కలకలం రేపుతున్న శర్మిష్ట బుక్‌..

ప్రణబ్‌ ముఖర్జీ జీవితంపై ఆయన కూతురు శర్మిష్ఠ రాసిన పుస్తకం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాను ప్రధాని కాకుండా సోనియాగాంధీ అడ్డుపడ్డినట్లు ప్రణబ్‌ ముఖర్జీ తనతో చెప్పారని షర్మిష్ఠ ఈ పుస్తకంలో రాశారు. పదవినే ఆశించనపుడు, అసంతృప్తే ఉండదని తన తండ్రి చెప్పినట్లు షర్మిష్ట రాశారు.. అలాగే రాహుల్‌గాంధీ రాజకీయంగా పరిణతి చెందలేదనీ, ఆయన పార్లమెంటుకు రెగ్యులర్‌గా రాకపోవడంపై తన తండ్రికి నచ్చకపోయేదన్నారు.దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, తన తండ్రికి గురించిన విషయాలతో ఆయన కూతురు శర్మిష్ట ముఖర్జీ పుస్తకం రాశారు. ప్రణబ్‌ డైరీ, ఆయన తనతో చెప్పిన విషయాల ఆధారంగా శర్మిష్ట ముఖర్జీ ‘ఇన్‌ ప్రణబ్‌, మై ఫాదర్‌: ఏ డాటర్‌ రిమెంబర్స్‌’ బుక్‌లో కీలక విషయాలు వెల్లడిరచారు. ఈ పుస్తకంలోని విషయాలు ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గురించి తన తండ్రికి ఉన్న అభిప్రాయాలను పంచుకున్నారు. రాహుల్‌ గాంధీకి నెహ్రూ`గాంధీ అహంకారం వచ్చినప్పటికీ, వారి రాజకీయ చతురత రాలేదని పేర్కొన్నట్లు ప్రణబ్‌ కూతురు వెల్లడిరచారు. ఆయనకు రాజకీయ పరిపక్వత లేదని డైరీలో రాసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ గురించి శర్మిష్ట ముఖర్జీ సంచలన విషయాలు వెల్లడిరచారు. ప్రణబ్‌ ముఖర్జీకి, మోడీకి ఉన్న సంబంధాల గురించి వెల్లడిరచారు. ప్రధాని మోడీతో, ప్రణబ్‌ ముఖర్జీకి విచిత్రమై సంబంధం ఉందని, మోడీ ఎప్పుడూ ప్రణబ్‌ ముఖర్జీ కాళ్లకు నిజాయితీతో నమస్కరించేవారని చెప్పారు.ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంలో తన విధులు, బాధ్యతల గురించి స్పష్టంగా ఉండేవారని, మోడీ, తన తండ్రి వేర్వేరు సిద్ధాంతాలకు చెందిన వారైనప్పటికీ, పాలనలో తాను జోక్యం చేసుకోనని చెప్పినట్లు ఆమె వెల్లడిరచారు. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రి కాకముందు నుంచి వీరిద్దరి మధ్య సంబంధం ఉండేదని ఆమె తెలిపారు.ప్రధాని మోడీ అప్పడు ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా వివిధ కార్యకలాపాల కోసం ఢల్లీికి వచ్చేవాడినని, ఉదయం ప్రణబ్‌ ముఖర్జీ మార్నింగ్‌ వాక్‌ వెళ్లే సమయంలో కలిసే వాడినని, తాను ఎల్లప్పుడు ప్రణమ్‌ పాదాలకు నమస్కరించేవాడిని’’ అని ప్రధాని మోడీ చెప్పారని శర్మిష్ట అన్నారు. ప్రణబ్‌ డైరీలో ఇది ఓ ఆసక్తికరమైన విషయమని అనుకున్నానని చెప్పారు.గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో రాష్ట్రపతిని కలిసేందుకు వచ్చినప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ కీలక విషయాన్ని వెల్లడిరచారు. ‘ అతను కాంగ్రెస్‌ ప్రభుత్వం, దాని విధానాలపై తీవ్ర విమర్శకుడు, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ నా పాదాలను తాకుతాడు, ఇది తనకు ఆనందాన్ని ఇస్తుంది, ఎందుకో నాకు అర్థం కాదు’ అని ప్రణబ్‌ ముఖర్జీ రాశారని శర్మిష్ట చెప్పారు.రాష్ట్రపతి, ప్రధాన మంత్రి సంబంధాలు కేవలం వ్యక్తిగత సంబంధంపై నిర్మించబడలేదని, రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రభుత్వంలో జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని ప్రణబ్‌ విశ్వసించారని ఆయన కూతురు తెలిపారు. ప్రజలు విూకు అధికారం ఇచ్చారని, విూ పాలనలో జోక్యం చేసుకోనని, కానీ ఏదైనా రాజ్యాంగపరమైన విషయంలో సాయం కావాలంటే నేను ఉంటానని ప్రణబ్‌ చెప్పినట్లు మోడీ తనతో వెల్లడిరచారని శర్మిష్ట తెలిపారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. తాను సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలం కాదని చెప్పిన ఘటనను తన తండ్రి డైరీలో పేర్కొన్నారని ఆమె వెల్లడిరచారు. 2004`2014 వరకు ప్రణబ్‌, రాహుల్‌ గాంధీల మధ్య పెద్దగా కలుసుకోలేదని వెల్లడిరచారు. ‘‘రాహుల్‌ చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు, అనేక ప్రశ్నలు అడుగుతారు, కానీ రాజకీయాల్లో ఆయన పరిణతి సాధించలేదు, 2013 జూలైలో ఓసారి మా ఇంటికి వస్తే ముందుగా కేబినెట్‌లో చేరి అనుభవం తెచ్చుకోవాలని చెప్పానని, అయితే ఆయన నా సలహాను వినిపించుకోలేదు.’’ అని ప్రణబ్‌ డైరీలో రాసుకున్నారు.రాహుల్‌ గాంధీ రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వంటి దోషులను కాపాడేందుకు 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ని కాంగ్రెస్‌ అధినేతగా ఉన్న రాహుల్‌ గాంధీ చింపేసి చెత్తబుట్టలో పడేసిన తీరుపై ప్రణబ్‌ ముఖర్జీ కలత చెందినట్లు శర్మిష్ట ముఖర్జీ అన్నారు. రాహుల్‌ గాంధీ రాజకీయంగా పరిపక్వతతో లేరని తన తండ్రి చెప్పినట్లు వెల్లడిరచారు. అతను అవగాహన లేకుండా ఉన్నారని ప్రణబ్‌ భావించారని ఆమె తెలిపారు. గాంధీ`నెహ్రూల అహంకారమంతా రాహుల్‌ గాంధీకి వచ్చింది, కానీ వారి రాజకీయ చతురతే ఆయనకు అబ్బలేదని డైరీలో రాసుకున్నారని పుస్తకంలో పేర్కొన్నారు.2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరపరాజయం తర్వాత రాహుల్‌ గాంధీ తరుచుగా పార్లమెంట్‌కి గైర్హాజరు కావడం పట్ల ప్రణబ్‌ ముఖర్జీ అసంతృప్తితో ఉండేవారని శర్మిష్ట తెలిపారు. సోనియాగాంధీని ప్రధాని చేయాలనే ఆశలు తనకు లేవని ప్రణబ్‌ ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని ఆమె చెప్పారు. 2004లో సోనియాగాంధీ ప్రధాని పీఠం వద్దన్న తర్వాత తన తండ్రి ప్రణబ్‌తో పాటు మన్మోహన్‌ సింగ్‌ పేర్లు వినిపించాయని, ప్రధాని మంత్రి పదవి వద్దని, మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అవుతారని తనకు చెప్పినట్లు తన తండ్రి చెప్పినట్లు శర్మిష్ట తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *