నేడు ప్రపంచ టెలి కమ్యూనికేషన్‌, సమాచార సొసైటీ దినోత్సవం

ప్రపంచ టెలి కమ్యూనికేషన్‌, సమాచార సొసైటీ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 17న నిర్వహించబడుతుంది. సాంకేతికత (టెక్నాలజీ) ద్వారా వచ్చే అవకాశాలపై అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.టెలి కమ్యూనికేషన్‌ దినోత్సం: మొదటిసారిగా మే 17, 1968లో ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ దినోత్సవం జరుపుకున్నారు. మే 17న అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ యూనియన్‌ స్థాపించారు. అలాగే మొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ కన్వెన్షెన్‌ పై 1865 మే 17న పారిస్‌లో సంతకం చేశారు. అందువల్ల మే 17ను ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ దినోత్సవంగా ప్రకటించారు.సమాచార సొసైటీ దినోత్సవం: 2005లో ట్యూనిస్‌లోని ఇన్ఫర్మేషన్‌ సొసైటీపై ప్రపంచ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ సమాచార సొసైటీ దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య తీర్మానం ద్వారా ప్రకటించబడిరది.2006, నవంబరులో టర్కీలోని అంటాల్యాలో జరిగిన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ ప్లీనిపోటెన్షియరీ కాన్ఫరెన్స్‌ లో ఈ
రెండిరటిని కలిపి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ టెలి కమ్యూనికేషన్‌, సమాచార సొసైటీ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించబడిరది.సుదూర ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గంచేలా కమ్యూనికేషన్‌ని వ్యాప్తి చేయడమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. మన జీవితంలో కమ్యూనికేషన్‌ ఎంత కీలకమైనదో అవగాహన పెంచడం, ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం వంటివి ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యాలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *