వరుస లీకేజీలతో… టెన్షన్‌.. టెన్షన్‌

పేపర్‌ లీకేజ్‌…. ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌..! పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తో మొదలైన ఈ పర్వం… ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షల వరకు చేరింది. లక్షలాది మంది నిరుద్యోగులు… ప్రిపేర్‌ అవుతూ పరీక్షలు రాస్తున్న వేళ… లీకేజీ అంశం గందరగోళానికి తెరలేపినట్లే అయింది. ఫలితంగా కీలకమైన గ్రూప్‌ 1 వంటి పరీక్షలు కూడా రద్దయ్యాయి. మరికొన్ని పరీక్షలు రద్దు కావటంతో పాటు… జరగాల్సిన పరీక్షల తేదీలు కూడా మారాయి. ఈ కేసుపై సిట్‌ విచారణ జరుగుతుండగా… మరోవైపు రాజకీయ పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌ టార్గెట్‌ గా బీజేపీ, కాంగ్రెస్‌ తో పాటు వైఎస్‌ఆర్టీపీ, బీఎస్పీ వంటి పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో .. పేపర్‌ లీకేజ్‌ వ్యవహరం ప్రభావం చూపుతుందన్న చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో… పేపర్‌ లీక్‌ అంశం నిజంగానే ఓటర్లను ప్రభావితం చేస్తుందా..? అధికార బీఆర్‌ఎస్‌ కు గట్టి ఎదురుదెబ్బ తగలటం ఖాయమేనా..? ప్రతిపక్షాల ప్లౌన్‌ వర్కౌట్‌ కాబోతుందా..? అసలు ఏం జరగబోతుందనేది టాక్‌ ఆఫ్‌ ది తెలంగాణగా మారింది.టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసు అనేది వ్యవస్థ వైఫల్యం కాదని… ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు అని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ చెప్పిన సంగతి తెలిసిందే. రిక్రూట్‌ మెంట్‌ ప్రాసెస్‌ ను పూర్తిగా నిలిపివేసేలా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుట్ర చేస్తున్నాయంటూ కూడా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఓ రేంజ్‌ లోనే టార్గెట్‌ చేస్తున్నాయి. లీకేజీ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ దిగిపోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఫలితంగా రాష్ట్ర రాజకీయమంతా ప్రస్తుతం దీని చుట్టే నడుస్తోందని సింగిల్‌ మాటలో చెప్పొచ్చు.లీకేజ్‌ వ్యవహారంలో కేసీఆర్‌ కుటుంబానికి ప్రమేయం ఉందని ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఇంకోవైపు ‘సిట్‌’ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఇదే టైంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై కూడా ఫోకస్‌ చేస్తోంది సిట్‌. చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలను కూడా ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ రకంగా కేసీఆర్‌ సర్కార్‌ కు ఇది పెద్ద సమస్యగా మారిందనే చెప్పొచ్చు. ఓవైపు ఢల్లీి లిక్కర్‌ కేసులో కవితకు ఉచ్చు బిగిస్తుండగానే… మరోవైపు పేపర్‌ లీకేజీ అంశం తెరపైకి రావటంతో కేసీఆర్‌ సర్కార్‌ కు గట్టి ఎదురుదెబ్బగా మారిందనే చెప్పొచ్చు.ఇక ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్‌ చెప్పినట్లు ఇప్పటికీ ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సందర్భం వచ్చిన ప్రతిసారి కేసీఆర్‌ ను ఈ విషయంలో టార్గెట్‌ చేస్తూనే ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగాల హావిూని మరిచిపోయారంటూ విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి. నిజానికి తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌…. నియామకాల విషయంలో వెనకబడ్డారన్న వాదన కూడా బలంగానే ఉంది. సీన్‌ కట్‌ చేస్తే ఇదే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు మరికొద్ది నెలలే టైం ఉంది. ఇలాంటి కీలక సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసు తెరపైకి రావటం హాట్‌ టాపిక్‌ గా మారింది. అయితే ఈ అంశం వచ్చే ఎన్నికలను ప్రభావితం చేసి తీరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.నిజానికి విూడియాలో జరిగే చర్చలు, రాజకీయ నేతలు చేసే ఆరోపణలు, ప్రత్యారోపణలు వంటి అంశాలు? తెలంగాణ ఓటరును ప్రభావితం చేయటం కాస్త కష్టతరమైనదనే అంటున్నారు పలువురు విశ్లేషకులు. దీనికి 2018 ఎన్నికల ఫలితాలే ఓ ఉదాహరణ అని చెప్పుకొస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటం(నీళ్లు, నిధులు, నియమాకాల)లో కేసీఆర్‌ విఫలమయ్యారనే విమర్శలు పెద్ద ఎత్తన వచ్చినప్పటికీ మరోసారి ఆయనకే పట్టం కట్టారు. ఇక విద్యార్థుల కోణంలో చూస్తే… బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొలువులు ఇవ్వటంలో విఫలమైందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఉస్మానియా వర్శిటీ వేదికగా పలు విద్యార్థి సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి పోరాటం చేస్తూనే ఉన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వటంలో కేసీఆర్‌ పూర్తిగా సఫలీకృతం కాలేదని ఆరోపిస్తున్నారు. స్వరాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేని కేసీఆర్‌ ను ఓడిరచి తీరాలంటూ పిలుపులు ఇస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. వర్శిటీలను పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ను దుయ్యబడుతూనే ఉన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఒత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా తొమ్మిదేళ్లుగా వారు పోరాటం చేస్తున్నది ఒక ఎత్తు అయితే…. పేపర్‌ లీకేజ్‌ ఎపిసోడ్‌ తో మరో టర్న్‌ తీసుకున్నట్లు అయింది. వారికి గతంలో పెద్దగా మద్దతు ఇవ్వని ప్రతిపక్ష పార్టీలు… ప్రస్తుతం వారి చుట్టే తిరిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇక కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాలకు 2018 ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం రుచించలేదని చెప్పొచ్చు. ఆయన్ను ఓడిరచాలన్న కసి నెరవేరలేదు.. పైగా భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం కూడా కేసీఆర్‌ ను ఓడిరచాలన్న అభిప్రాయంతో పలు విద్యార్థి సంఘాలు ఉన్నాయి. పేపర్‌ లీకేజ్‌ ఎపిసోడ్‌ తో కేసీఆర్‌ అధికారం కోల్పోవటం ఈజీనే అన్న అంచనాకు వస్తున్నారు. అయితే నిజానికి పేపర్‌ లీక్‌ అనేది కొత్త విషయం ఏవిూ కాదు. ఒక్క తెలంగాణలోనే ఇలాంటి ఘటన జరగలేదని గమనించాలి. గతంలో చూస్తే గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ తో పాటు పలు రాష్ట్రాల్లో కూడా లీకేజీ ఘటనలు వెలుగు చూశాయి.గుజరాత్‌ విషయానికి వస్తే 2014 నుంచి తొమ్మిదికి పైగా పరీక్షా పత్రాలు లీకేజీ అయ్యాయి. ఫలితంగా ప్రతిపక్ష పార్టీలు అక్కడి సర్కార్‌ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.‘‘పేపర్‌ లీక్‌ ప్రభుత్వం’’ అనే పేరు కూడా పెట్టాయి అయితే ఈ క్రమంలో జరిగిన ఏ ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపించలేదు. అధికార పక్షానికి మరోసారి పట్టం కట్టిన పరిస్థితులు దర్శనమిచ్చాయి. ఇలాంటి సమస్యల ద్వారా(పేపర్‌ లీక్‌) సామాన్య ఓటర్లు ప్రభావితం కావటం చాలా అరుదు అనేది ఈ ఫలితాల ఆధారంగా నిరూపితమైందని పలువురు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.అయితే ప్రస్తుతం పేపర్‌ లీకేజ్‌ దృష్ట్యా… తెలంగాణలోని కేసీఆర్‌ పాలనపై ఓటర్లు తీవ్రమైన అసంతృప్తితో పాటు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2018 ఎన్నికల మాదిరిగా… వచ్చే ఎన్నికల్లో కూడా నీళ్లు, నిధులు, నియమాకాల కోణంలో ఓటింగ్‌ జరగకపోవచ్చనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ అంశాలే ప్రధానంగా లేదా కేంద్రీకృతంగా ఓటింగ్‌ జరగకపోవచ్చనే చర్చ కూడా ఓ వైపు నుంచి వినిపిస్తోంది.మొన్నటి వరకు తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ బీజేపీపై బీఆర్‌ఎస్‌ ఆరోపణలు గుపిస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య పెద్ద డైలాగ్‌ వారే నడుస్తోంది. ఈ క్రమంలో పేపర్‌ లీక్‌ పరిణామం చోటు చేసుకోవటంతో మరో టర్న్‌ తీసుకుంది. ఈ పరిస్థితులను కాంగ్రెస్‌ కాస్త అనుకూలంగా మార్చుకుంటే.. రెండు పార్టీలను సూటిగా కార్నర్‌ చేసే అవకాశం ఉందన్న టాక్‌ కూడా ఉంది. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ,తో పాటు ఇతర పక్షాలు కలిసి ‘టీ` సేవ్‌ వంటి వేదికలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా జరిగిపోతున్నాయి. యూత్‌ ను ఏకతాటిపై తీసుకొచ్చి… ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సీన్‌ లు కూడా కనిపిస్తున్నాయి.నిజానికి 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో అగ్రభాగాన నిలిచాయని చెప్పొచ్చు. బీఆర్‌ఎస్‌ ను అధికారంలోకి తీసుకురావటానికి కూడా ఇవే ఉపకరించాయని సింగిల్‌ వర్డ్‌ లో చెప్పొచ్చు. ఈ టైంలో నిరుద్యోగులను కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితులు లేవు. అయినప్పటికీ కేసీఆర్‌ సునాయసంగా విజయం సాధించారు. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చంటే?. సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొనే సగటు తెలంగాణ ఓటరు ప్రభావితం అవుతున్నారని అనొచ్చు?! నిరుద్యోగం, పేపర్‌ లీక్‌ వంటి అంశాలతో ఓటర్లను ప్రభావితం చేయటం కాస్త కష్టతరమేనే పలువురు చెబుతున్నారు. ఇలాంటి అంశాలతో ప్రతిపక్ష పార్టీలను కూడా నమ్మే అవకాశం లేదని అంటున్నారు. ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో జరగకపోవచ్చని గ్యారెంటీ ఇస్తారా అన్న చర్చ కూడా ప్రజల్లో ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తంగా తాజా పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు గట్టి అస్త్రాలతోనే బరిలో దిగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రభుత్వంపై విపక్షాలు కుట్ర చేస్తున్నాయంటూ తిప్పికొడుతూ? బీఆర్‌ఎస్‌ కూడా ఎన్నికల రణరంగంలోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ లీకేజ్‌ వ్యవహారం మాత్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓ మాయని మచ్చే అని పలువురు అంటున్నారు. అయితే ఇది ఎంత వరకు తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేస్తుంది?? ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఎంతవరకు తోడ్పడుతుంది..? సైలెన్స్‌ ఓటింగ్‌ ఎటువైపు మళ్లుతుంది..? వంటి ప్రశ్నలను మాత్రం ఫర్‌ ఫెక్ట్‌ గా అంచనా వేయలేమని చెప్పొచ్చు..! మరికొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికల ఫలితాలే? వీటికి సమాధానం అని భావించవచ్చు?.!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *