యదేఛ్చగా నకిలీ విత్తనాలు

ఏటా ఇదేతంతు జరుగుతున్నా అధికారుల నిఘా కొరవడుతుంది. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే వచ్చిచేరాయి. పోలీసుల తనిఖీలలో కొన్నే బయటపడుతున్నాయి. రైతులకు చేరాల్సినవి చేరిపోతున్నాయి.ఆదిలాబాద్‌ ఉమ్మడిజిల్లాలో కొన్నిప్రాంతాలపై నకిలీ విత్తనాలు దాడి చేస్తున్నాయి. మారుమూల గ్రామాలను అక్కడి రైతులను మచ్చిక చేసుకుని నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. మంచిర్యాలజిల్లాలో ఒక్కరోజు తనిఖీలు చేపడితే ఒక క్వింటాల్‌ 18 కిలోల నకిలీవిత్తనాలు దొరికాయంటే ఏమేరకు నకిలీ రాయుళ్ళు వేళ్లూనుకుపోతున్నారో అర్థం అవుతుంది.మంచిర్యాలజిల్లా తాండూరు .భీమిని ,నెన్నెల, కన్నెపల్లి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు నిల్వచేశారు. తాండూర్‌ మండలంలో ఓవ్యాపారి ఏటా కోట్ల వ్యాపారం చేస్తున్నారనే విషయం ప్రచారంలో వుంది. గతంలో రెండుమూడుసార్లు పట్టుబడ్డా ఇప్పటికీ ఆ వ్యాపారం వదల్లేదు. తాండూరు ,రెబ్బన,తిర్యాణి మండలాలకు సైతం ఇక్కడినుంచే విత్తనాల సరఫరా జరుగుతుంది. వీరికి కొందరు పోలీసులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేసి నకిలీ విత్తనాలు అరికట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ ఫోర్స్‌ మూడుమండలాల్లో 118 కిలోల నకిలీ పత్తివిత్తనాలు సీజ్‌ చేశారు.బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలుర రైసుమిల్లులలో నిల్వ ఉంచారని సమాచారం అందగా అక్కడికి వెళ్ళేలోపే విత్తనాలు మాయం చేశారట. అయితే ఎవరో సమాచారం అందించారని ప్రత్యేక టీంలు భావించాయి. అక్కడ ఏటా ఆంధ్రప్రదేశ్‌ నుంచి కొంతమంది రైతుల ముసుగులో ఇక్కడికి వచ్చి హెచ్‌ జీ కాటన్‌ సీడ్స్‌ సేల్‌ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు నిల్వలు ఏర్పాటుచేయటంతో పాటు పలు గ్రామాల్లో రైతులకు అంటగట్టినట్టు తెలిసింది.తాజాగా నెన్నెల , తాండూర్‌, భీమిని పరిధిలోనే 118 కిలోల నకిలీ విత్తనాలు దొరికాయని, వీటిపై విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వ్యవసాయశాఖ నిఘా లేకపోవడంతో అక్రమార్కులు విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది రెండు పీడీయాక్ట్‌ లు, 20 కేసులు నమోదుచేశామని అధికారులు చెబుతున్నారు. మళ్ళీ నకిలీ విత్తనాలు నిల్వచేయడంతో కలకలం రేగుతోంది. టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఏదో చేస్తాం అని చెప్పినా నకిలీ రాయుళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. గతంలో కేసుల్లో వున్నవారు అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అధికారులు పకడ్బందీ చర్యలు చేపటకపోతే రైతులు భారీగా నష్టపోకతప్పదంటున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *