కులాల వారీగా రాజకీయాలు

విశాఖపట్టణం, జూన్‌ 29, (న్యూస్‌ పల్స్‌)
నారా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలతో అధికారాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలో అధికారానికి ఎలా చేరువయ్యారు,అధికారాన్ని ఎలా దక్కించుకున్నారు అనేది అందరికి తెలిసిందే.దీనిపై వాదనలు, విమర్శలు ఎలా ఉన్న అధికారంలోకి రావడం ద్వారా తమ కులాన్ని ముఖ్యమంత్రి పీఠంపై నిలబెట్టుకోగలిగారుముఖ్యమంత్రి పదవిలోకి రావడానికి కులం మాత్రమే పనిచేయదు. అన్ని కులాలు కలిసి నాయకత్వాన్ని బలపరిస్తేనే పాలక కులానికి అధికారం వస్తుందనే సంగతి ఆ పార్టీల నాయకత్వానికి తెలియని విషయం కాదు. తమ కులాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మిగిలిన కులాల్ని ఎప్పుడు, ఎలా, ఎంత మేరకు వాడుకోవాలన్న చాతుర్యం విూదే గెలుపొటములు ఆధారపడుతున్నాయి.పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు,నాలుగున్నరేళ్లు పూర్తి చేసుకున్న జగన్మోహన్‌ రెడ్డి.. ఇద్దరూ చిత్రంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా కులం చట్రంలో చిక్కుకుపోవడం కాకతాళీయం కాకపోవచ్చు.ముఖ?యమంత్రి పీఠం ఎక్కగానే దాని చుట్టూ మొదట కులం కోటరీలు కమ్ముకోవడం యాధృచ్ఛికంగా ఏమి కాదు.తమ పదవి పదిలంగా ఉండటానికి విశ్వసనీయమైన మనుషులు తమ కులంలో మాత్రమే ఉంటారనుకోవడమే ఈ ధోరణికి కారణంగా కనిపిస్తుంది.అన్ని కులాలకు ప్రాధాన్యత, జనాభా ఆధారంగా పదవులు అని చెప్పే లెక్కలు సొంత కులం విషయంలో మాత్రం కనిపించవు. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ రెండు ఒకటే. ముఖ్యమంత్రి కార్యాలయాల్లో.. ముఖ్యమంత్రి అంతరికులుగా పనిచేసే వారిలో తమ కులం వారే తప్పనిసరిగా ఉండేలా రెండు పార్టీలు ఎలాంటి సంకోచం లేకుండా వ్యవహరించాయి.2014లో రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదట బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి కీలక బాధ్యతల్లో తమ కులానికి చెందిన అధికారుల్నే నియమించుకున్నారు. నామినేటెడ్‌ పదవులు, రాజ్యాంగ బద్దమైన పదవుల్లో తమ కులం మనుషుల్ని పెట్టుకోవడం అనే సంప్రదాయాన్ని చాలా కాలం క్రితమే ప్రారంభిస్తే ఇప్పుడు దానిని ఆచారంగా కొనసాగిస్తున్నారు.చంద్రబాబు హయంలో చినరాజప్పకు హోంమంత్రి పదవి ఇచ్చినా, జగన్మోహన్‌ రెడ్డి సుచరిత, తానేటి వనిత వంటి దళిత మహిళలకు ముఖ?యమంత్రి తర్వాత కీలకమైన హోంశాఖను కట్టబెట్టినా ఆ శాఖకు సంబంధించిన అసలైన అధికారాలు మాత్రం వారి దగ్గర ఉండవనేది జగమెరిగిన సత్యం. బీసీల పార్టీ అనిచెప్పుకునే టీడీపీలో అయినా, దళితులు, మైనార్టీల పక్షమని చెప్పుకునే వైసీపీలో అయినా రిజర్వేషన్ల మేరకు మాత్రమే వారికి పదవులు వరిస్తాయి.ఎలాంటి లాజిక్కులు లేకుండానే క్యాబినెట్‌ పదవులైనా, నామినేటెడ్‌ పదవులైనా అయా పార్టీల పాలక కులానికి మాత్రం అగ్ర తాంబులం దక్కుతుంది.చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వచ్చిన రాజమౌళి, ఏబి వెంకటేశ్వరరావు వంటి వారు చక్రం తిప్పితే, వైసీపీ హయంలో ధనుంజయరెడ్డి వంటి అధికారులకు సిఎంఓలో ప్రాధాన్యత లభించింది. ముఖ్యమంత్రుల కోటరీలో సొంత సామాజిక వర్గ బ్యూరోక్రాట్లు అనేది విడదీయరాని వ్యవహారంగా మారిపోయింది.చంద్రబాబు నాయుడు తన చుట్టూ ఎప్పుడు అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఉంటున్నట్లు జనాలకు కనిపించేలా జాగ్రత్తలు అయినా తీసుకునే వారుజగన్మోహన్‌ రెడ్డి దానిని కూడా పూర్తిగా వదిలేశారు. తనకు నచ్చిన వారికి ఎవరేమనుకున్న అందలం ఎక్కించడం ఆయన నైజంగా కనిపిస్తుంది. అలాంటి విషయాల్లో ఎవరి విూదైనా విమర్శలు వస్తే చంద్రబాబు కాస్త జంకి,వెనక్కి తగ్గేవారు. జగన్‌ మాత్రం విమర్శలకు భయపడి తన వారిని దూరం చేసుకునే ప్రయత్నాలు ఏమాత్రం చేయరు. తాను అనుకున్నది జరిగిపోవాలనుకుంటారు.చంద్రబాబు నాయుడు హయంలో సొంత సామాజికి వర్గానికి చెందిన వారికి ఎనలేని ప్రాధాన్యం దక్కింది. అదే బాటలో ఇప్పుడు జగన్‌ కూడా నడుస్తున్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కాకుండా నమ్మిన నాయకులు, బ్యూరోక్రాట్లు చాలా మంది సొంత వర్గానికి చెందిన వారున్నారు. వ్యక్తిగత సిబ్బంది మొదలుకుని ప్రభుత్వ సలహాదారులు, అడిషనల్‌ ఏజీ, టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌, యూనివర్శిటీల ఛాన్సలర్లు,రిజిస్ట్రార్లు, సమాచార కమిషనర్లు, కీలకమైన నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారు వందమందికి పైగానే కనిపిస్తారు. ఇంతే స్థాయిలో మిగిలిన కులాలకు ప్రాధాన్యత ఎందుకు దక్కదంటే కులం మాత్రమే కారణం కాబట్టి ఇతర సందేహాలు అవసరం లేదు.పాలక పార్టీల కులానికి మాత్రమే ప్రాధాన్యత దక్కుతుందనే విషయంలో ప్రజలకు కూడా పెద్దగా ఎలాంటి ఆక్షేపణ కనిపించదు. అధికారంలో ఉన్న పార్టీలు తీరు అంతే కాబట్టి మిగిలిన వారు ఐదేళ్లు చూస్తూ పోవాల్సిందేననే అభిప్రాయం జనంలో కూడా ఏర్పడిపోయింది. ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తుల కులాలకు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులు ఏ రాష్ట్రంలో ఉన్నా పదవులు వారిని వెదుక్కుంటూ వచ్చేస్తాయి. డిప్యూటేషన్లు, అనుమతులు క్షణాల్లో మంజూరవుతాయి. కీలక పోస్టింగుల్లో వారికి ప్రాధాన్యత దక్కుతుంది. చంద్రబాబు హయంలో ఐఏఎస్‌ అధికారి రాజమౌళి, ప్రస్తుతం టీటీడీ ఈవో ధర్మారెడ్డి వంటి వారి నియమకాలు ఓ చిన్న ఉదాహరణలు మాత్రమే.కులాన్ని అడ్డు పెట్టుకుని పాలకుల ప్రాపకం పొందడం, ప్రభుత్వాల్లో పెత్తనం చలాయించడం సర్వసాధారణం అయిపోయింది.ఇక డీజీపీ వంటి పోస్టుల వ్యవహారాల్లో సీనియారిటీతో పాటు తమ వాడా కాదా అనే లెక్కలు వేసే ధోరణి రాష్ట్రంలో ఎప్పట్నుంచో ఉంది. విధేయతతో పాటు కులానికి తగిన ప్రాధాన్యతనివ్వడం ఆనవాయితీగా మారిపోయింది. పార్టీలు ఏవైనా కులానికి అతీతంగా పాలించడం అనేది ఏపీలో నేతిబీరకాయలో నేతి చందమే.నామినేటెడ్‌ పదవుల విషయంలో కూడా ప్రాధాన్యత కలిగినవి,పుష్కలంగా ఆదాయ వనరులు ఉండే సంస్థలు, పేరు ప్రఖ్యాతులు వచ్చేవి తమ కులాలకు కేటాయించి, మిగిలిన చిన్నాచితక సంస్థలు, కార్పొరేషన్లు వంటి వాటిని కింద కులాలకు పంచిపెడుతుంటారు.ఏపీలో మూడేళ్ల క్రితం 56కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందరికి పదవులు ఇచ్చేశారు. వాటి ద్వారా ఏమి సంక్షేమాన్ని ప్రత్యేకంగా అయా కులాలకు అమలు చేశారంటే మాత్రం సమాధానాలు కష్టం.కొసమెరుపు ఏమిటంటే రెండు పార్టీల్లోని దళితులు, వెనుకబడిన వర్గాలు తమ నాయకుల్ని అభినవ ఫూలే, అంబేడ్కర్‌లు అంటూ కీర్తించడానికి కూడా ఏ మాత్రం సంకోచించరు. తమ అభిమాన నాయకుల్ని ప్రసన్నం చేసుకోడానికి కాళ్ల విూద పడటానికి కూడా సిద్ధమైపోతారు. అవే పార్టీల్లో ఉన్న అగ్రకులాల నాయకులు ఎన్నాడైనా అలా కాళ్లవిూద పడి విధేయత ప్రదర్శిస్తారా అనే సంకోచం కూడా వారికి ఉండదు.పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు తమ పదవికి డోకా లేకుండా ఉంటే చాలనుకుంటారు.ఆ పార్టీకి అధికారం పోగానే దానికి బైబై చెప్పేసి అధికారంలో ఉన్న పార్టీలోకి దూకేస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *