‘మామా మశ్చీంద్ర’.. మహేష్ బాబులా పరుగెడుతుంది

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Nitro Star Sudheer Babu), యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ (Harshavardhan) దర్శకత్వంలో తెరకెక్కిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra). శ్రీ వెంకటేశ్వర సినిమాస్ (Sree Venkateswara Cinemas) ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలవుతోన్న నేపధ్యంలో.. మేకర్స్ తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీవిష్ణు.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *