వివేక హత్య కేసు

వైఎస్‌ వివేకానందరెడ్డి కేసు ప్రతీ రోజూ హాట్‌ టాపిక్‌ అవవుతోంది. పూర్తి స్థాయిలో ఆ కేసు గురించి ప్రజల్లో చర్చ జరుగుతోంది. అసలేమి జరిగిందో ఓ రోజు అవినాష్‌ రెడ్డి వీడియో విడుదల చేస్తారు. మరో రోజు బెయిల్‌ పిటిషన్లపై వాదనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరో రోజు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. అసలు కోర్టు రూమ్‌లో జరిగే విచారణల కన్నా బయట జరిగే విచారణలు.. చర్చలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటి వల్ల వైఎస్‌ఆర్‌సీపీనే ప్రధానంగా ఇబ్బంది పడుతోంది. ఈ ఘటనపై చర్చ ఎంత ఎక్కువ జరిగినా ఆ పార్టీకే సమస్య అవుతోంది. ఎందుకంటే బాధితులు, నిందితులు రెండు వర్గాలూ ఆ పార్టీవారే. ఇదే వైఎస్‌ఆర్‌సీపీకి కత్తి విూద సాములా మారింది. రెండు వారాల కిందట ఆదివారం ఉదయమే హఠాత్తుగా పులివెందులలో దిగిన సీబీఐ అధికారులు నేరుగా వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి ఇంటికి వెళ్లి రెండు గంటల్లో ఆయనను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లిపోయారు. అవినాష్‌ రెడ్డి అప్పుడు ఇంట్లో లేరు. ఆయన ఉంటే ఆయననూ అరెస్ట్‌ చేసేవారేమో తెలియదు కానీ అప్పటికి భాస్కర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తీసుకెళ్లిపోయారు. అదే రోజు అవినాష్‌ రెడ్డికి తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రారంభమైన హైటెన్షన్‌ డెలవప్‌మెంట్స్‌.. తెలంగాణ హైకోర్టు టు సుప్రీంకోర్టు.. అక్కడి నుంచి మళ్లీ హైకోర్టు కు చేరింది. ఇక్కడా పరిష్కారం కాలేదు. జూన్‌కు వాయిదా పడిరది. ఇప్పుడు సీబీఐ అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేస్తుందా లేదా అన్న టాపిక్‌పై చర్చ ప్రారంభమవుతుంది. మరో వైపు అవినాష్‌ రెడ్డి సీబీఐకి చెప్పుకునేది చెబుతున్నారు.. అంత కంటే ఎక్కువగా బయట మాట్లాడుతున్నారు. విూడియాతో రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. హత్యకు గల కారణాలు చెబుతున్నారు. తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేసి వివేకానందరెడ్డి రాసిన లేఖే కీలకమని ఆ లేఖ కేంద్రంగానే విచారణ చేయాలంటున్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు అటు అవినాష్‌ రెడ్డి సృష్టించుకుంటున్నారు. మరో వైపు ఆయనకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతల్ని తప్పు పడుతూ హు కిల్డ్‌ బాబాయ్‌ ` అబ్బాయ్‌ కిల్డ్‌ బాబాయ్‌ అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వివేకా హత్య కేసులో అటు బాధితులు, ఇటు నిందితులు కూడా వైఎస్‌ కుటుంబానికి చెందిన వారే. వారిలో వారే ఆరోపణలు చేసుకుంటూండటం.. చనిపోయిన వివేకా విూద కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. వాటిని షర్మిల ఖండిరచారు. విూడియాలోనూ ఈ అంశం హాట్‌ టాపిక్‌ అవుతోంది. వైఎస్‌ జగన్‌ … అవినాష్‌ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం కూడా ఇది రాజకీయంగా ప్రాధాన్యతాంశం కావడానికి కారణం అవుతోంది. ఇప్పుడు వివేకా హత్య కేసు కొలిక్కి వస్తే తప్ప ఈ అంశంపై రాజకీయ ఆరోపణలు విమర్శలకు పులిస్టాప్‌ పడే చాన్స్‌ లేదు. ఇప్పుడు జరుగుతున్న విచారణ సరిగ్గా లేదని వైసీపీ వాదిస్తోంది. వైఎస్‌ వివేకా కుమార్తె, అల్లుడు పైనే ఆరోపణలు చేస్తున్నారు. ఇదో అంతు లేని కథలా సాగిపోతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *