క్రైమ్‌ సిటీగా మారుతున్న విశాఖ

వైజాగ్‌లో భారీగా మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం.. నెల్లూరు జిల్లాలో బాలికపై ఘాతుకం.. ఇవి రెండూ మంగళవారం పత్రికలో వచ్చిన రెండు వేర్వేరు వార్తలు. అయితే, కొంచెం లోతుల్లోకి వెళ్లి చూస్తే, ఈ రెండు ఘాతుక వార్తలకు సంబంధం ఉండడమే కాదు, రెంటి మూలం, ఒకటే, అదే మత్తు. అవును, అది మద్యం అయినా, డ్రగ్స్‌ అయినా, గంజాయి, ఇప్పడు ఈ టాబ్లెట్స్‌ ఏదైనా సమాజమలో నేరాలు ఘోరాలు రోజు రోజుకు పెరిగి పోవడానికి, మద్యం, మత్తు మూల కారణంగా అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నిజం. మద్యంకానీ,మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు ఒకసారి అలవాటు పడితే .. ఇక ఆ మత్తులోంచి బయటకు రావడం ఎంతటివారికి అయినా అంట సులభంగా అయ్యే పనికాదు. ఇక యువత విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అందుకే యువత మత్తు మందులకు అలవాటు పడితే,అది వ్యక్తులు కుటుంబాలను పీల్చిపీల్చి పీల్చి పిప్పిచేస్తుంది. అంతేకాదు, సమాజాన్ని నిర్వీర్యం చేస్తుందని, సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. మరో వంక జాతీయ, అంతర్జాతీయ సంఘ వ్యతిరేక శక్తులు సమాజాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా యువతకు మత్తు మందులను ఎరగావేస్తున్నాయి. ముంబై లాంటి నగరాలో మత్తు మందులు, మాదక ద్రవ్యాల ద్వారా నేర సామ్రాజ్యాని విస్తరించుకునే కుట్రలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. వస్తున్నాయి.అందుకే, విశాఖ నగరంలో నగరంలో యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు కలిగించే ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ముఠా ఒడిశా, పశ్చిమబెంగాల్‌ వంటి ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో మత్తును కలిగించే ట్యాబ్లెట్లు దిగుమతి చేసుకుంటున్నట్లు వచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ యాంటీ నార్కోటెక్‌ విభాగం ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. కంచరపాలెంకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. వీరి నుంచి మూడు కంపెనీలకు చెందిన 8వేల మత్తు కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.మరోవంక దేశంశంలో జరిగే హత్యలు, మానభంగాలు భంగాలు మరెన్నో నేరాలకు మద్యం, మత్తు మందులే కారణం అవుతున్నాయి. ఒక్క నేరాలు ఘోరాలే కాదు, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు మిగిలిస్తున్న విషాద ఘటనలు అన్నిటికీ, మద్యం మత్తుమందులే కారణం అని వేరే చెప్పనక్కరలేదు. ప్రతి నిత్యం జరుగతున్న అలాంటి దుర్మార్గ సంఘటనలు ఎన్నో మన కళ్ళముందే కనిపిస్తున్నాయి. అవును మత్తు మందుకు బానిసైన బతుకులు ఏ విధంగా తెల్లారుతున్నాయో చస్తూనే ఉన్నాం. విచక్షణా రహితంగా వావి వరసలు లేని అఘాయిత్యాలకు, ఆకృత్యాలకు పాల్పడుతున్న వారిని నేరాలకు ఇంకా ఇతర కారణలు ఉన్నా, మద్యం మత్తు నేరాలకు ఒక ప్రధాన కారణంగా అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయిఅందుకే ఈరోజు మనం ముక్కు పచ్చలారని పసి కందులపై అత్యాచారానికి పాల్పడుతున్న మానవ మృగాలను చూస్తున్నాం. ఎక్కడివరకో ఎందుకు నెల్లూరులో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో కిరాతకంగా ఆమె నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోసి.. ఆపై గొంతు కోసి పరారైన సంఘటనే మత్తు మహమ్మారి ఘాతుక చరిత్రను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది . ఇలాంటి నేరాలు ప్రతి రోజు ఎక్కడో అక్కడ జరుగుతనే ఉన్నాయి. ప్రత్యేకించి నెల్లూరు దుర్ఘటన అనే కాదు, సహజంగా ఇలాంటి నేరాలకు మద్యం మత్తే మూల కారణం అవుతోంది. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందనే ఆరోపణలు కాదు వాస్తవ సంఘటనలే వెలుగు చూసాయి. ఎక్కడో గుజరాత్‌, పొరుగున ఉన్న తెలంగాణలో పట్టుబడిన గంజాయి అక్రమ వ్యాపారం మూలాలు ఆంధ్ర ప్రదేశ్లో బయట పడ్డాయి. అలాగే, డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలు ఇలా ఒకటని కాదు, ఇప్పుడు కొత్తగా వెలుగు చూసిన మత్తు టాబ్లెట్స్‌ దందా వరకు ప్రతి అక్రమ దందాకు ఏపీ అడ్డగా మారింది. ఇక మద్యం సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. అంచెల వారీగా మధ్య నిషేధం అమలు చేస్తామని, అక్క చెల్లెమ్మలకు, అమ్మలకు, అవ్వలకు హావిూ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి, మధ్యమే ములాధరంగా పరిపాలన సాగిస్తున్నారు. అంతే కాదు పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని పూచికత్తుగా చూపించి అప్పు కూడా తెచ్చుకున్నారు. అందుకే, ఏపీలో ఇప్పడు సగటున రోజుకు మూడు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నాలుగైదేళ్ల కిందట వరకూ అతి తక్కువ నేరాల రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో కొనసాగిన ఏపీ.. ఇప్పుడు అత్యధిక నేరాల రేటు కలిగిన రాష్ట్రాల సరసన చేరింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *