కుప్పం నుంచే భువనేశ్వరి బస్సుయాత్ర

తిరుపతి, అక్టోబరు 6
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ కావడం, గత 25 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉండటంతో నారా భువనేశ్వరి టీడీపీలో యాక్టివ్‌ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆమె కూడా ఆందోళనలు చేపడుతున్నారు. అక్రమంగా రాజకీయ కక్ష సాధింపు కోసం బాబును అరెస్ట్‌ చేశారని ఆరోపిస్తూ ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించి జగన్‌ సర్కార్‌ తీరును రాష్ట్ర ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడం, టీడీపీ శ్రేణులను యాక్టివ్‌ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు మేలుకో తెలుగోడా పేరును ఇప్పటికే ఖరారు చేశారు.ప్పం నుంచి ‘మేలుకో తెలుగోడా’ బస్సు యాత్ర చేసే ఆలోచనలో నారా భువనేశ్వరి ఉన్నట్లు సమాచారం. బస్సుయాత్ర ప్రారంభించవచ్చన్న వార్తల నేపథ్యంలో.. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం ఆధ్వర్యంలో యాత్ర రూట్‌మ్యాప్‌ను బుధవారం పరిశీలించారు. కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు టీడీపీ నేతలు. ఆ వివరాలను టీడీపీ అధిష్ఠానానికి పంపించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే, బస్సుయాత్ర తేదీ ఇంకా నిర్ణయం కాలేదు.బస్సు యాత్ర ద్వారా వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ యాత్రకు రూట్‌మ్యాప్‌ ఖరారు చేసే పనిలో టీడీపీ ఉంది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కుప్పంలోని ఆర్డీసీ బస్టాండ్‌ కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నారా భువనేశ్వరి బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ పీఎస్‌ మునిరత్నం చర్చించారు. భవనేశ్వరి పర్యటనకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు.యాత్ర ఎప్పటినుంచో స్టార్ట్‌ చేయాలనే దానిపై టీడీపీ ముఖ్యనేతలు సమాలోచనలలు చేస్తున్నారు. రెండు రోజుల్లో తేదీని ఖరారు చేయనున్నారు. ఈ వారంలోనే భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశముంది. భువనేశ్వరి బస్సు యాత్రను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. కానీ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటంతో.. రిలీఫ్‌ వస్తుందని బావించారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే భువనేశ్వరి బస్సు యాత్ర ఆపేయాల్సి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టులో విచారణ 9వ తేదీకి వాయిదా పడటం, ఆ తర్వాత తీర్పు రావడానికి సమయం పట్టే అవకాశముండటంతో భువనేశ్వరి బస్సు యాత్ర త్వరలోనే మొదలుపెట్టనున్నారని సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *