పక్కా ప్లాన్‌ తో హ్యాట్రిక్‌ అడుగులు

హైదరాబాద్‌, ఆగస్టు 22
సీఎం కేసీఆర్‌ గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించటంతో పాటుగా ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈసారి గజ్వేతో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ను కామారెడ్డి నుంచి పోటీ చేయాలంటూ ఆయన ఇప్పటికే మూడు సార్లు ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయానికి రావడం రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.కేసీఆర్‌కు కామారెడ్డికి వీడదీయరాని అనుబంధం ఉంది. కేసీఆర్‌ పుట్టింది కామారెడ్డి నియోజకవర్గంలోనే. బీబీ పేట్‌ మండలం కొనాపూర్‌ సీఎం కేసీఆర్‌ సొంత ఊరు. ఆయన ఇదే గ్రామంలో పుట్టారు. తల్లి వెంకటమ్మ కు ముస్తాబాద్‌ కు చెందిన రాఘవ రావు తో ఇల్లరికం పెళ్లి చేశారు. మిడ్‌ మానేరు డ్యామ్‌ నిర్మాణం తో కొనాపూర్‌ ముంపు నకు గురికావడంతో.. ఊరు ఖాళీ చేసి చింత మడకకు కేసీఆర్‌ ప్యామిలీ మకాం మార్చింది. కేసీఆర్‌ పూర్వీకుల మూలాలు కామారెడ్డిలో ఉండటం పోటీకి రాజకీయంగా బలంగా ఉండటంతో.. కేసీఆర్‌ ఇక్కడ నుంచి పోటీకి కామారెడ్డిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.కామారెడ్డి నుంచి కేసీఆర్‌ బరిలో దిగడం వల్ల ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాల పై ప్రభావం చూపనుంది. ఉత్తర తెలంగాణలో గత ఎన్నికల్లో నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ లోక్‌ సభ స్థానాలు సొంతం చేసుకుని ఈ ప్రాంతంలో పాగా వేయాలని చూస్తున్న కమలం పార్టీకి చెక్‌ పెట్టొచ్చని వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్‌ తో పాటు జగిత్యాల, కరీంనగర్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలలో అక్కడక్కడా ఉన్న వ్యతిరేకతతో పాటు పార్టీలో అసంతృ ప్తులు, గ్రూపులు వర్గ విబేధాలన్నీ సమసిపోయే విధంగా ఇది ఒక వ్యూహాత్మక మేనని అంటున్నారు పార్టీ శ్రేణులు. ముఖ్యమంత్రి కామారెడ్డిలో పోటీపై కొద్ది నెలలుగా జోరుగా ప్రచారం జరిగింది. ఈ పాటికే పలు దఫాలుగా సర్వేలు చేశారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ ఫలాలు వాటి లబ్ధిదారుల వివరాలు సేకరించారు. మొత్తంవిూద.. గులాబీ బాస్‌ కామారెడ్డిలో పోటీతో.. రాజకీయ సవిూకరణాలు, పరిణామాలు మారిపోనున్నాయి.అందులో భాగంగా ప్రతిపక్షాల హావిూలను పసి గట్టిన ముఖ్యమంత్రి వారి హావిూలను తానే అమలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ హావిూ ఇచ్చిన నాలుగు వేల రూపాయాల పెన్షన్‌ ను తానే అమలు చేస్తానని ప్రకటించారు. కేసీఆర్‌ హావిూ ఇచ్చి అమలు చేయనివి తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రతిపక్షాలు భావించాయి. కానీ, రుణమాఫీతో సహా అన్నింటినీ అమలు చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగ నియమాలపైన కసరత్తు జరుగుతోంది. ఉద్యోగులకు పీఆర్సీతో పాటుగా ఐఆర్‌ ప్రకటనకు ముఖ్యమంత్రి సిద్దం అవుతున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా : పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తరువాత ప్రభుత్వంపైన ఎంతో కొంత వ్యతిరేకత సహజం. కానీ, కేసీఆర్‌ పూర్తిగా పాజిటివ్‌ ఓటంగ్‌ నే తన అస్త్రంగా నమ్ముకుంటున్నారు. పదేళ్ల కాలంలో తాను తెలంగాణలో చేసిన నిర్ణయాలు..అమలు చేస్తున్న పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం..పూర్తయిన ప్రాజెక్టులు..మారిన హైదరాబాద్‌ రూపురేఖలు..రైతులకు దాదాపు 70 వేల కోట్లకు పైగా ఈ తొమ్మిదేళ్ల కాలంలో చేసిన రుణమాఫీపైన ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా 24 గంటల విద్యుత్‌, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు పైన ప్రజల్లో సానుకూలత ఉందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం లేకుండా ముఖ్యమంత్రి అన్నీ తానై ఎన్నికల నిర్ణయాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలకు పవన్‌ కల్యాణ్‌ చిన్న బ్రేక్‌.. కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి : ఇక, ఊహించని విధంగా ప్రతిపక్షాల కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ ఏకంగా 114 మంది అభ్యర్దులను ప్రకటించారు. దీని ద్వారా తన సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పైన నమ్మకం..తాను నమ్ముకున్న పాజిటివ్‌ ఓటింగ్‌ తో గెలుస్తామనే ధీమాను స్పష్టం చేస్తున్నారు. అభ్యర్దులను ఖరారు చేసి, ఇక సీఎం నుంచి అభ్యర్దులు అంతా ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో రెండు బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు. ఇదే సమయంలో సీట్లు నిరాకరించిన వారికి భవిష్యత్‌ పై హావిూ ఇస్తున్నారు. తమ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్న వారిని నియంత్రించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగేలా గేమ్‌ మొదలైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *