కుప్పంలో మారుతున్న స్ట్రాటజీలు…

కుప్పంలో టీడీపీ కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా వ్యూహం పన్నుతోంది. 38 మందితో కమిటీ ని నియమించింది. శాసనమండలి ఎన్నికల్లో సత్తా చాటిన కొత్త ఎమ్మెల్సీకి కమిటీ బాధ్యతలను అప్పగించింది. టీడీపీ హై కమాండ్‌ తీసుకున్న కీలక నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. వై నాట్‌ 175. ఇది వైసిపి స్ట్రాటజీ. ఏపీలోని అన్ని సీట్లలో గెలుస్తామన్న ధీమాతో కుప్పంలోనే ఈ స్లోగన్‌ తెరవిూదికి వచ్చింది. గోడలపైకి టార్గెట్‌ ను తీసుకొచ్చింది. ఏడాదిన్నర క్రితం వైసీపీ అధినేత జగన్‌ సీఎం హోదాలో కుప్పం లో అడుగుపెట్టిన రోజు ఈ నినాదం పొలిటికల్‌ గా దద్దరిల్లింది. కుప్పం గోడలపై వైనాట్‌ 175 టార్గెట్‌ అందరినీ ఆకట్టుకునేలా చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వైసీపీ నినాదం టిడిపిని ఉలిక్కిపడేలా చేసింది. కొత్త ఆలోచనకు అవకాశం కల్పించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు మెజారిటీ గణనీయంగా తగ్గడం, ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శించడంతో టీడీపీలో కలవరం మొదలైంది. మంత్రి పెద్దిరెడ్డి కుప్పం టార్గెట్‌ గానే పొలిటికల్‌ స్టెప్స్‌ వేయడంతో కుప్పంపై టీడీపీ హై కమాండ్‌ మరింతగా ఫోకస్‌ చేసింది. ప్రతి 3 నెలలకు ఒకసారి చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే గా కుప్పం పర్యటనకు రావడమే కాకుండా కుప్పంలో సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది. శరవేగంగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసే పనిలో నిమగ్నం చేసింది.కాగా 2024 ఎన్నికల్లో కొత్త స్ట్రాటజీని ఫాలో అయ్యేలా ప్లాన్‌ చేసింది. కుప్పంలోని 4 మండలాల్లో ప్రస్తుతం ఒక్కో లీడర్‌ పెత్తనం కొనసాగుతుండగా ఇందుకు భిన్నంగా ఎన్నికల కమిటీ తెరవిూదకి తెచ్చింది. స్థానిక నాయకత్వంపై గత కొంతకాలంగా కేడర్‌ లో ఉన్న అపనమ్మకం, వ్యతిరేకతకు చెక్‌ పెట్టాలని భావిస్తున్న హై కమాండ్‌ కేడర్‌ లో ఉన్న కన్ఫ్యూజన్‌ పార్టీకి నష్టం జరుగుతుందని భావించింది. ఇప్పటివరకు ఉన్న ఆ నలుగురు ముఖ్య నేతలే కుప్పం టీడీపీకి దిక్కు కావడంతో పార్టీ లీడర్లపై కేడర్‌ చేస్తున్న ఫిర్యాదులు చంద్రబాబుకు సైతం ఇబ్బందిని కలిగించాయి. ఈ నేపథ్యంలోనే ద్వితీయ శ్రేణి టిడిపి కేడర్‌ ను వైసిపి అట్రాక్ట్‌ చేసింది. పట్టు సడలుతున్న పార్టీ పరిస్థితిని గుర్తించిన పార్టీ హై కమాండ్‌ 2024 ఎన్నికలకు వ్యూహం మార్చా లనుకుంది. మొదటికే మోసం రాకుండా జాగ్రత్త పడిరది. ఇందులో భాగంగానే లక్ష ఓట్ల మెజారిటీని టార్గెట్‌ గా చేసుకుంది. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రికార్డు మెజారిటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా కుప్పం రాజకీయాన్ని నడిపించిన పాతతరం నేతల్ని పక్కనపెట్టి యువ నాయకత్వాన్ని ఎంకరేజ్‌ చేయాలని నిర్ణయించింది. ఒకరిద్దరు నేతల పెత్తనానికి ఇకపై చాన్స్‌ లేకుండా చేసింది. ఏకంగా 38 మందితో ఎన్నికల కమిటీ వేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీనే లక్ష్యంగా వ్యూహం పన్నిన టిడిపి హై కమాండ్‌ కుప్పం టీడీపీ వ్యవహారాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ కు అప్పగించింది.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్‌ ను 38 మంది పార్టీ సభ్యులతో ఏర్పాటైన కుప్పం నియోజకవర్గ ఎన్నికల కమిటీకి చైర్మన్‌ ను చేసింది. . వారంలో 3 రోజులపాటు కుప్పం లోనే కంచర్ల శ్రీకాంత్‌ మకాం ఉండేలా ప్లాన్‌ చేసింది. గత శాసనమండలి ఎన్నికల్లో సత్తా చాటిన శ్రీకాంత్‌ కు కుప్పం బాధ్యతలను అప్పగించడం వెనుక వ్యూహం ఏమిటన్న చర్చ నడుస్తుండగా వైసీపీ టీడీపీ ఎత్తుగడను అబ్జర్వ్‌ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే చంద్రబాబుకు చెక్‌ చెప్పాలన్న కసరత్తు మంత్రి పెద్దిరెడ్డి డైరెక్షన్‌ లో జరుగుతుండగా లక్ష ఓట్ల టీడీపీ టార్గెట్‌ వైసీపీ లోనూ చర్చకు తెరలేపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *