12 మంది థాయ్, 13 మంది ఇజ్రాయెల్ బందీలు విడుదల

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన సంధి ఆచరణలోకి వచ్చింది. 12 మంది థాయ్‌లాండ్ బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ విషయాన్ని థాయ్‌లాండ్ ప్రధాని థావిసిన్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. హమాస్ చెర నుంచి విడుదలైన బందీలను తీసుకొచ్చేందుకు ఎంబసీ అధికారులు వెళ్తున్నారని ఆయన వివరించారు. ఈ విషయాన్ని థాయ్‌లాండ్ భద్రతా విభాగం, విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించాయని చెప్పారు. ఎంబసీ అధికారులు త్వరలోనే బందీలను రిసీవ్ చేసుకోనున్నారని, వారి పేర్లు, వివరాలు త్వరలో వెల్లడికానున్నాయని థావిసిన్ తెలిపారు.

గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ సంధిలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను పొరుగున ఉన్న ఈజిప్ట్‌కు అప్పగించనుండగా.. 13 మంది ఇజ్రాయెలీ బందీల సమూహాన్ని ఇజ్రాయెల్‌కు అప్పగించనున్నారు. కాగా బందీలను రెడ్‌క్రాస్‌కు అప్పగించనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొంతమంది ఇజ్రాయెలీ బందీలను వారి దేశానికి అందించడంలో భాగంగా అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీకి అప్పగించినట్టు హమాస్‌కు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయని అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య 4 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *