ఎంఐఎం ఓటు…ఎవరికి చేటు

హైదరాబాద్‌, జూలై 4
తెలంగాణ పొలిటికల్‌ స్క్రీన్‌పై కొత్త చిత్రాలు కనిపించబోతున్నాయా? పతంగి పార్టీ కేంద్రంగా పరిణామాలు మారుతున్నాయా? పాతబస్తీ దాటి ఆ పార్టీ బయటికి వస్తే?నష్టం ఎవరికి? ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీలిస్తే?దెబ్బ పడేది ఎవరికి? అసలు మజ్లిస్‌ అధినేత మనసులో ఏముంది? లెట్స్‌ వాచ్‌.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీతో జట్టు కట్టేది ఎంఐఎం. తెలంగాణ ఏర్పాటయ్యాక మిత్రులు మారిపోయి బీఆర్‌ఎస్‌తో దోస్తీ కుదిరింది. ఇన్నాళ్ళు ఆ మైత్రి కొనసాగుతూ వస్తోంది. అయితే.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంఐఎం వరుస సభలతో హడావిడి చేయడం, అందులోనూ ఇన్నాళ్లూ మిత్రత్వం కొనసాగించిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ విూద విమర్శలు, ఆరోపణాస్త్రాలను సంధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసిన ఓఎఓ.. 7చోట్ల గెలిచింది. ఇక 2018లో 8 అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో పోటీ చేసి 7 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని మిగతా రాజకీయపక్షాల కంటే ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది ఎంఐఎం నాయకత్వం. అందరూ ఎన్నికల మూడ్‌లోనే ఉన్నా? ప్రచార సభల స్థాయిలో ఇంకా గేరప్‌ అవలేదు. కానీ? మజ్లిస్‌ పార్టీ నాయకత్వం మాత్రం రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. దీన్నిబట్టి చూస్తే? ఎంఐఎం విస్తరణకు సిద్ధమైందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్‌ పాతబస్తీలో గట్టి పట్టున్న మజ్లిస్‌ పార్టీ? ఆ ప్రాంతానికి వెలుపల పోటీ చేసినా? అది చాలా పరిమితంగా ఉండేది. కానీ? తాజాగా ఆ పార్టీ నాయకత్వపు తీరు చూస్తుంటే? తెలంగాణలో విస్తరించాలన్న పట్టుదల కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ? అధికార పార్టీని టార్గెట్‌ చేస్తున్న తీరు చూస్తే?. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సీట్లలో ఒంటరిగా పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు చెబుతున్నారు.తెలంగాణలో ఈసారి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఎంఐఎం కూడా సింగిల్‌గా ఓల్డ్‌ సిటీ బయటికి వస్తే? కొన్ని సీట్లలో అయినా చతుర్ముఖ పోటీ తప్పక పోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ఎవరి ఓట్లు చీలి ఎవరికి లాభం కలుగుతుందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. మజ్లిస్‌ పార్టీ పాతబస్తీ బయట సై అంటే? ముస్లిం మైనార్టీల ఓట్లు చీలడం ఖాయమంటున్నారు. అప్పుడు ఎవరికి పడాల్సిన ఓట్లు ఎటుపోతాయన్నది క్వశ్చన్‌. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం వెనక ముస్లింల ఓటు బ్యాంక్‌ ఉందన్నది ఫలితాలు చెప్పిన సత్యం. అంటే.. అక్కడ మైనార్టీ ఓట్లలో మెజార్టీ వాటా కాంగ్రెస్‌కే వెళ్ళిందన్న మాట. తెలంగాణలో కూడా చాలా నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉన్నాయి. మొత్తంగా కాకున్నా? అవి కొంతవరకు కాంగ్రెస్‌కు మళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మజ్లిస్‌ ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తే? ఓట్లు చీలి కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందా? అన్న అంచనాలు సైతం ఉన్నాయి. అదే సమయంలో బీఆర్‌ఎస్‌కు సైతం ఓట్ల చీలిక భయం ఉందట. కానీ? ఎక్కువ నష్టం కాంగ్రెస్‌కే జరగవచ్చంటున్నారు విశ్లేషకులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *