గుంటూరులో డ్రగ్స్‌ మాఫియా

ఉగ్రవాద సంస్థలు తమ సభ్యులకు ఉత్ప్రేరకంగా వాడే మాదకద్రవ్యాలు మందులరూపంలో పల్నాడు నుంచి సప్లై అవుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఉత్ప్రేరకం మందులను నర్సారావుపేట ప్రాంతంలో ఉన్న ఫార్మసీ కంపెనీలో తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా భారీ ఎత్తున జరుగుతున్న ట్రెమడాల్‌ ట్యాబ్లెట్ల అక్రమ రవాణా గుట్టురట్టయింది. ఇప్పటికే కొన్ని వందల కోట్లలో ట్యాబ్లెట్లను అక్రమ రవాణా చేసినట్లు గుర్తించారు. ఉగ్రవాద సంస్థలు ఐసీస్‌, ఆఫ్రికా ప్రాంతంలోని బోకోహరమ్‌ లాంటి సంస్థలు ఈ మందులను విరివిగా ఆర్డర్‌ చేస్తూ ఉంటాయి. ఈ ఉగ్రవాద సంస్థలు తమ సభ్యులు అలసిపోకుండా నిరాటంకంగా పనిచేసేందుకు.. విధ్వంసాలకు ఒడిగట్టేందుకు ఈ ట్రెమాడాల్‌ డ్రగ్‌ టాబ్లెట్‌ రూపంలో తీసుకుంటారు. నొప్పుల నివారణ కోసం సూక్ష్మ మోతాదులో వాడేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కఠినమైన ఆంక్షలతో ఈ కాంబినేషన్‌ తో టాబ్లెట్‌ తయారీకి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కాంబినేషన్‌ లో మాత్రమే తయారు చేయవలసి ఉంటుంది. ట్రెమాడాల్‌ మాదక ద్రవ్యంగా ఎక్కువగా ఉపయోగిస్తాన్నారని ప్రభుత్వం ఆక్షలు పెట్టింది.ఈ మందు వాడటం వల్ల నాడీ వ్యవస్థపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. విపరీతంగా ఉత్పేరితం పొంది విధ్వంసకర కార్యకలాపాలకు పూనుకుని భయేత్పతాన్ని సృష్టించేందు పనిచేస్తోంది. గత ఫిబ్రవరిలో అనుమతుల్లేని రూ.21 కోట్ల విలువైన పది లక్షల ట్రెమడాల్‌ ట్యాబ్లెట్లను సూడాన్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు మూడున్నర కోట్ల ట్రెమడాల్‌ ట్యాబ్లెట్లను అక్రమ రవాణా చేసినట్లుగా విచారణలో గుర్తించిన ముంబై కస్టమ్స్‌ అధికారులు… ట్యాబ్లెట్లను ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న సేఫ్‌ ఫార్మా కంపెనీలో తయారైనట్లు నిర్ధారణ చేశారు. సేఫ్‌ ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ సనగల శ్రీధర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన ముంబయి కస్టమ్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. 2019లో సేఫ్‌ ఫార్మా కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన శ్రీధర్‌ రెడ్డి, సేఫ్‌ ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ లుగా ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయల ట్రెమడాల్‌ ట్యాబ్లెట్లను విదేశాలకు సరఫరా చేసినట్లుగా ముంబయి కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. కరోనా సమయంలో రెండు వందల కోట్ల విలువైన ట్యాబ్లెట్లను విదేశాలకు సేఫ్‌ ఫార్మా కంపెనీ సరఫరా చేసినట్లు సమాచారం. సేఫ్‌ పార్మా కంపెనీని పరిశీలించిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవిందబాబు.. ఈ సందర్భంలో అరవిందబాబు మాట్లాడుతూ…మాదక ద్రవ్యాల తయారీకి పాల్పడిన నిందితులు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అనుచరులేనని చదలవాడ అరవిందబాబు ఆరోపణ చేశారు. సేఫ్‌ ఫార్మా ఆగడాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద బాబు డిమాండ్‌ చేశారు. గుంటూరును వైసీపీ నేతలు డ్రగ్స్‌ కు అడ్డాగా మార్చారని ఆరోపించారు. నిందితులకు కఠిన శిక్షలు వేయాలని, ఈ వ్యవహారంలో ఉన్న అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *