2019 తరహాలనే ఒంటరి పోరా..

ఏపీలో 175 నియోజకవర్గాలు ఉంటే.. 147 చోట్ల అసెంబ్లీ కన్వీనర్లను.. కో కన్వీనర్లను నియమించింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చింది. అయితే కన్వీనర్ల నియామకమే కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది. ఇటీవల జనసేనతో పొత్తు.. ఆ పార్టీ సహకారంపై బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో చర్చించారు. జనసేన తమకు ఎంత మాత్రం సహకరించడం లేదని మెజారిటీ నేతలు తమ అభిప్రాయంగా చెప్పారని టాక్‌. ఆ తర్వాత అసెంబ్లీ కన్వీనర్ల నియామకం బయటకు రావడంతో బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చే ఈ ప్రకటన చేసిందని సమాచారం.జనసేన తమతో కలిసి రాదనే అభిప్రాయాన్ని బయటకు చెప్పకపోయినా.. ఆ విషయంలో ఒక స్పష్టతకు వచ్చిన ఏపీ బీజేపీ నేతలు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. చివరి వరకు వేచి చూసేకంటే.. ముందుగానే అసెంబ్లీ సెగ్మెంట్లకు కన్వీనర్లను ప్రకటించి పార్టీ పని మొదలుపెట్టి.. అభ్యర్థులను ఎంపిక చేసి ఫీల్డ్‌లోకి దిగొచ్చనే ఆలోచనలో కమలనాథులు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల వాదన. జనసేన కలిసి వచ్చినా రాకున్నా.. బీజేపీ బలోపేతం కావాలి కదా అని పదాధికారుల సమావేశంలో పార్టీ అగ్రనేత శివప్రకాష్‌ ప్రశ్నించారని.. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతినిధులు లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఏపీ నేతలను ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 147 నియోజకవర్గాలకు సారథులను ఖరారు చేశారుప్రస్తుతం అసెంబ్లీ కన్వీనర్లుగా ఉన్నవారే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే వాదన బీజేపీలో ఉంది. అదే జనసేనతో పొత్తుపై ఆశలు సజీవంగా ఉండి ఉంటే 147 నియోజకవర్గాలకు ఈ విధంగా కన్వీనర్లను.. కో కన్వీనర్లను ప్రకటించరు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో.. ఈలోగా వారి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని అభ్యర్థులుగా ఖరారు చేయొచ్చనే అభిప్రాయంలో కూడా బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీని విమర్శించే ప్రతి ఒక్కరూ అసలు 175 నియోజకవర్గాల్లో పార్టీకి అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నిస్తుంటారు. ఆ విమర్శలకు కన్వీనర్ల నియామకంతో చెక్‌ పెట్టినట్టుగా కొందరి వాదన. మొత్తానికి నియోజకవర్గాల్లో బీజేపీ నాయకత్వాన్ని సిద్ధం చేయడం.. కన్వీనర్ల పేరుతో కార్యక్రమాల స్పీడ్‌ పెంచడం.. ఒంటరి పోరుకు కూడా సిద్ధమనే సంకేతాలు ఇవ్వడానికి ఏపీ లీడర్స్‌ క్రమంగా అడుగులు వేస్తున్నట్టు అర్థం అవుతోంది.గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏపీలో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేసింది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయనే విమర్శలు మూటగట్టుకుంది. 2019 ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్రంలో బలపడిరదా అంటే.. పెదవి విరిచే పరిస్థితి. ఈ మూడేళ్లలో జరిగిన తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికలు, స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఆ పార్టీ బలాన్ని తెలియజేస్తున్నాయి. పొరుగునే ఉన్న తెలంగాణలోనూ ఏపీలోని బీజేపీ పరిస్థితికి అస్సలు పొంతన లేదు. తెలంగాణ మాదిరి పురోగతి ఉంటే ఈపాటికే బీజేపీ అగ్రనేతల ఫోకస్‌ పెరిగేది. అసలు ఢల్లీి పెద్దలు ఏపీ బీజేపీ శాఖను పట్టించుకుంటున్నారో లేదో అన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లోనూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఒంటరిపోరు అంటే బీజేపీ ఏ పొజిషన్‌లో ఉంటుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *