అచ్చెన్నకు దూరమవుతున్న తమ్ముళ్లు

శ్రీకాకుళం, ఆగస్టు 8
ఇన్నాళ్లూ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోనూ ఆయన హవా సాగింది. ఆయన ప్రాతినిథ్యం వహించిన పార్టీ అధికారంలో లేకున్నా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అన్నీ తానై వ్యవహరించారు. అధినేతతో ప్రతి సమావేశంలోనూ వేదిక పంచుకుని కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా నిలిచారు. అసెంబ్లీలోనూ, బయట పార్టీ గొంతును బలంగా వినిపించారు. ఈ క్రమంలో బీఏసీ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అయితే.. ఇదంతా గతం. ఇప్పుడు పార్టీలో భవిష్యత్‌ నాయకుడిగా ముద్రపడిన యువనేతకు, ఆ నాయకుడికి మధ్య గ్యాప్‌ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి ఆ నాయకుడి వ్యతిరేకులు మరింత ఆజ్యం పోస్తున్నట్టు సమాచారం. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా కథ? తెలుసుకోవాలంటే ఈ వివరాలు చదవండి.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు పార్టీలో ఎదురులేదు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో అచ్చెన్నకు మంత్రి పదవి దక్కింది. అప్పటినుంచి జిల్లా రాజకీయాల్లో, టీడీపీలో అచ్చెన్న ప్రాధాన్యం పెరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్‌ ప్రభంజనంలోనూ టెక్కలిలో అచ్చెన్నాయుడు విజయం సాధించారు. తర్వాత ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని ప్రభుత్వం అచ్చెన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసింది. తర్వాత కళా వెంకట్రావును తప్పించి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అచ్చెన్నాయుడికి కట్టబెట్టారు చంద్రబాబు.ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు అచ్చెన్నకు, అధిష్టానానికి మధ్య గ్యాప్‌ రావడానికి కారణమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో అచ్చెన్న అనుచరు లుగా ముద్ర పడిన వారికి రానున్న ఎన్నికల్లో బెర్తులు ఉండకపోవచ్చునే ప్రచారం సాగుతోంది. వాస్తవంగా అచ్చెన్న రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాక దూకుడు పెం చారు. దీంతో ఆయన వర్గంగా కొందరిపై ముద్రపడిరది. రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న మాట చెల్లుతుందని కొందరు భావించి ఆయనే జపమే చేస్తున్నారు. వాస్తవంగా జిల్లా విషయానికి వస్తే.. ప్రధానంగా పాతపట్నం నియోజకవర్గా నికి చెందిన మామిడి గోవిందరావు, శ్రీకా కుళానికి చెందిన గొండు శంకర్‌, ఎచ్చె ర్లకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడు.. అచ్చెన్న గ్రూపునకు చెందిన వారిగా ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో అచ్చెన్న మాట అధినేత చంద్ర బాబు, యువనేత లోకేట్ల వద్ద చెల్లేలా లేదని సమాచారం. రెండేళ్ల కిందట తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా ఓ హోటల్లో టీడీపీని ఉద్దేశించి.. ‘పార్టీలేదూ.. బొక్కాలేదు..’ అంటూ అచ్చెన్న వాఖ్యానించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. అదేక్రమంలో పార్టీ యువనేత లోకేశ్‌ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు అచ్చెన్న చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆ వ్యాఖ్యలు మిగిలిన రాజకీయాల పార్టీలకు ప్రచార అస్త్రాలుగా మారాయి కూడా. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా పెరిగిన గ్యాప్‌ అంతకం తకూ ఎక్కువైంది. మరోవైపు కళా వెంకటరావుకు కింజరాపు కుటుంబానికి వైరం ఎప్పటి నుంచో కొనసాగుతుండటం, కళా.. లోకేశ్‌ తో సత్సంధాలు నెరుపుతుండటం అందరికీ తెలిసిందే. దీంతో కళా చెప్పిన మాటలకు లోకేశ్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో జరిగిన క్యాబినెట్‌ విస్తరణలో కళాకు మంత్రి పదవి దక్కడం వెనుక లోకేశ్‌ సిఫార్సు ఉంది. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు వేదికగా లోకేశ్‌, అచ్చెన్న మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయట. ఇదీ.. వారిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమే. మహానాడు జరుగుతున్న సమయంలో లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఉన్నారు. యాత్రకు బ్రేక్‌ ఇచ్చి మహానాడుకు వచ్చారు. ఆ సమయంలో అందరూ నాయకులు లోకేశ్‌ ను ఆలింగనం చేసుకున్నారు. అచ్నెన్న మాత్రం లోకేశ్ను ఆలింగం చేసుకునేందుకు తటాపటాయించారు. ఇందుకు కారణాలు సహేతుకంగా ఉన్నప్పటికీ అపర్దాలు అనివార్యమయ్యాయి. మళ్లీ వారిద్దరి మధ్య దూరం పెరిగినట్టయింది. వాస్తవంగా అక్కడ జరిగింది వేరు.. యువగళం పాదయాత్ర నుంచి లోకేశ్‌ ఆదరాబాదరాగా రావడంతో చెమటతో ఉన్నారు. అచ్చెన్న సైతం కార్యక్రమ నిర్వహణలో బిజీగా ఉంటూ.. చెమటతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో లోకేశ్ను ఆలింగం చేసుకుంటే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అచ్చెన్న వెనక్కి తగ్గారు. అదే విషయాన్నీ యువనేతకు చెప్పారు. అయితే.. అచ్చెన్న ఉద్దేశపూర్వకంగానే తప్పించుకున్నారని లోకేశ్‌ భావించినట్టు సమాచారం. అప్పటికే వారి మధ్య ఉన్న గ్యాప్నకు.. ఈ ఘటన ఆజ్యం పోసినట్టయింది. కాగా.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ కర్రోతు బంగార్రాజు పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే.. ఆ నియోజకవర్గంలో సీనియర్‌ నాయకుడు పతివాడ నారాయణస్వామినాయుడు కుటుంబం ఉండగా కర్రోతు పేరు ప్రకటించడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పతివాడ గతంలో మంత్రిగా పనిచేయడమే కాదు పార్టీకి విధేయుడిగానూ ముద్రపడ్డారు. ఆ కుటుంబాన్ని కాదని కర్రోతుకు బాధ్యతలు కట్టబెట్టడంలోనూ అచ్చెన్న పాత్ర ఉందనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో కర్రోతుకు అచ్చెన్న హావిూ ఇచ్చారని.. ఇందుకు సంబంధించి అచ్చెన్నకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందనే ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని లోకేశ్కు అచ్చెన్న వ్యతిరేకులు ఫిర్యాదు చేశారట. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాడు చిన్నికుమారిని పార్టీ అధిష్టానం ముందు ఎంపిక చేసింది. అయితే.. అనూహ్యంగా వేపాడ చిరంజీవి రావు పేరు తెరపైకి వచ్చింది. చివరకు వేపాడను అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. దీనివెనుక అచ్చెన్న చక్రం తిప్పారు. ఇందుకు అచ్చెన్న ఆర్థిక లబ్ధి పొందారని బయట టాక్‌ నడుస్తోంది. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబును శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి దంపతులు కలిశారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, టీడీపీలో గ్రూపుల విషయాన్ని వివరించారు. అచ్చెన్నే దీనంతటికీ కారణమని అధినేతకు గుండ దంపతులు ఫిర్యాదు చేశారు.ఇదే క్రమంలో పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ కలమట వెంకటరమణ కూడా పార్టీపరంగా దూకుడు పెంచారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కలిశెట్టి అటు అధినేత చంద్రబాబ, ఇటు యువనేతతో టచ్లో ఉంటూ.. తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. అయితే.. అచ్చెన్న కనుసన్నల్లో రాజకీయం చేస్తున్న నాయకులకు వాస్తవంగా ఈ సారి అవకాశం దక్కే పరిస్థితి కనబడంలేదు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో అచ్చెన్న మాట చెల్లుబాటయ్యేలా లేదు. దీంతో ఆయన్ని నమ్ముకున్న నాయకులు, క్యాడర్కు ఈ విషయం మింగుడు పడటంలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *