అనంత కష్టాలు తీరేనా

టీడీపీకి గట్టిపట్టున్న ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి ప్రస్తుతం పెలుసు బారిపోయింది. కీలక నేతలే కవ్వించుకుంటున్నారు. అధికారపక్షానికి అవకాశం ఇవ్వకుండానే తన్నుకు చస్తున్నారు నేతలు. అలాంటి జిల్లాలో టీడీపీ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు త్రిసభ్య మంత్రం వేసింది అధిష్ఠానం. ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి బలమైన ప్రాంతం. అలాంటి చోట పార్టీకి నాయకులే సమస్యలు తీసుకొస్తున్నారని మూడేళ్లుగా కేడర్‌ గగ్గోలు పెడుతోంది. 2014లో టీడీపీ 12 చోట్ల గెలిచి.. రెండు ఎంపీ సీట్లను కైవశం చేసుకుంది. 2019 నాటికి సీన్‌ రివర్స్‌. 12 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. టీడీపీ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే గెలిచింది. జిల్లాలో పార్టీకి పట్టులేని ప్రాంతాల్లోనూ వైసీపీ భారీ విక్టరీ కొట్టింది. టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలే దానికి కారణమని పసుపు శిబిరంలో చర్చ జరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నికల ముందే టీడీపీ అధిష్ఠానం కొంత వర్కవుట్‌ చేసినా.. అవి ఫలించలేదు. చివరకు ఫలితాలు షాక్‌ ఇచ్చాయి. అయినప్పటికీ టీడీపీ నాయకుల్లో మార్పు రాలేదు.రాష్ట్రంలో ఎన్నికల మూడ్‌ క్రమేపీ బలపడుతుండటంతో టీడీపీ పెద్దలు చికిత్స ప్రారంభించారు. విభేదాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితిని సెట్‌ చేయాలని చూస్తోంది. ఇందుకోసం ముగ్గురు సీనియర్‌ నాయకులతో కోఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. యనమల రామకృష్ణుడు, బచ్చుల అర్జునుడు, టీడీ జనార్దన్‌ ఆ కమిటీలో ఉన్నారు. ఈ ముగ్గురు ఫీల్డ్‌ ఎంట్రీ ఇచ్చేశారు కూడా. పార్టీ నేతలను పిలిచి సమస్య ఏంటో తెలుసుకుంటున్నారు. ఇంతకాలం వన్‌సైడ్‌ వెర్షన్‌ వింటూ నిర్ణయాలు తీసుకున్న టీడీపీ అధిష్ఠానం ప్రస్తుతం పక్కా ప్లాన్‌తో వెళ్తున్నట్టు అభిప్రాయ పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలను పిలిచి వారు చెప్పేది నోట్‌ చేసుకుంటున్నారు నాయకులు. ఇప్పటికే శింగనమల సెగ్మెంట్‌ నేతల అభిప్రాయాలను.. అభ్యంతరాలను తెలుసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషాను పిలిచి మాట్లాడారాట.ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీకి సమస్యలు ఉన్నాయి. వీటిల్లో ఆరుచోట్ల అధిష్ఠానం జోక్యం చేసుకున్నా తగ్గేదే లేదన్నట్టుగా పరిస్థితి ఉంది. కల్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, మూడో గ్రూప్‌ మధ్య అస్సలు పడటం లేదు. శింగనమలలో బండారు శ్రావణి, టూమెన్‌ కమిటీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, కురుబ బబితల మధ్య అంతర్గత పోరు ఉంది. మడకశికరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిల మధ్య తారాస్థాయిలోనే వర్గపోరు కొనసాగుతోంది. వీరితోపాటు మరో రెండు నియోజకవర్గాల నేతలను కోఆర్డినేషన్‌ కమిటీ పిలిచి మాట్లాడబోతోంది.త్రిసభ్య కమిటీ.. నియోజకవర్గాల్లోని సమస్యలను ఆలకించడంతోపాటు రెండువైపుల వాదనలను నోట్‌ చేసుకుంటోంది. అన్ని సెగ్మెంట్లలో పరిస్థితిని అంచనా వేశాక.. రిపోర్ట్‌ను చంద్రబాబుకు అందచేస్తారట. దాంతో త్రిసభ్య కమిటీ ఇచ్చే రిపోర్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత చంద్రబాబు ఏం చేస్తారో.. ఏమో? మొత్తానికి మూడేళ్ల తర్వాత చేపట్టిన పెద్ద చికిత్స కావడంతో అందరి దృష్టీ చంద్రబాబు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *