చంద్రుడిపై భారత ముద్ర

చంద్రుడి ఉపరితలంపై భారత్‌ శాశ్వత ముద్ర వేసింది. చంద్రయాన్‌ 3విజయవంతం కావడమే కాకుండా, జాబిల్లిపై రోవర్‌ ల్యాండ్‌ అయిన తరువాత ఈ రోవర్‌ చక్రాలపై ఉన్న ముద్ర శాశ్వతంగా చంద్రుడి ఉపరితలంపై ఇలా ముద్రపడిపోయింది. ఇస్రో లోగో, భారత జాతీయ చిహ్నం చంద్రుని ఉపరితలంపై శాశ్వతంగా నిలిచిపోయాయి. చంద్ర గ్రహంపై గాలి లేని కారణంగా అవి ఎప్పటికీ చెక్కు చెదరవు. దీంతో జాబిల్లిపై భారత్‌ ముద్ర ఆచంద్రతారార్కం అలా వెలుగొందుతూనే ఉంటుంది. ఇస్రో శాస్త్రవేత్తలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చంద్రయాన్‌ 3 స్పేస్‌ క్రాఫ్ట్‌ ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి నేలపైన సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ విజయవంతం అయింది. తద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. దాదాపు 7 వారాలుగా ఎదురు చూస్తున్న భారతీయులు విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ వీక్షిస్తూ సంబరపడ్డారు. చంద్రయాన్‌ 2 నేర్పిన పాఠాలతో భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్‌ 3లో విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. చంద్రయాన్‌ 3 స్పేస్‌ క్రాఫ్ట్‌ చంద్రుడి నేలపైన సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ విజయవంతం అయింది. 40 రోజులుగా ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ ఘట్టాన్ని చూసి ఆనందంతో సంబరపడిపోయాయి. సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ ప్రక్రియను తిలకించారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో సౌత్‌ పోల్‌ ను తాకిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్‌ అవతరించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది.సుమారు చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలో విూటర్ల ఎత్తులో ల్యాండర్‌ ఉండగా రఫ్‌ బ్రేకింగ్‌ ఫేస్‌ మొదలు అయింది. ఆ ఫేస్‌ సజావుగానే సాగినట్లుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో హారిజాంటల్‌ వెలాసిటీ 1200 విూటర్స్‌ పర్‌ సెకండ్‌ గా ల్యాండర్‌ వేగం ఉంది. ఒక్కసారి ఆటోమేటిక్‌ ల్యాండిరగ్‌ సిస్టమ్‌ (ఏఎల్‌ఎస్‌) యాక్టివేట్‌ అయిన అనంతరం గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి ఎలాంటి కమాండ్స్‌ ఇవ్వబోరని లైవ్‌ స్ట్రీమింగ్‌ కామెంటరీలో చెప్పారు. చంద్రుడి ఉపరితలం నుంచి 28 కిలో విూటర్ల ఎత్తులో విక్రమ్‌ ల్యాండర్‌ వర్టికల్‌ వెలాసిటీ 31 విూటర్స్‌ పర్‌ సెకండ్‌, హారిజాంటల్‌ వెలాసిటీ 1058 విూటర్స్‌ పర్‌ సెకండ్‌ గా ఉంది. సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ ప్రక్రియ మొదలైన సరిగ్గా 8 నిమిషాల తర్వాత 21 కిలో విూటర్ల ఎత్తులో ల్యాండర్‌ ఉంది. అప్పుడు హారిజాంటల్‌ వెలాసిటీ 745 విూటర్స్‌ పర్‌ సెకండ్‌, వర్టికల్‌ వెలాసిటీ 67 విూటర్స్‌ పర్‌ సెకండ్‌ వెలాసిటీలో ఉంది. ఈ 8 నిమిషాల్లో 700 కిలో విూటర్లకు పైగా దూరం ల్యాండర్‌ ప్రయాణించింది.రఫ్‌ బ్రేకింగ్‌ ఫేస్‌ తర్వాత స్టాండ్‌ బై స్టేజ్‌ లేదా ఆల్టిట్యూడ్‌ హోల్డ్‌ ఫేస్‌ మొదలు అయింది. తర్వాత పైన్‌ బ్రేకింగ్‌ ఫేస్‌ మొదలు అయింది. ఇది మూడు నిమిషాలపాటు జరుగుతుంది. ఈ సమయంలో కూడా ఎలాంటి కమాండ్స్‌ గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి ఇవ్వలేదు. ఈ సమయంలో హారిజాంటల్‌ వెలాసిటీ 120 విూటర్స్‌ పర్‌ సెకండ్‌, వర్టికల్‌ వెలాసిటీ 28 విూటర్స్‌ పర్‌ సెకండ్‌ గా ఉంది. సరిగ్గా ఈ టైంలో ఉపరితం నుంచి ఎత్తు 1.2 కిలో విూటర్లుగా ఉంది. ఆ తర్వాత ల్యాండర్‌ ఉపరితలానికి లంబకోణం చేస్తూ తిరిగింది. మెల్లగా సెన్సార్ల సాయంతో హారిజాంటల్‌ వెలాసిటీ, వర్టికల్‌ వెలాసిటీని మరింత తగ్గించుకొని చంద్రుడి ఉపరితలం వైపు కదులుతూ ఉంది. చంద్రుడిపై దిగే ముందు హారిజాంటల్‌ వెలాసిటీ 0.4 విూటర్స్‌ పర్‌ సెకండ్‌, వర్టికల్‌ వెలాసిటీ 2 విూటర్స్‌ పర్‌ సెకండ్‌ గా ఉండి చివరికి ఉపరితలంపై క్షేమంగా దిగింది.దేశమంతా అరగంట పాటు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ ప్రక్రియను వీక్షించారు. చంద్రయాన్‌ విజయవంతం కావడంతో ప్రపంచ దేశాల అధినేతలు భారత్‌ కు అభినందనలు తెలుపుతున్నారు.భారతదేశం దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన క్షణాలను దాదాపు 9.1 మిలియన్ల మంది వీక్షించారు. ఇస్రో యూట్యూబ్‌ ఛానల్‌ లో 80,59,688 మందికి పైగా జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండిరగ్‌ ను లైవ్‌ చూశారు. మరోవైపు చంద్రయాన్‌`3 ల్యాండర్‌ చంద్రుని ఉపరితలాన్ని తాకినప్పుడు ఫేస్‌ బుక్‌ లో 3.55 మిలియన్ల మంది ఇస్త్రో శాస్త్రవేత్తలు సాధించిన ఈ ఘనతను వీక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *