కోహ్లీ బలం అదే.. ఆ మైండ్‌సెట్‌తో ఎప్పుడు ఆడినా కోహ్లీ విఫలం కాలేదు..!

రాయల్ ఛాలెంజర్స్ స్టార్ విరాట్ కోహ్లీ గురువారం రాత్రి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో, భారీ స్కోర్ ఛేజింగ్‌లో కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 62 బంతుల్లో వంద పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురువారం రాత్రి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో, భారీ స్కోర్ ఛేజింగ్‌లో కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRHvsRCB)తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో వంద పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌పై ప్రేక్షకులే కాదు.. మాజీ ఆటగాళ్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాడు. మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) కూడా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను మెచ్చుకున్నాడు.

“గురువారం కోహ్లీ తను ఎదుర్కొన్న మొదటి రెండు బంతులను బౌండరీకి తరలించాడు. కోహ్లీ సెంచరీలో మొదటి 16 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. గురువారం అతడు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. దూకుడుగా ఆడే మైండ్ సెట్ కోహ్లీకి బలం. అలాంటి ఆలోచనా విధానంతో బ్యాటింగ్‌కు దిగినప్పుడల్లా కోహ్లీ రాణించాడు. ఎవరైనా ముందు సింగిల్స్ తీసి తర్వాత బౌండరీలు కొడతారు. కానీ, కోహ్లీ ముందు బౌండరీలు బాది ఒత్తిడి తగ్గించుకుంటాడు. ఆ తర్వాత సింగిల్స్‌, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తాడ“ని మంజ్రేకర్ అన్నాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *