రతి నిర్వేదం ఈజ్‌ బ్యాక్‌.. ఎప్పుడంటే..!

ప్రస్తుతం రీ రిలీజ్‌ (Rathinirvedam)ట్రెండ్‌ నడుస్తోంది. ఒకప్పుడు భారీ విజయం సాధించిన చిత్రాలను మేకర్స్‌ డిజిటలైజ్‌ చేసిన మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అభిమానుల్ని అలరిస్తున్నారు. 2011లో ఘన విజయం సాధించిన ఓ శృంగార ప్రేమ కథా చిత్రం మరోసారి తెరపై సందడి చేయనుంది. శ్వేతామీనన్ కథానాయికగా నటించిన ‘రతి నిర్వేదం’ 2011లో ఓ సంచలనం సృష్టించిన చిత్రం. శ్వేతామీనన్ కీలక పాత్ర పోషించగా మలయాళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ట్రెండ్‌ సెట్‌ చేసింది. శ్రీజిత్ విజయ్ (Srijith vijay) విజయ్‌ కథానాయకుడిగా టి.కె.రాజీవ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

పి.పద్మరాజన్ రచించిన నవల ఆధారంగా 1978లో ‘రతి నిర్వేదం’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2011లో శ్వేతామీనన్ కథానాయికగా జి.సురేష్‌కుమార్‌ నిర్మించారు. హాట్‌హాట్‌ అందాలతో అలరించిన శ్వేతామీనన మరోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 2011లో ఘన విజయం సాధించిన ‘రతి నిర్వేదం’ చిత్రాన్ని మేకర్స్‌ రీరిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *