వ్యూహాలు మారుస్తున్న రేవంత్‌ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది గడుస్తున్నా? డీసీసీలను కూడా నియమించుకోలేకపోయారు రేవంత్‌రెడ్డి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. కొత్త టీమ్‌ను తెచ్చుకోవాలని.. ఆయన భావించారు. జిల్లా కాంగ్రెస్‌ సారథుల్లో దాదాపు 18 చోట్ల కొత్త చీఫ్‌ను తీసుకురావాలని తలపోశారట. ఈ విషయంలో రేవంత్‌ అనుకున్నదొక్కటీ.. అయ్యిదొక్కటీ అన్నట్టుగా ఉందట. జిల్లాల వారీగా కాంగ్రెస్‌ నేతలు తమ ప్రాంతాల్లో డీసీసీ నియామకాలపై ఆశావహుల పేర్లు సూచిస్తున్నారు. దీంతో తన అని అనుకున్నవాళ్లను డీసీసీలను చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారట పీసీసీ చీఫ్‌. జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్లు చాలా మంది డీసీసీ నియామకాలపై ఫోకస్‌ పెట్టడంతో ఏం పాలుపోవడం లేదట.వచ్చిన కొత్తలో డీసీసీ లపై సీరియస్‌గా దృష్టిపెట్టిన రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం చేతులు ఎత్తేసినట్టు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాలని పీసీసీకి ఆదేశాలు ఇచ్చారట. అయితే ఆ అంశాన్ని పక్కన పెట్టి.. ముందు డీసీసీల నియామకాన్ని క్లియర్‌ చేయాలని కోరారట రేవంత్‌. దీని గురించి తెలిసిన వెంటనే.. నల్గొండ, కరీంనగర్‌.. మెదక్‌.. మహబూబ్‌ నగర్‌.. ఖమ్మం జిల్లాలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు? జిల్లా కాంగ్రెస్‌ సారథులుగా తమ వారే ఉండాలని ఒత్తిళ్లు పెంచుతున్నారట. వచ్చేది ఎన్నికల కాలం కావడంతో నాయకులు డీసీసీలపై ఉడుంపట్టు పట్టినట్టు తెలుస్తోంది. దీంతో పీసీసీకి స్పేస్‌ లేకుండా పోయిందట.ఈ గొడవలు చూశాక.. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలో ఉన్న డీసీసీల నియామకం వరకే రేవంత్‌రెడ్డి పరిమితం అయ్యారు. మేడ్చల్‌ జిల్లాకు కంటి శ్రీధర్‌ పేరు ప్రకటించారు. రంగారెరడ్డి జిల్లాకు సంబంధించి.. రేవంత్‌, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయట. కాంగ్రెస్‌ కూడా జిల్లా నాయకత్వం నిర్ణయానికే వదిలేయడంతో.. తన అభిప్రాయం చెప్పడానికి కూడా రేవంత్‌ సాహసించలేదని చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లా నేతలు సూచించిన పేర్లపై కార్యకర్తలు, పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఫైనల్‌ చేస్తున్నారట. పార్టీ వ్యూహకర్త సునీల్‌ మాత్రం తన టీమ్‌తో అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు సమాచారం.డీసీసీల విషయంలో తలబొప్పి కట్టడంతో రేవంత్‌రెడ్డి వ్యూహం మార్చేశారట. తన పరిధిలోని పీసీసీ కార్యవర్గం నియామకంపైనే ఎక్కువ నజర్‌ పెట్టారట. ప్రధాన కార్యదర్శి పదవులనే వందకు పైగా ఇవ్వాలని చూస్తున్నారట. వీళ్లకే నియోజకవర్గ బాధ్యతలు అప్పటించే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉందట. మరి.. ఇందులోనైనా రేవంత్‌ మాట నెగ్గించుకోగలరా? లేక ఒత్తిళ్లు.. నేతలు వేసే కత్తెరలకు గగ్గోలు పెడతరా చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *