ఏపీలో సింగిల్‌ సబ్జెక్టులో డిగ్రీ

ఏపీలోని డిగ్రీ కాలేజీల్లో రానున్న విద్యాసంవత్సరం (2023`24) నుంచి సింగిల్‌ సబ్జెక్టు డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల కోర్సుల నుంచి సింగిల్‌ సబ్జెక్టుకు మారేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ప్రాసెస్‌ ఫీజు కింద ఒక్కో కళాశాల రూ.5 వేలు చెల్లించాలని, పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపింది. ప్రస్తుతం బీఎస్సీ ఆనర్స్‌ (ఎంపీసీ)లో 50 సీట్లుంటే వాటిని గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టుల్లో ఏదో ఒక దాంట్లో 50 సీట్లను కళాశాల పెట్టుకోవచ్చు. లేదంటే ఒక్కో సబ్జెక్టులో 25 సీట్ల చొప్పున సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మొదటి సంవత్సరం సిలబస్‌ను ఖరారు చేశారు. ప్రధానంగా ఒక సబ్జెక్టు తీసుకుంటే మైనర్‌గా మరో సబ్జెక్టు చదవాల్సి ఉంటుంది. వీటితోపాటు నైపుణ్యాభివృద్ధి కోర్సు ఉంటుంది. మేజర్‌, మైనర్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాంట్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
బదిలీలపై సర్కారీ టర్న్‌…
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలపై గతేడాది జారీ చేసిన జీవో 187ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్ట్ర హైకోర్టుకు తెలిపిన విధంగానే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవో 187లోని మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. గతేడాది డిసెంబరు 26న విచారణ జరిపిన హైకోర్టు.. బదిలీ మార్గదర్శకాలు సక్రమంగా లేవని ప్రాథమికంగా అభిప్రాయపడిరది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకుంది. 2023`24 విద్యా సంవత్సరానికి పాఠశాలలు జూన్‌ 12న తిరిగి ప్రారంభంకానున్నందున మళ్లీ బదిలీ మార్గదర్శకాలు రూపొందిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేస్తామని విద్యాశాఖ పేర్కొంది.ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌ 10న ఏపీ ప్రభుత్వం జీవో 187ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ జీవోను ఇప్పుడు ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు హైకోర్టుకు జీవో ఉపసంహరణకు సంబంధించి మెమోను నివేదించారు. ఈ జీవో ఉపసంహరణకు సంబంధించి మెమోను కోర్టు దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వ న్యాయవాది ఈ మేరకు వివరాలను కోర్టుకు సమర్పించారు. 2022`23 విద్యా సంవత్సరానికి ఏప్రిల్‌ 30 చివరి పనిదినమని, 2023`24 విద్యా సంవత్సరానికి గాను జూన్‌ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని కోర్టుకు సమర్పించిన మెమోలో విద్యాశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో జీవో 187, తదనంతరం జారీ చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలు మళ్లీ రూపొందిస్తామని విద్యాశాఖ కోర్టుకు నివేదించిన మెమోలోపేర్కొంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *