నల్లారి సైలెంట్‌..ఎందుకో

తెలుగు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీల మధ్య వ్యూహరచనలు పదునెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆఖరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి మౌనం మరోసారి చర్చగా మారింది. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన అనంతరం గతంలో మాదిరిగానే మౌనం వహించడం హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య రాగం వినిపించిన ఆయన కాంగ్రెస్‌ను వీడి సొంతగా పార్టీని స్థాపించారు.అనంతరం తిరిగి కాంగ్రెస్‌ గూటికే తిరిగి వచ్చినా అక్కడి నుంచి బయటకు వచ్చి సరిగ్గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీజేపీలో చేరిన నల్లారి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనేది చర్చ జోరుగా జరిగింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి సేవలను బీజేపీ అధిష్టానం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగిచుకోబోతోందనే టాక్‌ వినిపించింది. కర్ణాటక ఎన్నికల్లో ఆయన సేవలు ఉంటాయనే ఊహాగానాలు వినిపించాయి. కానీ బీజేపీలో చేరిన సందర్భంగా కాంగ్రెస్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన నల్లారి.. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయారు.కిరణ్‌ కుమార్‌ రెడ్డి సరిగ్గా కర్ణాటక ఎన్నికలకు ముందు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయనకు పార్టీలో సౌత్‌ ఇండియా లెవెల్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరిగింది. కర్ణాటక ఎన్నికలు పూర్తవడం, అక్కడ కాంగ్రెస్‌ గ్రాండ్‌ విక్టరీ సాధించడం జరిగిపోయాయి. అయితే రాజకీయంగా ఇంతటి పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఆయన మాత్రం ఎక్కడా విూడియాలో కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. తెలుగు రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి గతంలో మాదిరిగానే బీజేపీలో చేరిన తర్వాత కూడా మౌనం వహించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *