సోయా విత్తనాల కోసం ఎదురు చూపులు

అదిలాబాద్‌, జూలై 4
రాష్ట్రప్రభుత్వం సబ్సిడీపై సోయా విత్తనాల?పంపిణీ నిలిపేయడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. ఇక్కడ సీడ్‌? దొరకక మహారాష్ట్ర వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఆరుతడి పంటగా రైతులు ఎక్కువగా సోయానే సాగు చేస్తారు. డిమాండ్‌? ఉండడం, మూడు, నాలుగు నెలల్లో పంట చేతికి రావడంతో దీన్ని సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతారు. ఏడాదికి సుమారు 70 వేల ఎకరాల్లో పంట సాగవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా. ఈ ఖరీఫ్‌? సీజన్‌?లో సమయానికి పెద్దవానలు పడనందున సోయా సాగు విస్తీర్ణం మరింత పెరిగే ఛాన్స్‌?ఉంది. కానీ గవర్నమెంట్‌?నుంచి సీడ్‌? సప్లయ్‌?లేక, మార్కెట్‌?లో సీడ్‌? దొరకక మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటున్నారు. రేపు విత్తనం మొలకెత్తకుంటే ఎవరిని అడగాలో అనే ప్రశ్న రైతులకు ఎదురవుతోంది.రెండేళ్ల కింద తెలంగాణ సర్కార్‌?33 శాతం సబ్సిడీతో సోయా సీడ్‌?సరఫరా చేసేది. పరిశోధనల తర్వాత అమ్మే విత్తనాలు కావడంతో రైతులు నమ్మకంతో ఉండేవారు. రైతుబంధును సాకుగా చూపి, అగ్రికల్చర్‌?సబ్సిడీలను గవర్నమెంట్‌?ఆపేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీడ్‌?అవసరాల కోసం పొరుగు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు. మహారాష్ట్రలోని నర్సీ, నాయగావ్‌, కొండల్‌?వాడీ, ధర్మాబాద్‌?వెళ్లి, గ్యారెంటీ లేని సీడ్‌?కొంటున్నారు.?ఎకరాకు 30 కేజీల సీడ్‌?బస్తా సరిపోగా, అందుకోసం రూ.2,400 నుంచి రూ.3,500 వరకు ఖర్చుచేస్తున్నారు. రెండేళ్ల కింద మనరాష్ట్రంలో ఇదే సీడ్‌?బస్తా సబ్సిడీపై రూ.1700 వరకు లభించేది. దీంతో సగటున 4, 5 ఎకరాల్లో సోయా వేసే రైతులు విత్తనాలకే అదనంగా రూ.4000 నుంచి రూ.6000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.ఉమ్మడి జిల్లాలోని బోధన్‌?, కోటగిరి, ఆర్మూర్‌, భీమ్‌?గల్‌, మోర్తాడ్‌, రెంజల్‌?తో పాటు మద్నూర్‌, జుక్కల్‌, గాంధారి ఏరియాల్లో సోయా సాగు అధికంగా ఉంటుంది. సాగునీటి సౌలత్‌?తక్కువగా ఉన్న మెరక భూమిలో వర్షాధార పంటగా దీన్ని సాగు చేస్తారు. 20 రోజులకో తడి చొప్పున నీరందితే సరిపోతుంది. సబ్సిడీ లేకుండా ఇక్కడి గవర్నమెంట్‌? సీడ్‌?అమ్మినా, కొనేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. సహకార సొసైటీలు మేలు రకం సీడ్‌?ను అందుబాటులో ఉంచితే, రైతులు భరోసాగా పంట సాగు చేసుకోవచ్చు.గవర్నమెంట్‌?సబ్సిడీపై సోయా సీడ్‌? పంపిణీ ఆపేయడం సరికాదు. నేను 20 ఎకరాల్లో సోయా సాగు చేయడానికి మహారాష్ట్ర నుంచి రూ.80 వేలు ఖర్చుపెట్టి సీడ్‌?తెచ్చిన. మనరాష్ట్రంలోనే విత్తనాలు సరఫరా చేస్తే, పక్క రాష్ట్రానికి పోయ్యే పరిస్థితి ఉండేదికాదు. భరోసాతో పంట వేసే వాళ్లమంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *