండిరగ్‌ చేయడమే. అయితే కేటీఆర్‌ మాత్రమే కాదని ఆయనకు మించిన బెస్ట్‌ ఐటీ మినిస్టర్లు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉంటారని కాంగ్రెస్‌ మద్దతుదారులు సోషల్‌ విూడియాలో చర్చ పెడుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో వీరు అర్హులు అంటూ కొంత మంది పేర్లను తెరపైకి తెచ్చి వారి అర్హతలపై చర్చ పెడుతున్నారు. బెంగళూరు తర్వాత దేశంలోనే హైదరాబాద్‌ నగరం ఐటీలో అగ్రగామిగా ఉంది. తెలంగాణా ఏర్పడ్డాక రెండు పర్యాయాలు కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఆ రెండుసార్లూ ఈ శాఖను కేటీఆరే చేపట్టారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన చెప్పుకోదగిన పాత్ర పోషించారు. కొత్త మంత్రివర్గంలో ఐటీ మంత్రి కోసం రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కుందూరు జానారెడ్డి తనయుడు జైవీర్‌ ఒకరైతే, ఎల్లారెడ్డినుంచి గెలిచిన మదన్‌ మోహన్‌ రావు మరొకరని సో,ల్‌ విూడియా ప్రచారం చేస్తోంది. కొత్తగా ఎన్నికైన యువకుల్లో ఐటీ మంత్రి పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలూ ఉన్న ఎమ్మెల్‌?ల్లో మొదటి పేరు జయవీర్‌. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడైన జైవీర్‌.. న్యూ యార్క్‌ యూనివర్శిటీలో బిజినెస్‌ ఇంజనీరింగ్‌ లో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్నారు. ఐటీ రంగంపై పూర్తి అవగాహన ఉన్న జైవీర్‌ కు చురుకైన యువ నాయకుడిగా పేరుంది. చక్కటి వాగ్ధాటి కలిగిన నాయకుడు కూడా. ఆయన శాసనసభకు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. తాజా ఎన్నికల్లో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంనుంచి 56 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఇక ఐటీ మంత్రి పదవికి అన్ని అర్హతలూ ఉన్న మరొక యువ ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు. ఎల్లారెడ్డి నుంచి గెలిచి, తాజాగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న మదన్‌ మోహన్‌ కూడా విద్యాధికుడు. ఎన్జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీనుంచి ఎమ్మెస్‌, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన మదన్‌ మోహన్‌, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఐటీ సెల్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. యుఎస్‌ఎమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ గానూ, యుఎస్‌ఎమ్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సిఇఓగానూ వ్యవహరిస్తున్నారు. అనలిటిక్స్‌ డేటా సర్వీసెస్‌ సంస్థలో భాగస్వామిగానూ ఉన్నారు. ఐటీ పరిశ్రమపై మంచి అవగాహన , పరిచయాలు ఉన్నాయి. ఈయన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు అల్లుడు. కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గంలో సమర్ధుడైన, ఐటీ రంగంలో ప్రవేశమున్న యువకుడు ఐటీ మంత్రిగా ఉంటేనే ఇప్పటివరకూ సాధించిన అభివృద్ది ముందుకు సాగుతుంది. కానీ, కాంగ్రెస్‌ అధిష్ఠానం కొత్తవారికి మంత్రిమండలిలో ఎంతవరకూ చోటు కల్పిస్తుందన్నది అనుమానమే. ఎందుకంటే, నిబంధనల ప్రకారం తెలంగాణా మంత్రిమండలిలో గరిష్ఠంగా 18మందికి మాత్రమే చోటు కల్పించాలి. కానీ, పార్టీలో పదవులకోసం పోటీ పడుతున్న సీనియర్లు చాలామందే ఉన్నారు. వారిని కాదని పార్టీ అధిష్ఠానం యువకులకు ఐటివంటి కీలకమైన శాఖను ఎంతవరకూ అప్పగిస్తుందో చూడాల్సి ఉంది.

]]>
https://dishha.com/discussions-on-the-it-minister/feed/ 0