హెల్మెట్లు ధరించి విధులు

కరీంనగర్‌, ఆగస్టు 10
జగిత్యాల జిల్లా బీర్‌ పూర్‌ ఎంపీడీవో ఆఫీసులో ఉద్యోగులు హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఉద్యోగులు ఇలా చేస్తున్నారు. ఆ ప్రభుత్వం భవనంలోకి వెళ్లాలంటే హెల్మెట్‌ తప్పనిసరి. ఇదేదో రవాణాశాఖ ఆఫీస్‌ కాదండోయ్‌. ఎంపీడీవో ఆఫీసులో ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టారని విూకు ధర్మసందేహం రావొచ్చు. కానీ ఇక్కడి ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలకు హెల్మెట్‌ ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఎంపీడీవో భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఉద్యోగులు హెల్మెట్లు ధరిస్తున్నారు. భవనం పై భాగం పెచ్చులు ఊడిపడడంతో గాయాలవుతున్నాయని అంటున్నారు ఉద్యోగులు.జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ ఎంపీడీవో ఆఫీసు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఉద్యోగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం పెచ్చులూడిపోతుండంతో ఎప్పుడైనా నెత్తివిూద పడొచ్చన్న భయంతో ఉద్యోగులు హెల్మెట్లు ధరించి విధులకు వస్తున్నారు. హెల్మెట్లు లేని వారు ఆఫీసు బయట టేబుళ్లు వేసుకుని పనిచేసుకుంటున్నారు. 2016లో బీర్‌పూర్‌ మండలం ఏర్పడినప్పటి నుంచీ ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఇప్పుడు ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాదిగా పెచ్చులు ఊడిపడుతున్నాయి. గతేడాది ఎంపీడీవో కూర్చుని ఉండగానే ఆయన టేబుల్‌పై పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోఅప్పటి అదనపు కలెక్టర్‌ ఆఫీసును మార్చాలని ఆదేశించారు. కానీ కార్యాలయ మార్పు జరగలేదు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ఉద్యోగులు హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు.ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వీడియో సోషల్‌ విూడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వారు ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. పనిపట్ల వారి అంకితభావాన్ని కూడా ప్రశంసించారు. పనిచేసేటప్పుడు హెల్మెట్‌లు ధరించడం వల్ల ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారని, తమ పనిని పూర్తి చేయడానికి వచ్చిన సందర్శకుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను అభినందించాల్సిందే అంటూ సోషల్‌ విూడియాలో పోస్టులు పెడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *