పొలిటికల్‌ ట్రయాంగిల్‌ ఫైట్‌

హైదరాబాద్‌, అక్టోబరు 6
ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలనే పొలిటికల్‌గా వాడుకోవాలనుకుంటోంది బీఆర్‌ఎస్‌. ఎన్డీయేలో తాము చేరడం కాదని, మొదట తమను ఆహ్వానించిందే బీజేపీ అంటూ కౌంటర్‌ అటాక్‌ మొదలుపెట్టారు మంత్రి కేటీఆర్‌. 2018 నాటి క్లిప్‌ను యాడ్‌ చేస్తూ ట్వీట్స్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఎన్నో పార్టీలు ప్రయత్నించాయని, అందులో బీజేపీ కూడా ఒకటంటూ బాంబు పేల్చారు. అవసరమైతే కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని 2018లో స్టేట్‌మెంట్‌ ఇచ్చింది బీజేపీనేనని గుర్తుచేశారు. అప్పటి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విూడియా క్లిప్స్‌ను కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు కేటీఆర్‌. ఢల్లీి బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్‌ పొత్తుకు సిద్ధమయ్యారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఏదేమైనా మోదీ చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు కొంత కలిసి వస్తుందనే చెప్పాలి. తాము ఎవరికీ బీ`టీమ్‌ కాదని చెప్పడానికి ఇంతకు మించిన సందర్భం దొరకదు. అందుకే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు.మోదీ, కేసీఆర్‌ మధ్య ఫైట్‌గానే మిగిలిపోతే అది కాంగ్రెస్‌కే మైనస్‌. కాని, ఈ ఇష్యూలో కాంగ్రెస్‌కు కూడా పాత్ర దొరికింది. నిజానికి కాంగ్రెస్సే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. బీఆర్‌ఎస్‌, బీజేపీది ఫెవికాల్‌ బంధం అంటూ తాము ఎప్పటి నుంచో చెబుతున్న విషయం ఇన్నాళ్లను నిజమైందంటూ కౌంటర్స్‌ ఇచ్చారు రేవంత్‌ రెడ్డి. మోదీ ఆశీస్సులతో కేటీఆర్‌ను సీఎం చేయాలనుకున్నది నిజమని నిర్ధారణ అయిందన్నారు. అటు రాహుల్‌గాంధీ సైతం రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రహస్య ఒప్పందాన్ని తాను ముందే చెప్పానని, దాన్నే నిజామాబాద్‌ వేదికగా ప్రధాని మోదీ బహిరంగంగా అంగీకరించారని రాహుల్‌ గాంధీ విమర్శించారు.అటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కూడా బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకునే అవకాశం దొరికింది. మధ్యలో కాంగ్రెస్‌ పార్టీని కూడా టచ్‌ చేస్తుండడంతో.. ఆ పార్టీకి కూడా రాజకీయ ప్రయోజనం దక్కుతోంది. ఇలాంటి ముక్కోణపు పోటీ తెలంగాణ వచ్చిన తరువాత ఇంత వరకు చూడలేదు. అయితే బీఆర్‌ఎస్‌`బీజేపీ మధ్య వార్‌ నడిచేది, లేదంటే బీఆర్‌ఎస్‌`కాంగ్రెస్‌ మధ్య వార్‌ ఉండేది. ఇప్పుడు మూడు పార్టీల మధ్య ఏకకాలంలో పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. మోదీ చెప్పిన ఒక్క రహస్యానికే తెలంగాణలో ఇంత పొలిటికల్‌ యాక్టివిటీ జరుగుతుంటే.. మున్ముందు స్టోరీ ఇంకా ఉందంటున్నారు. అప్పుడెలా ఉంటుందో చూడాల్సిందే. అయితే.. ఇక్కడ కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది.బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ`టీమ్‌ అనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. వాటిని పూర్తిగా తుడిచిపెట్టడానికే అలా మాట్లాడి ఉంటారు. గల్లీలోనే కాదు ఢల్లీిలోనూ తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ప్రజల్లో ఓ నమ్మకం తేవడానికి జరిగిన ప్రయత్నం అయి ఉండొచ్చు. బండి సంజయ్‌ను పక్కనపెట్టడం ద్వారా బీజేపీకి కొంత డ్యామేజ్‌ జరిగిందన్నది నిజం. అదే సమయంలో మంత్రి కేటీఆర్‌ మూడు రోజుల పాటు ఢల్లీిలో మకాం వేశారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆ సమయంలో వచ్చిన రూమర్స్‌ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. సో, చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే తప్ప పరిస్థితి మారదు. అందుకే, ఆ రహస్యం బయటపెట్టి ఉండొచ్చు. ఈమధ్యకాలంలో పొలిటికల్‌ టాపిక్‌ మొత్తం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చుట్టే జరుగుతోంది. ఆ పొలిటికల్‌ సీన్‌ను మార్చడానికి ఆ రహస్యం చెప్పి ఉండొచ్చు. కొంతకాలంగా బీజేపీ సీనియర్లు యాక్టివ్‌గా కనిపించడం లేదు. బీఆర్‌ఎస్‌తో సరైన ఫైట్‌ చేయడం లేదనేదే ప్రధాన కారణం. పైగా కొత్త చేరికలు లేవు. వీటన్నింటినీ ఒకే ఒక్క అస్త్రంతో చేధించాలనుకున్నారు కాబోలు. అందుకే, మోదీ అలా చెప్పి ఉండొచ్చు. కర్నాటక ఫలితాల వరకు తెలంగాణలో ద్విముఖ పోరే ఉంది. అది కూడా బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే నడిచింది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అందుకే, ద్విముఖ పోరును త్రిముఖ పోరుగా మార్చడానికి ఆ రహస్యం బయటపెట్టి ఉండొచ్చు. కారణం ఏదైనా సరే.. కుటుంబ పార్టీ, అవినీతి పాలన అంటూ బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తూ వచ్చిన ప్రధాని మోదీ.. మొదటిసారి కేసీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత మేయర్‌ పోస్టుపై ప్రతిపాదనలు చేయడం నుంచి కేటీఆర్‌ను సీఎం చేయాలనుకోవడం వరకు కేసీఆర్‌ జరిపిన సంప్రదింపులన్నింటినీ మోదీ ప్రస్తావించారు.ప్రధాని మోదీ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ నుంచి కౌంటర్‌ వచ్చింది గానీ.. సీఎం కేసీఆర్‌ మాట్లాడితేనే దానికి వెయిటేజ్‌ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. సీఎం కేసీఆర్‌ ఢల్లీికి వెళ్లినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్లారని బీఆర్‌ఎస్‌ చెప్పుకునేది. కాని, ప్రధాని మోదీ మాత్రం కేసీఆర్‌ ఢల్లీి టూర్‌లోని మరో వర్షన్‌ను ప్రజలకు చూపించారు. ఢల్లీిలో జరిగిన విూటింగ్స్‌ అన్నీ రాజకీయ అవసరాల కోసమే అన్నట్టుగా మోదీ చెప్పుకొచ్చారు. అంటే.. ఈ ఎపిసోడ్‌లో వివరణ ఇచ్చుకోవాల్సింది సీఎం కేసీఆరే. మరి ప్రధాని వ్యాఖ్యలపై కేసీఆర్‌ రియాక్ట్‌ అవుతారా? లేక మౌనంగా ఉండిపోతారా? లేదంటే మోదీకి సంబంధించిన రహస్య అంశాలను సీఎం కేసీఆర్‌ బయటపెడతారా? అనేదే ఇప్పుడు సస్పెన్స్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *