విశాఖ… హాట్‌ గురూ…

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో ఏపీ వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం, మంగళవారం ఏపీలోని పలు మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని.. ప్రజలను హెచ్చరించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.అయితే విశాఖ నగరంపై ఉప్పు మేఘం కమ్మేసింది. కోస్టల్‌ బ్యాటరీ నుంచి వైఎంసీఏ వరకు దట్టమైన తేమ గాలులు అల్లుముకున్నాయి. ఎటు చూసినా ఇదే వాతావరణం కనిపిస్తోంది. దీనికి సముద్ర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడమే కారణం అంటున్నారు నిపుణులు. ఏటా మే నెల మధ్యలో ఇటువంటి వాతావరణం వుంటుంది. అయితే, ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. విశాఖ నగరం పగలంతా హీట్‌ ఐలాండ్‌ ను తలపిస్తోంది. ఉదయం, సాయంత్ర దట్టమైన తేమగాలులు వీస్తున్నాయి. ఇది అసాధారణమైన పరిణామం కాకపోయినప్పటికీ సమ్మర్‌ తీవ్రత ఎంత స్థాయిలో పెరిగిందో గుర్తించవచ్చంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఎలినినో కండిషన్స్‌ వస్తాయనే అంచనాలకు తగ్గట్టుగానే తీవ్ర ఎండలు, ఉక్కపోతలు ఇబ్బంది కరంగా మారాయి.దీంతో విశాఖ వాసులు అధికంగా నమోదవుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 దాటితే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అవసరమయితేనే బయటకు వస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత చేరుకుంది. బెజవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, విశాఖలో విపరీతంగా వేడిమి పెరుగుతున్నాది. వడగాలుల తాకిడితో ఏపీలోని 100కి పైగా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ దెబ్బకి 12 గంటల లోపే నగర వాసులు ఇళ్లకు చేరుతున్నారు. దీంతో నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి మరింతగా ఎండ తీవ్రత పెరగనున్నది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే ముందు తగిన జాగ్రత్త చర్యలతో బయటకు రావాలని ఎఓఆ సూచించింది. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే చాలా మంది భయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మండలాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు ఏపీ వాతావరణశాఖ తెలిపింది. తాజాగా భారత వాతావరణ కేద్రం ఏపీ ప్రజలను అలర్ట్‌ చేసింది. రాష్ట్రంలో చాలా మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7, అనకాపల్లిలో 13, తూర్పుగోదావరిలో 10, ఏలూరులో 1, గుంటూరులో 6, కాకినాడలో 16, కోనసీమలో 6, కృష్ణాజిల్లాలో 2, ఎన్టీఆర్‌ జిల్లాలో 6, పార్వతీపురంమన్యంలో 7, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 24 మండలాల్లో వడగాల్పులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. అనకాపల్లిలో 10, కాకినాడలో 2, ఎన్టీఆర్‌ లో 2 మండలంలో తీవ్రమైన వడగాల్పులు నమోదవుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.ఎండ వేడిమి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.. పగలు ఎండలు, రాత్రి తేమగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *