కిషన్‌ రెడ్డి నియామకం…వెనుక బీఆర్‌ఎస్‌..?

హైదరాబాద్‌, జూలై 6
ఎన్నికలు సవిూపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదంతా కూడా కేసీఆర్‌ డైరెక్షన్‌ లోనే నడుస్తోందంటూ కాంగ్రెస్‌ అభిప్రాయపడుతోంది. మొత్తంగా రాష్ట్రంలోని తాజా పరిణామాలు చూస్తుంటే? ఆసక్తికరంగా మారాయి.: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నువ్వా ` నేనా అన్నట్లు సాగుతున్న క్రమంలో… తెలంగాణ బీజేపీలో సారథి మార్పు సరికొత్త చర్చకు దారి తీసింది. గత మూడేళ్లుగా పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్తూ… పలు ఎన్నికల్లో పార్టీని విజయాల దిశగా తీసుకెళ్లిన బండి సంజయ్‌ ను తప్పించటం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు జాతీయ నాయకత్వం సంజయ్‌ పని తీరును మెచ్చుకుంటూనే ఇలా చేయడమేంటన్న చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ కూడా శెభాష్‌ సంజయ్‌ జీ అంటూ ఓ వేదికపై కూడా భుజం తట్టుతూ చెప్పినట్లు చూశాం. అలాంటి నేతను ఎన్నికల వేళ తప్పించటంపై పలు రాజకీయ పార్టీలు అభిప్రాయాలను భిన్నాభిప్రాయాలను వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ వాదన మాత్రం… ఆసక్తికరంగా ఉంది.అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ ను మార్చటంపై కాంగ్రెస్‌ శ్రేణలు ఆసక్తికరంగా స్పందిస్తున్నాయి. కొత్తగా నియామకమైన కిషన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను ఉద్దేశిస్తూ…. సెటైరికల్‌ గా పోస్టులు పెడుతున్నారు. అధ్యక్ష మార్పు వెనక కేసీఆర్‌ ఉన్నారని…. తన మనిషిగా ఉండే కిషన్‌ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించేలా ఢల్లీి పెద్దలతో కేసీఆర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే….అడ్డంకిగా ఉన్న బండి సంజయ్‌ ను తప్పించి… కిషన్‌ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారని వారి పోస్టుల్లో రాసుకొస్తున్నారు. బీజేపీ తాజా నిర్ణయంతో కేసీఆర్‌ చేతికి తెలంగాణ బీజేపీ పగ్గాలు వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ట్వీట్లను కూడా… తెలంగాణ కాంగ్రెస్‌ ట్విట్టర్‌ లో దర్శనమిచ్చాయి. రెండు పార్టీల మధ్య ఇంటర్నల్‌ ?ఒప్పందాల్లో భాగంగా ఇదంతా జరుగుతుందని కాంగ్రెస్‌ కు చెందిన పలువురు నేతలు ఆరోపించారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడుతున్న విషయాన్ని గమనించే… ఇదంతా చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.ఇక గత కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది కాంగ్రెస్‌. బీజేపీ బీ టీమ్‌ గా పని చేస్తోందని ఆరోపిస్తోంది. ఇటీవల ఖమ్మం వేదికగా జరిగిన సభలోనూ రాహుల్‌ గాంధీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. బీహర్‌ వేదికగా జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీకి బీఆర్‌ఎస్‌ ను ఆహ్వానిస్తే తాము రామని చెప్పామని కూడా రాహుల్‌ గుర్తు చేశారు. ఫలితంగా బీఆర్‌ఎస్‌… బీజేపీకి బీ టీమ్‌ గా పని చేస్తుందన్న విషయాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో?. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్‌ ని మార్చి? కిషన్‌ రెడ్డిని నియమించటం పట్ల అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. ఇక తాజా పరిణామాలపై రేవంత్‌ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ లోని ముఖ్య నేతల రియాక్షన్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది?.!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *