గృహలక్ష్మీకి నిధుల భారం

హైదరాబాద్‌, ఆగస్టు 10
తెలంగాణ ప్రభుత్వం సదుద్దేశంతో తెచ్చిన గృహలక్ష్మి పథకం నిబంధనలతో క్షేత్రస్థాయిలో నిజమైన అర్హులు లబ్దిపొందలేకపోతున్నారని అంటున్నారు. కొందరు నెటిజన్లు ఈ విషయంపై పలు సందేహాలు లేవనెత్తుతున్నారు. నిబంధనలు సడలించాలని కోరుతున్నారు సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారి కోసం తెలంగాణ సర్కారు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తుంది. గృహలక్ష్మి పథకం నిబంధనలపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గృహలక్ష్మి పథకం నిలువ నీడ లేని ఎంతో మంది నిరు పేదల కోసం ఉద్దేశించబడిరదని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి.పథకం లో ముఖ్యమైన పాయింట్‌ గృహ లక్ష్మి పథకం కింద లబ్ది పొందాలి అంటే ముందు ఆ లబ్ది దారుడి పేరిట హౌస్‌ సైట్‌ అనేది ఉండాలి. కానీ గ్రామాల్లో నివాస భూముల్లో కొన్ని రకాలు ఉంటాయి
1) అబాది లేదా గ్రామకంఠం భూములు వీటికి సర్వే నంబర్లు ఉండవు తాత ముత్తతల నుండి ఈ భూముల్లో ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటున్నారు గ్రామాల్లో మెజారిటీ ఈ రకమే నివాస భూములు
2) ముందు వ్యవసాయ భూముల కింద ఉండి తరువాత వ్యవసాయేతర భూములుగా మార్చుకుని నివాసం ఉంటున్న ఇళ్ళు
3) ప్రభుత్వం ద్వారా గతంలో మంజూరు చేయబడిన అసైన్డ్‌ భూములు
గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్లు… తాతల పేర్ల విూద ఉంటాయి. ఇవి శిథిలం అవడంతో వారసులు వేరే చోట కిరాయికి ఉండడమో లేదా శిథిలం అయినా ఇళ్లనే కొంచం రిపేర్‌ చేసుకుంటూ నివాసం ఉండడమో లేదా ఆ శిథిలం అయినా ఇళ్లను మొత్తం తొలగించి అదే ప్లేస్‌ లో గుడిసెలు వేసుకుని నివాసం ఉండే వాళ్లు ఎక్కువగా ఉంటారు. ఆ శిథిలమైన ఇంట్లోనో లేదా ఆ జాగాలో బతికే ఆ ఇంటి వారసుడి పేరిట ఆ జాగా ఉండదు, వాళ్ల తాత ముత్తాతల పేరుపై విూదో లేదా వాళ్ల తల్లిదండ్రుల పేరు విూదో రికార్డుల్లో ఉంటుంది. ఆ ఇంటి యజమానులు బతికి ఉండరు కాబట్టి వారి కుమారులో, మనవలో వారసత్వంగా ఆ భూమిని అనుభవిస్తూ వస్తుంటారు.ఆ ఇళ్లను లేదా ఖాళీ స్థలాలను వారసులు వాళ్ల పేర్ల విూద మార్చుకుని అప్లై చేసుకోవచ్చు కదా అని చాలా మందికి సందేహం ఉంటుంది. కానీ అది అంత సులభం కాదు, చనిపోయిన తాత ముత్తాతల పేర్ల లేదా చనిపోయిన తల్లిదండ్రుల పేర్ల విూద ఉన్న ఇళ్లను గ్రామపంచాయతీలో మార్చుకోవాలి అంటే చనిపోయిన వారికి ఒక్కరే వారసుడు ఉండాలి. ఆ చనిపోయిన వారికి డెత్‌ సర్టిఫికెట్‌ ఉండాలి వాళ్లు చనిపోయిన వారి వారసులే అని ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. తాత ముత్తాతల డెత్‌ సర్టిఫికెట్స్‌ చాలా మంది తీసుకుని ఉండరు, ఎప్పుడో చనిపోయిన వాళ్ల డెత్‌ సర్టిఫికెట్స్‌ కావాలంటే నేరుగా గ్రామపంచాయతీ నుంచి తీసుకోరాదని ఆర్డీవో ప్రొసీడిరగ్‌ ఉండాలి. చాలా జిల్లాల్లో ఆ ప్రొసీడిరగ్స్‌ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదు. ఒకవేళ డెత్‌ సర్టిఫికెట్‌ ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ను చనిపోయిన వారి బ్యాక్‌ ఖాతాలో డబ్బులు ఉంటే వాటి పర్పస్‌ కోసమే ఇస్తున్నారు. ఈ రెండు లేకుండా ఆ ఇంటి మార్పిడి సాధ్యం కాదు కాబట్టి ఇది ప్రధాన సమస్యగా ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *