మండే సూరీడు… భగభగలు

తెలుగు రాష్ట్రాల్లో పోటా పోటీగా ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయితే… ఆంధ్రప్రదేశ్‌లో 45 డిగ్రీలు నమోదైంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఆధివారం 46 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేసింది. అత్యధిక ఉష్ణోగ్రత సూర్యపేట జిల్లా లక్కవరంలో నమోదైంది. అక్కడ 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. మండిపడుతున్న ఎండలతో ఆంధ్రరప్రదేశ్‌ భగ్గుమంటోంది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైబడి నమోదు అవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంచిన్నయ్యగూడెంలో 45 డిగ్రీలుగు నమోదు అయింది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా, ఏలూరు జిల్లాల్లో 44.5 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు చోట్ల 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు రిజిస్టర్‌ అయితే… 3 చోట్ల 42 డిగ్రీలు నమోదు అయ్యాయి. 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
మరో రెండు రోజులుకూడాఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 73 మండలాల్లో 12 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వీటిలో గుంటూరు జిల్లాలో ఎక్కువ మండలాలు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. గుంటూరులో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11 మండలాల్లో ఎన్టీఆర్‌ జిల్లాలో 10 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్‌ ఉందంటున్నారు వాతావరణ శాఖాధికారులు. పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళలో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్‌ ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, 28 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా. నిన్న నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత` 39.1 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత` 23.6 డిగ్రీలురానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతా­యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్‌ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్‌, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *