అనసూయ, లైగర్‌ మధ్య ఆంటీ

ఓ పాతికేళ్లు దాటిన యువకుడినైనా.. యువతినైనా ఎవరైనా అంటీ లేదా అంకుల్‌ అని పిలిస్తే మనసు చివుక్కుమంటుంది. అలా పిలిచిన వాళ్లపై కోపగించుకోవడమో.. మరోసారి ఎదురు పడకపోవడమో చేస్తారు. అంతే కానీ గెలికి గెలికి.. అందరి చేత ఆ మాట అనిపించుకోరు. కానీ జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చేసిన అనసూయ ఖాళీగా ఉందేమో కానీ రోజంతా ట్విట్టర్‌లో ఆంటీ పేరుతో రచ్చ పెట్టేసుకున్నారు. ఎవరో ఆంటీ అన్నారని.. అది తనను.. ఏజ్‌ షేమింగ్‌ చేయడమేనని కేసులు పెట్టి అందర్నీ జైల్లో పెట్టిస్తానని హెచ్చరించారు. ఆమె అలా రియాక్ట్‌ అయ్యే సరికి.. ఒక్క సారిగా ట్విట్టర్‌లో అనసూయ ఫ్యాన్స్‌ రెచ్చిపోయారు. ఒక్కొక్కరుగా ఆంటీ అంటూ ట్వీట్లు చేయడం ప్రారంభించారు. అసభ్యకరంగా ఉన్నా సరే వారందరిపై పోలీసులకు కంప్లైంట్లు చేస్తానని.. ఆ ట్వీట్లను తాను షేర్‌ చేసుకుని సమాధానాలిచ్చింది. ఆన్‌ లైన్‌ వేధింపులు వద్దని హ్యాష్‌ ట్యాగ్‌ కూడా పెట్టుకుంది. ఆమె ఇలా సమాధానం ఇచ్చే కొద్దీ దారుణంగా మాట్లాడేవారు ఎక్కువైపోయారు. చివరి వరకూ ఆమె అలా చేస్తూనే ఉంది. కొంత మంది సినీ ప్రముఖులు ఎందుకు ఇలా ట్విట్టర్‌లో పరువుతీసుకుంటున్నావని మందలిస్తే.. అప్పుడు?మె విరమించుకుంటున్నట్లుగా చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా అవే ట్వీట్లు పెట్టారు. ఆమె దెబ్బకు ఆంటీ అనే హ్యాష్‌ ట్యాగ్‌ టాప్‌ త్రీలోకి ట్రెండిరగ్లోకి వచ్చింది. ప్రతీ ఒక్కరూ జోకులేయడమే. నిజానికి ఆంటీ అంటే.. కేసులు పెట్టేలా ఏ చట్టమూ లేదు. కానీ అలా పిలిస్తే తాను డిప్రెషన్‌కు గురవుతానని.. అది కేసులు పెట్టగలికే కేసని అంటోంది. ఆమె తీరుతో ఆశ్చర్యరపోవడం.. రెచ్చగొట్టేలా వ్యవహారించడం నెటిజన్ల వంతయింది. సోషల్‌ విూడియాలో సెలబ్రిటీలు ఎవరూ రెస్పాండ్‌ కారు. అలా రెస్పాండ్‌ అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆ విషయం అనసూయకు తెలియనిదేం కాదు. కానీ రోజంతా ఇలా రచ్చ చేసుకుని..అందరూ దూషించారని కన్నీళ్లు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *