మహా రంజు విూద ఉంది రాజకీయం…

హైదరాబాద్‌, జూలై 1
తెలంగాణ రాజకీయం రోజురోజూ మారిపోతోంది. వరుస సభలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. బీఆర్‌ఎస్‌ ట్రిపుల్‌ టైమ్‌ విక్టరీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయనతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన ఓవైపు కేటీ రామారావు, ఇంకోవైపు హరీశ్‌ రావు జిల్లాల పర్యటనల వేగం పెంచారు. మిగిలిన మంత్రులు అడపాదడపా అప్పియరెన్స్‌ మినహా పెద్దగా యాక్టివిటీ లేకుండానే ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీలో జోరు డే బై డే ఇనుమడిస్తోంది. ఢల్లీి వెళ్ళి కీలక మంతనాలు సాగించిన టీ.కాంగ్రెస్‌ నాయకత్వం ఇపుడు జులై 2న ఖమ్మంలో జరగబోతున్న సభ కోసం ప్రిపేరవుతోంది. వంద ఎకరాల భూమిలో భారీ బహిరంగ సభ రెండంశాల ప్రాధాన్యంతో జరగబోతోంది. సుదీర్ఘ కాలంగా కొనసాగిస్తున్న పాదయాత్రను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జులై రెండున ముగించబోతున్నారు. చాలాకాలంగా ఊరిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి జులై రెండున జరిగే సభలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతోపాటు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా పాత గూటికి చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ నేతల్లో ప్రస్తుతం వున్న స్తబ్ధతను తొలగించే చర్యలకు కమలం పార్టీ అధినాయకత్వం సిద్దమవుతోంది. పార్టీలో వుందామా .. జంపవుదామా అని చూస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ రాజగోపాల్‌ రెడ్డిలను ఢల్లీికి పిలిపించుకుని మాట్లాడిన అమిత్‌ షా, నడ్డా.. తదుపరి కార్యాచరణకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ను ఢల్లీికి పిలిచి మరీ మాట్లాడారు. ఇంకోవైపు కేంద్రమంత్రిగా వున్న జి.కిషన్‌ రెడ్డి కూడా ఎన్నికల ఎజెండాతో అమిత్‌ షాని కలిసారు. దీనికి కొనసాగింపుగా తెలంగాణ బీజేపీలో సంస్థాగత నియామకాలుంటాయని ప్రచారం జరుగుతోంది. జులై 8న గానీ, జులై 12నగానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.తెలంగాణలో మూడోసారి విజయం కేక్‌ వాక్‌ అని భావిస్తున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌? తెలంగాణలో సభలు నిర్వహిస్తూనే పొరుగు రాష్ట్రాలలో బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించే యత్నాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రెండ్రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించి వచ్చారు. రాజు వెడలె రభసకు అన్నట్లుగా ఆరు వందల వాహనాల కాన్వాయ్‌తో కేసీఆర్‌ మహారాష్ట్రలోని తుల్జాపూర్‌, పండరీపూర్‌లకు వెళ్ళి వచ్చారు. అయితే, రెండ్రోజుల పాటు అక్కడ వున్నా పార్టీలో చేరికలకు సంబంధించిన ఒక్కటే సమావేశం జరగింది. మిగిలినదంతా టెంపుల్‌ టూరిజంలాగే జరిగింది. తుల్జాపూర్‌లో శక్తిపీఠం భవానీ మాత సందర్శనం, పండరీపూర్‌ విఠలేశ్వరుని దర్శనం చేసుకుని వచ్చారు. అయితే కేసీఆర్‌ మహారాష్ట్ర టూర్‌ గురించి చెప్పాలంటే ఆయన భారీ కాన్వాయ్‌ ప్రధాన చర్చనీయాంశం. తనతోపాటు 12 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అలా భారీ బ?ందంతో ఆయన‘మహా’పర్యటన సాగింది. ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనకు కేసీఆర్‌ రెడీ అవుతున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక నేతలు కేటీఆర్‌, హరీశ్‌ రావు జిల్లాల పర్యటనల వేగం పెంచారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ఆరోపణల జోరు పెంచారు.తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కర్నాటక విజయమిచ్చిన ఉత్సాహం ఇంకా కొనసాగుతోంది. టీపీసీసీ రేవంత రెడ్డి తన పనితీరును మార్చుకోవడం, అధిష్టానం సైతం తెలంగాణ విషయంలో త్వరతిగతిన నిర్ణయాలు తీసుకుంటూ వుండడంతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బ్రేక్‌ వేయగలిగేది కాంగ్రెస్‌ పార్టీనే అన్న మెసెజ్‌ పంపగలుగుతున్నారు. రెండ్రోజుల పాటు ఢల్లీి కేంద్రంగా టీ.కాంగ్రెస్‌ వ్యవహారాలు జోరుగా సాగాయి. అంతిమంగా జులై 2న ఖమ్మంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. అదే సభలో తన సత్తా చాటడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నిర్ణయించారు. సుదీర్ఘంగా సాగుతున్న పాదయాత్రకు ముగింపుగా సభకు ప్లాన్‌ చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఖమ్మం టౌను శివార్లలో వంద ఎకరాల్లో సభ నిర్వహణ ఏర్పాట్లు ఆల్‌ రెడీ మొదలయ్యాయి. జూన్‌ నెలలోనే ప్రియాంకనో, రాహుల్‌ గాంధీనో వస్తారనుకున్నా అది కాస్తా జులై రెండుకు వాయిదా పడిరది. సభల నిర్వహణ ఏర్పాట్లతోపాటు మాటల్లోను దూకుడు పెంచారు కాంగ్రెస్‌ నేతలు. కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్టులో జాప్యమెందుకంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య అవగాహనను తెరవిూదికి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. జులై నెలాఖరునాటికే సగం అసెంబ్లీ సీట్ల అభ్యర్థులను ఖరారు చేసి, వారిని గ్రౌండ్‌ స్థాయిలో వర్క్‌ చేసుకోమని చెప్పాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రయోగం సత్ఫలితాలని ఇస్తుందా లేక పార్టీలో అసంతృప్తుల సంఖ్యను పెంచి కొత్త తలనొప్పులు తెస్తుందా అన్ని వేచి చూడాలి.కర్నాటక ఎన్నికల తర్వాత చతికిల పడిన తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు పార్టీ హైకమాండ్‌ సమాలోచనలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ముందుగా ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలను ఢల్లీికి పిలిచి చర్చలు జరిపారు అమిత్‌ షా, జేపీ నడ్డా. ఆ తర్వాత రెండ్రోజులకే టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ని, కేంద్ర మంత్రి జీ.కిషన్‌ రెడ్డిలను పిలిచి మాట్లాడారు వారిద్దరు. ఈక్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షున్ని మారుస్తారంటూ విూడియాకు లీకులొచ్చాయి. సంజయ్‌ కుమార్‌ని కేంద్ర మంత్రిని చేసి, కిషన్‌ రెడ్డికి పార్టీ పగ్గాలిస్తారన్నది ఆ లీకుల సారాంశం. అయితే ఈ ప్రచారాన్ని సంజయ్‌, కిషన్‌ రెడ్డిలతోపాటు తెలంగాణ బీజేపీ వ్యవహరాల ఇంఛార్జీ తరుణ్‌ ఛుగ్‌ ఖండిరచారు. తెలంగాణ నాయకులతో జరిపిన చర్చల సారాంశాన్ని అమిత్‌ షా ప్రధాని నరేంద్ర మోదీకి వివరించిన దరిమిలా త్వరలో కొన్ని నియామకాలు వుండవచ్చని తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌ రింగు రోడ్డు చుట్టూ ఓ రైల్వే ప్రాజెక్టు, కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ కేంద్రం, వర్క్‌షాపు, హైదరాబాద్‌ నుంచి యాదాద్రి దాకా ఎంఎంటీఎస్‌ పొడిగింపు, కరీంనగర్‌`హసన్‌ పర్తి మధ్య రైల్వే లైను సర్వే వంటి కీలకాంశాలపై కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. జులై 8న గానీ, జులై 12న గానీ మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కాజీపేటలో వ్యాగన్ల తయారీ ప్యాక్టరీతోపాటు వర్క్‌షాపులకు మోదీ శంకుస్థాపన చేస్తారని చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *