కేసీఆర్‌ ఇలాకాలోకి రేవంత్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాదయాత్ర మళ్లీ తిరిగి ప్రారంభం కానున్నది. ఈ నెల10న జుక్కల్‌ నుంచి హాథ్‌ సే హాథ్‌ పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌, సిద్ధిపేట్‌ జిల్లాలను సమన్వయం చేస్తూ ఈ పాదయాత్ర కొనసాగనున్నది. 25వ తేదీ వరకు ఈ పాదయాత్ర గజ్వేల్‌?సవిూపంలోకి చేరుకుంటుంది. ఈ విడత సీనియర్లంతా హాజరు కావాలని స్వయంగా రేవంత్‌ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం.పాదయాత్రలు జరుగుతున్న ప్రతి ముఖ్యమైన స్ట్రీట్‌?కార్నర్‌లో ఒక విూటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులకు భరోసా ఇచ్చేలా పాదయాత్రలో చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే రేవంత్‌ ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లోని ప్రధాన ఏరియాల్లో పాదయాత్రలను సమన్వయం చేశారు. ప్రజల నుంచి పాజిటివ్‌?సవిూకరణాలు వస్తుండటంతో నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట్‌ జిల్లాలు కలుపుకొని పాదయాత్ర చేయాలని రేవంత్‌ నిర్ణయించుకున్నారు.కాంగ్రెస్‌?పార్టీ సోమవారం నుంచి పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించింది. గాంధీభవన్‌ వేదికగా షురూ చేయనున్నారు. రాహుల్‌ అనర్హతపై పీఎం మోడీలకు లేఖలు రాయనున్నారు. టీపీసీసీ లీడర్లు, అనుబంధ సంఘాలన్నీ మోడీకి పోస్టు కార్డులు పంపనున్నారు. అదానీకి అనుకూలంగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాల విషయంలో, రాహుల్‌?అనర్హత అంశాలపై మోడీకి పోస్టు ద్వారా కార్డులు పంపివ్వనున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమం జరగనున్నది. కార్యకర్తలు, లీడర్లు, యువతతో పెద్ద ఎత్తున పోస్టు కార్డు ఉద్యమం చేపించాలని పార్టీ ముందుకు సాగుతున్నది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *