రాజేంద్రనగర్‌ పై కార్తీక్‌ రెడ్డి గురి…

ఎన్నికల ఏడాది కావటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక అధికార పార్టీ(బీఆర్‌ఎస్‌)లో స్వరాలు మారుతున్నాయి. మరోవైపు టికెట్ల అంశం కూడా తెరపైకి వస్తోంది. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి వంటి నేతలు బయటికి వచ్చేశారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లోనూ అసమ్మతి మంటలు రాజుకుంటున్నాయి. ఇదిలా ఉన్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొవటం, వ్యూహ రచన విషయంలో బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ క్లారిటీతోనే ఉందన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల మూడ్‌ లోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌…. రేసు గుర్రాలపై ఫోకస్‌ పెంచుతోంది. చాలా స్థానాల్లో సిట్టింగ్‌ లకే మరోసారి ఛాన్స్‌ ఉండగా… మరికొన్ని స్థానాల్లో మాత్రం కొత్త అభ్యర్థులను నిలిపాలని చూస్తోంది. అయితే గ్రేటర్‌ లోని ఓ సీటు విషయంపై పంచాయితీ షురూ అయింది. సొంత పార్టీ నేతలు డైలాగ్‌ లు విసరటంతో ఈ వ్యవహారం కాస్త హాట్‌ టాపిక్‌ గా మారింది.మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన రాజేంద్రనగర్‌ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆ దిశగా ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ్నుంచి ఎమ్మెల్యేగా ప్రకాశ్‌ గౌడ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హ్యాట్రిక్‌ సార్లు గెలిచిన ఆయన… మరోసారి కూడా గెలవాలని అనుకుంటున్నారు. అయితే తాజాగా విూడియాతో మాట్లాడిన కార్తీక్‌ రెడ్డి… రాజేంద్రనగర్‌ సీటు తనదే అన్నట్లు మాట్లాడారు. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి మరోసారి పోటీ చేస్తారని… తాను మాత్రం రాజేంద్రనగర్‌ నుంచి బరిలో ఉంటానని చెప్పుకొచ్చారు. ఇదీ కాస్త గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ లో చర్చనీయాంశంగా మారింది.ఈ వ్యవహరం కాస్త సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ దృష్టికి చేరటంతో ఆయన కూడా తనదైన శైలిలో స్పందించారు. మంగళవారం విూడియాతో మాట్లాడిన ఆయన… రాజేంద్రనగర్‌ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, సీఎం కేసీఆర్‌?తోపాటు మంత్రి కేటీఆర్‌ ఆశీస్సులు తనకు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా రాజేంద్రనగర్‌ టికెట్‌ తనకే కేటాయిస్తారంటూ మాట్లాడారు. చేతగాని మాటలు మాట్లాడడం కాదు.. దమ్ము, ధైర్యం ఉంటే టికెట్‌ తెచ్చుకొని మాట్లాడాలంటూ కార్తీక్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. ఇక చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డికే ఇస్తారంటూ కూడా ప్రకాశ్‌ గౌడ్‌ చెప్పుకొచ్చారు. ఓ రకంగా కార్తీక్‌ రెడ్డికి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశమే లేదన్నట్లు హింట్‌ ఇచ్చారు. మొత్తంగా సొంత పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు టికెట్‌ అంశంపై పలు వ్యాఖ్యలు చేయటంతో ఫైనల్‌ గా ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది.మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో….అధికార బీఆర్‌ఎస్‌ అస్త్రాలను సిద్ధం చేసేస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్న కేసీఆర్‌… ఆ దిశగానే కసరత్తు చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే పలు స్థానాల నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పలుచోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలా హ్యాండిల్‌ చేస్తారనేది చూడాలి…!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *