నేడు భారత మాజీ ప్రధాని వీపీ సింగ్‌ జయంతి

విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ భారతీయ రాజకీయ నాయకుడు, భారతదేశ ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుండి 1990 వరకు పనిచేసాడు. మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు 27% రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని. విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ 1931 జూన్‌ 25 న మండా ఎస్టేట్‌ ను పరిపాలించిన రాజపుత్ర జవిూందారీ కుటుంబంలో జన్మించాడు. అతను డెహ్రాడూన్‌ లోని కలనల్‌ బ్రౌన్‌ కేంబ్రిడ్జ్‌ స్కూలులో విద్యాభ్యాసం చేసాడు. అలహాబాద్‌, పూణె విశ్వవిద్యాలయాలలో చదివాడు. 1969లో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభకు భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తరపున సభ్యుడయ్యాడు. అతను 1971 లో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1974లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో వాణిజ్య శాఖ ఉపమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. 1976 నుండి 1977 వరకు వాణిజ్య శాఖామంత్రిగా తన సేవలనందించాడు. 1980లో జనతా పార్టీ తరువాత ఇందిరా గాంధీ మరల ఎన్నుకోబడినప్పుడు, ఇందిరా గాంధీ అతనిని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నియమించింది.
ముఖ్యమంత్రిగా (1980?82) అతను ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని నైఋతి ప్రాంత జిల్లాలలోని గ్రావిూణ ప్రాంతాలలో ముఖ్యంగా తీవ్రమైన సమస్య అయిన బందిపోటు దొంగతనాలను తగ్గించే కార్యక్రమాలు చేసాడు. సమస్యను అదుపుచేసే క్రమంలో వ్యక్తిగత వైఫల్యం పొందినందుకు గాను రాజీనామా చేసినపుడు, అతను జాతీయ స్థాయిలో మంచి పేరు పొందాడు. 1983 లో ఈ ప్రాంతంలో అత్యంత భయానకమైన బందిపోటు దొంగలు లొంగిపోవటాన్ని అతను వ్యక్తిగతంగా పర్యవేక్షించినపుడు కూడా జాతీయ ప్రచారాన్ని పొందాడు. కాంగ్రెస్‌ పార్టీ నుండి బయటికి వచ్చిన తరువాత సింగ్‌ అరుణ్‌ నెహ్రూ, అరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ లతో కలసి జనమోర్చా పేరుతో ప్రతిపక్ష పార్టీని ప్రారంభించాడు. అతను అలహాబాద్‌ లోక్‌సభకు జరిగిన ఉపన్నికలలో సునీల్‌ శాస్త్రిని ఓడిరచి తిరిగి ఎన్నుకయ్యాడు. 1988 అక్టోబరు 11 న జనతాపార్టీ సంకీర్ణం నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ జన్మదినం సందర్భంగా రాజీవ్‌ గాంధీని వ్యతిరేకించే పార్టీలైన జనమోర్చా, జనతాపార్టీ, లోక్‌దళ్‌, కాంగ్రెస్‌ (ఎస్‌) పార్టీలను కలిపి జనతాదళ్‌ పార్టీని స్థాపించాడు. జనతాదళ్‌ పార్టీకి అధ్యక్షుడైనాడు. ద్రవిడ మున్నేట్ర ఖగజం, తెలుగుదేశం పార్టీ, అసోం గణపరిషత్‌ వంటి ప్రాంతీయ పార్టీలతో కలసి జనతాదళ్‌ పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో సంకీర్ణ దళం ఏర్పడినది. దీనికి వి.పి.సింగ్‌ కన్వీనరుగా, ఎన్‌.టి.రామారావు అధ్యక్షునిగా, పర్వతనేని ఉపేంద్ర జనరల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. 1989 సార్వత్రిక ఎన్నికలలో నేషనల్‌ ఫ్రంటు కాంగ్రెస్‌ వ్యతిరేక పక్షాలైన భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీల (రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను)తో కలసి సీట్ల సర్దుబాటు చేసుకొని పోటీ చేసింది. నేషనల్‌ ఫ్రంటు వారి మిత్ర పక్షాలతో కలసి కనీస మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌ కృష్ణ అద్వానీల నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్కిస్టు), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా వంటి వామపక్షాలు ప్రభుత్వం బయటి నుండి మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పడిరది.పార్లెమెంటు సెంట్రల్‌ హాల్‌ లో 1989 డిసెంబరు 1 జరిగిన సమవేశంలో సింగ్‌ ప్రధానమంత్రి అభ్యర్థిగా దేవీలాల్‌ ను ప్రతిపాదించాడు. రాజీవ్‌ గాంధీకి వ్యతిరేకంగా స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా సింగ్‌ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలని కాంగ్రెస్‌ వ్యతిరేక పక్షాలు భావించినప్పటికీ అతను దేవీలాల్‌ ను ప్రతిపాదించాడు. చౌధురి దేవీలాల్‌ హర్యానా లోని జాట్‌ వర్గానికి చెందిన నాయకుడు. అతను ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని త్రోసిపుచ్చాడు. కానీ ప్రభుత్వానికి ‘‘ఎల్డర్‌ అంకుల్‌’’ గా ఉండటానికి మొగ్గు చూపాడు. అపుడు వి.పి.సింగ్‌ ప్రధానమంత్రి అయ్యాడు. వి.పి.సింగ్‌ 1989 డిసెంబరు 2 న భారత దేశ 7వ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. వి.పి. సింగ్‌ 1989 డిసెంబరు 2 నుండి 1990 నవంబరు 10 వరకు ఒక సంవత్సరం లోపే ప్రధానమంత్రిగా పనిచేసాడు. ఇంతలో, భారతీయ జనతా పార్టీ తన అజెండా ముందుకు తెచ్చింది. వాస్తవానికి బాబ్రీ మసీదు ఉన్న స్థానం శ్రీరామజన్మస్థానం అంటూ 1982లోనే విశ్వహిందూ పరిషత్‌ రామజన్మభూమి ఉద్యమాన్ని చేపట్టింది. 1989లో జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై ఒక తీర్మానం చేసి ఆమోదించారు. 1989లో ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది. 1990లో ఉత్తరాది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అద్యక్షుడు లాల్‌ కృష్ణ అద్వానీ ప్రమోద్‌ మహాజన్‌ తో కలసి రథయాత్ర చేయాలని నిర్ణయించాడు. 10,000 కిలోవిూటర్ల రథయాత్ర చేసి అక్టోబర్‌ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర అయోధ్యకు చేరక ముందే సమస్తిపూర్‌ వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు అధ్వానీ అరెస్టుకు సింగ్‌ ఆదేశించాడు. అధ్వానీ రథయాత్ర ఆగిపోయింది. కరసేవను అధ్వానీ వాయిదా వేసుకున్నాడు. దీని ఫలితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో లోక్‌సభలో సింగ్‌ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నాడు. అతను ఉన్నతమైన నైతిక విలువలతో దేశ లౌకికవాదంకోసం నిలబడ్డాననీ, తన బలంతో బాబ్రీ మసీదును కాపాడగలిగానని, ఇది ప్రాథమిక సూత్రాలను సమర్థిస్తుందని తెలిపాడు. అతను 142?346 ఓట్లతో అవిశ్వాసంలో ఓడిపోయే ముందు ‘‘విూరు ఎటువండి భారతదేశాన్ని కోరుకుటున్నారు?’’ అని విపక్షాలను పార్లమెంటులో ప్రశ్నించాడు. నేషనల్‌ ఫ్రంటులోని కొన్ని పార్టీలు, వామపక్షాలు మాత్రమే అతనిని సమర్థించాయి. సింగ్‌ 1990 నవంబరు 7 న తన పదవికి రాజీనామా చేసాడు. వి.పి.సింగ్‌ ఎముకల మజ్జ క్యాన్సర్‌, మూత్రపిండాల వైఫల్యంతో బాధపడి 2008 నవంబరు 27 న న్యూఢల్లీి లోని అపోలో ఆసుపత్రిలో మరణించాడు. 2008 నవంబరు 29 న అలహాబాదు లోని గంగా నదీ తీరంలో దహనం చేసారు.అతని కుమారుడు అజేయ సింగ్‌ అంత్యక్రియలను నిర్వహించాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *