సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు మహేష్ బాబు ఎమోషనల్ లెటర్..

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మే 31న వెరీ వెరీ స్పెషల్.. ప్రతి యేడాది తన తండ్రి దివంగత సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమాకు సంబంధించిన ఏదో అనౌన్స్‌మెంట్ ఇవ్వడం ఆనవాయితీ వస్తోంది. అయితే.. కృష్ణ కన్నుమూసిన తర్వాత వచ్చిన పుట్టినరోజున అభిమానులకు ‘మోసగాళ్లకు మోసగాడు’ రీ రిలీజ్‌ సందర్భంగా ఓ ఎమోషనల్ లెటర్ రాసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మే 31న వెరీ వెరీ స్పెషల్.. ప్రతి యేడాది తన తండ్రి దివంగత సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమాకు సంబంధించిన ఏదో అనౌన్స్‌మెంట్ ఇవ్వడం ఆనవాయితీ వస్తోంది. అయితే.. కృష్ణ కన్నుమూసిన తర్వాత వచ్చిన పుట్టినరోజున అభిమానులకు ‘మోసగాళ్లకు మోసగాడు’ రీ రిలీజ్‌ సందర్భంగా ఓ ఎమోషనల్ లెటర్ రాసారు. ఈ సందర్భంగా మహష్ బాబు తన నోట్‌లో ‘నాన్నగారి వీరాభిమానుల్లో నేనూ ఒకణ్న. మా అభిమానులందరికీ సూపర్ స్టార్ కృష్ణ గారు పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై తీసిన ఎన్నో ఎన్నో గొప్ప సినిమాల్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ అంటే ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం. ఆ రోజుల్లోనే హాలీవుడ్ స్థాయిలో చిత్రాలను తలదన్నే స్థాయిలో తెలుగు చిత్రాన్ని నిర్మించి , విజయవంతం చేసిన సాహసి నాన్నగారు.
52 యేళ్ల క్రితమే గుర్రాలు, గన్ ఫైటింగ్‌లు, భారీ సెట్టింగులు, బ్యూటిపుల్ లొకేషన్స్, ట్రెషర్ హంట్.. అతిపెద్ద తారాగణం. కౌబాయ్ గెటప్స్ తో బడ్జెట్ పరిధులు అధిగమించి తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, వంటి బాషల్లోనూ ఈ సినిమా చూపించిన ఘనత నాన్న గారికి దక్కుతుంది. ఈ రోజు ( మే 31) బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను 4K టెక్నాలజీతో ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేసాము. తెలుగు సినిమాకు లెజెండ్ అండ్ విజనరీ నాన్నగారు.

మొదటి స్టీరియో ఫోనిక్ సౌండ్. మొదటి సినిమా స్కోప్,.. మొదటి 70 MM, మొదటి జేమ్స్‌బాండ్, మొదటి కౌబాయ్ వంటి ఎన్నో కొత్త హంగులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత నాన్నగారికే దక్కుతుందన్నారు. ఇక ఆయన జయంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను సరికొత్త టెక్నాలజీతో రీ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి సరికొత్త అనుభూతి పొంది ఆయన్ని స్మరించుకుందాం అన్నారు.

ఒకప్పుడు తెలుగులో పాత సినిమాలు రీ రిలీజ్‌లు అనేవి ఎక్కువగా ఉండేవి. శాటిలైట్, డిజిటల్ ఎంట్రీతో వీటి దూకుడు తగ్గింది. తాజాగా గత కొన్ని రోజులుగా తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్ అనే ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4Kలో మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన అలనాటి చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా 4K టెక్నాలజీలో కృష్ణ జయంతి సందర్బంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ తెర వెనక స్టోరీ విషయానికొస్తే..

తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ.సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా పద్మాలయా ఫిలింస్ బ్యానర్‌లో కే.యస్.ఆర్. దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ చిత్రం విడుదలై 5 దశాబ్దాలు అవుతోంది. అప్పట్లోనే ఈ చిత్రం ఎన్నో రికార్డులు సాధించింది.

ఎడారులు, గుర్రపు ఛేజింగ్‌లు, నిధి కోసం ఎత్తుకు పై ఎత్తులు, ఎంతో ఉత్కంఠ రేపే కథా కథనాలు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఉత్కంఠభరిత సన్నివేశాలు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్స్ సీక్వెన్స్, హాలీవుడ్‌ చిత్రాలను తలదన్నే పిక్చరైజేషన్. మొత్తంగా తెలుగు ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *