తిరుపతిలో తమ్ముళ్ల తుగవులాటలు

తిరుపతి, ఆగస్టు 8
అధిష్టానం అక్షింతలు వేశాక రోడ్డెక్కిన స్థానిక నాయకత్వానికి వ్యవహారం బూమరాంగ్‌ అవుతున్నట్టు తెలిసింది. మైలేజీ కోసం ఓ విషయంలో ఇన్ఛార్జ్‌ సుగుణమ్మ సహా?స్థానిక నేతలు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయని పార్టీ కేడరే చెవులు కొరుక్కుంటోందట. ఎస్వీ యూనివర్శిటీ వేదికగా రాజకీయం చేయడం ఇప్పుడు పార్టీలో హాట్‌గా మారింది. తిరుపతి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఎస్వీ యూనివర్శిటీలో పబ్లిక్‌ రోడ్డు వేసేందుకు ముందుకు వచ్చింది మున్సిపల్‌ కార్పొరేషన్‌. దీనిపై అభ్యంతరాలు చెబుతున్నాయి టీడీపీ, బీజేపీ, జనసేన. యూనివర్శిటీ వాతావరణం పాడవుతుందని, భద్రతా పరమైన సమస్యలు వస్తాయన్నది ప్రతిపక్షాల అభ్యంతరం. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్‌ ఉంది. అభివృద్ధి చెందుతున్న తిరుపతి భవిష్యత్‌ అవసరాల కోసం అంటూ?..2017లో అప్పటి టిడిపి ప్రభుత్వ హయాంలోనే మాస్టర్‌ ప్లాన్‌ను ఆమోదించారు. కానీ.. అది పేపర్‌కే పరిమితమైంది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక మాస్టర్‌ ప్లాన్‌ అమలు మొదలైంది. నిధుల కొరత, ఇతరత్రా సమస్యలను అధిగమించి దాదాపు 80 శాతం ప్లాన్‌ అమలైందటున్నాయి అధికార వర్గాలు. అందులో భాగంగా?14 కొత్త రోడ్లు,పదికిపైగా పాత రోడ్ల అభివృద్ధితో పాటు అధిక సంఖ్యలో ఫ్రీ లెఫ్ట్‌ లను అభివృద్ధి చేశారు. వంద, ఎనఫై అడుగుల రోడ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయి ప్రజలకు అందులో బాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే యూనివర్శిటీలో నుంచి రోడ్డు వేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇదే తాజా వివాదానికి కారణమైంది.వర్శిటిలో రోడ్ల నిర్మాణం ఎలా చేస్తారంటూ టిడిపి సహా ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. యూనివర్సిటీలో ప్రశాంతం వాతావరణం పోతుందని, అవసరం లేని చోట్ల రోడ్లు వేస్తున్నారంటూ? ధర్నాలకు దిగుతున్నారు. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా? టీడీపీలో మాత్రం ఆందోళనల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. అందుకే ఆందోళన కార్యక్రమాలకు అంతా రావడం లేదని కూడా అంటున్నారు. గతంలో మనమే మాస్టర్‌ ప్లాన్‌ గురించి మాట్లాడాం. ఇప్పుడు అదే అమలవుతోంది. అలాంటప్పుడు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే? మనకే తేడా కొట్టదా అన్నది కొందరు నాయకుల ప్రశ్న. అటు నగర వాసులు కూడా దీని విూద పెద్దగా రియాక్ట్‌ అవకపోగా? అవే ప్రశ్నలు అడగడం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదటఈ విషయంలో ఇన్ఛార్జ్‌ సుగుణమ్మపై సొంత పార్టీ నేతలు గరం గరంగా ఉన్నట్టు తెలిసింది. ఇన్నాళ్ళు సైలెంట్‌ గా ఉండి ఎన్నికల ముందు ఆమె సెల్ఫ్‌ గోల్‌ వేసుకుంటున్నారని పార్టీలో ఆవేదన వ్యక్తం అవుతున్నట్టు తెలిసింది. మరోవైపు వైసీపీకి మనమే ఫ్రీగా పబ్లిసిటీ చేసి పెడుతున్నామన్న అభిప్రాయం కూడా తిరుపతి టీడీపీలో ఉందట. నాలుగేళ్ళ నుంచి మాస్టర్‌ ప్లాన్‌ అమలు పనులు జరుగుతున్నా? జనం పెద్దగా పట్టించుకోలేదంటున్నారు. ఏదో.. కూలగొడుతున్నారు, కడుతున్నారు, రోడ్లేస్తున్నారని అనుకుంటున్నారు తప్ప అంతగా చర్చ జరగలేదని, టీడీపీ ఆందోళనల తర్వాతే ఇన్ని పనులు జరిగాయా అని జనం మాట్లాడుకుంటున్నారని చెబుతున్నారు. అటు బీజేపీ, జనసేన కూడా అనవసరంగా టీడీపీతో కలిసి వెళ్ళి మనమూ ఇరుక్కున్నామన్న భావన ఉన్నట్టు తెలిసింది. ఇవన్నీ చూస్తూన్న వైసిపి కేడర్‌ మాత్రం పుల్‌ జోష్‌గా ఉందట. చేస్తున్న పనుల గురించి ఎలా చెప్పుకోవాలో ఆలోచిస్తున్న టైంలో ప్రతిపక్షాలే మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల అభివృద్ధిపై పుల్‌ పబ్లిసిటీ ఇచ్చేశాయంని తెగ సంబరపడి?పోతున్నట్టు తెలిసింది. తిరుపతి టీడీపీ నేతల సెల్ఫ్‌గోల్‌పై జిల్లా రాజకీయవర్గాల్లో గట్టి చర్చే జరుగుతోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *