బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు జన్మదినం

చాగంటి కోటేశ్వరరావు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. అతను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఇతను తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన ఇతను జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలుÑ అతను ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం విూద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు. చాగంటివారు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌ గా పనిచేస్తున్నారు. అతను భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. చాగంటివారు ఆఫీసుకు సాధారణంగా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్‌ పెర్మిషన్స్‌ తీసుకోరు. ప్రవచనాలకు అతను పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే అతను తన సొంత డబ్బుతో టికెట్‌ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసులేదు. ఇంతవరకు అతనుకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్‌ సైకిల్‌ విూద వెళ్తారు. మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని,, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు. అతను ఎంతటి ఖ్యాతి గడిరచారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు.చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. అతనుకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి అతను విద్యాబుద్ధులు వికసించాయి. అతను యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్‌ మెడలిస్టుగా ఎదిగారు.అతను ధారణాశక్తి గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం అతను మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.అతను ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. అతను స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. ‘‘విూ గురించి ఎంతో విన్నాను. విూ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. విూ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా విూ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను’’ అన్నారు పీవీ.చాగంటి వారు నవ్వేసి ‘‘విూకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. విూ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేవిూ ఆశలు లేవు.’’ అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.అతను బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణములోని భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతము లోని అజ్ఞాత వాస పర్వము వివరించబడిరది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృష్ణావతారం యొక్క పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రథమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరికి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకథారాస్తోత్రం, గోమాత విశిష్టత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్థం, శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. అతను తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *