రోన్‌ లో ఎవరు గెలిస్తే… వారిదే అధికారం…

కర్నాటకలోని రోన్‌ (ఖీనీని) నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో, ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని కర్నాటక రాజకీయ నాయకుల్లో ఒక నమ్మకం. 1957 నుంచి అలాగే జరుగుతోంది. రోన్‌ లో గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం. అంటే, 1957 నుంచి రోన్‌ నియోజకవర్గంలో విపక్ష ఎమ్మెల్యే లేడు. అంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలే. ఇలాంటి వింత నియోజకవర్గం దేశంలో మరొకటి ఉండదు కావచ్చు.అంతేకాదు, కర్నాటక లో మొత్తం 84 స్వింగ్‌ సీట్లు (ఉన్నాయి. ఈ సీట్లలో మెజారిటీ సీట్లను ఏ పార్టీ గెల్చుకుంటే, రాష్ట్రంలో అధికారం ఆ పార్టీదే. 2008 నుంచి ఈ వరుస కొనసాగుతోంది. ఈ విషయాన్ని బెంగళూరులోని అజీమ్‌ ప్రేమ్‌ జీ యూనివర్సిటీ రీసెర్చ్‌ చేసి కనిపెట్టింది. ఆ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. కర్నాటక అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 224. ఇందులో 84 స్థానాలు అంటే పెద్ద సంఖ్యనే. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కర్నాటకలో ప్రభుత్వం మారడానికి ఈ 84 స్వింగ్‌ సీట్లే ఒక కారణం. ఈ 84 సీట్లలో ఒకటి ఇంతకుముందు చెప్పుకున్న రోన్‌ నియోజకవర్గం. ఈ 84 నియోజకవర్గాల ఓటర్లకు ప్రతీసారి సిటింగ్‌ ఎమ్మెల్యేను, తద్వారా రూలింగ్‌ పార్టీని ఓడిరచడం ఒక అలవాటుగా మారింది.2018 లో ఈ 84 స్వింగ్‌ సీట్ల లో బీజేపీ 54 స్థానాలను గెల్చుకుంది. కాంగ్రెస్‌ 19 స్థానాలను, 8 సీట్లను జేడీఎస్‌ గెల్చుకున్నాయి. 2018లో బీజేపీ 104 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ, 78 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్‌, 37 సీట్లు గెల్చుకున్న జేడీఎస్‌ కలిసి కూటమిగా అధికారంలోకి వచ్చాయి. ఈ 84 స్వింగ్‌ సీట్ల విషయానికి వస్తే, లింగాయత్‌ వర్గం ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లోని, అలాగే కోస్టల్‌ కర్నాటకలోని ఈ స్వింగ్‌ సీట్లలో బీజేపీ గెలుస్తూ వస్తోంది. దక్షిణ కర్నాటకలో జేడీఎస్‌ గెలుస్తూ వస్తోంది. లింగాయత్‌ లు బలంగా ఉన్న ప్రాంతాల్లో బాంబే ` కర్నాటక ప్రాంతం ఒకటి. 2018 లో ఈ ప్రాంతంలో ఈ స్వింగ్‌ సీట్లు 19 ఉన్నాయి. బలమైన లింగాయత్‌ నేత యెడియూరప్ప సహకారంతో బీజేపీ గెల్చుకుంది. ఈ సారి ఎన్నికల్లో యెడియూరప్ప పోటీ చేయడం లేదు. బాంబే ` కర్నాటక ప్రాంతంలో మొత్తం 50 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 2018లో బీజేపీ30, కాంగ్రెస్‌ 17, జేడీఎస్‌ 2 సీట్లు గెల్చుకున్నాయి. లింగాయత్‌ లకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హావిూతో బీజేపీ అత్యధిక సీట్లను గెల్చుకోగలిగింది.సెంట్రల్‌ కర్నాటక లో ఈ స్వింగ్‌ సీట్లు 20 ఉన్నాయి. ఇక్కడ లింగాయత్‌ లతో పాటు, వొక్కలిగకమ్యూనిటీ కూడా బలంగా ఉంది. ఇక్కడి స్వింగ్‌ సీట్లలో 2018లో బీజేపీ (ఃఏఖ) 16 సీట్లను గెల్చుకుంది. అలాగే, ఈ సెంట్రల్‌ కర్నాటక ప్రాంతంలో మొత్తం 37 సీట్లు ఉన్నాయి. వాటిలో 2018లో బీజేపీ 21, కాంగ్రెస్‌ 13, జేడీఎస్‌ 2 సీట్లను గెల్చుకున్నాయి. కోస్టల్‌ కర్నాటక లో ముస్లిం జనాభా 20%. ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. ఇక్కడి మొత్తం 19 స్థానాల్లో 10 స్వింగ్‌ సీట్లు. 2018లో ఈ ప్రాంతంలో బీజేపీ 16, కాంగ్రెస్‌ 3 సీట్లు గెల్చుకున్నాయి. అలాగే, హైదరాబాద్‌ కర్నాటక ప్రాంతంలోని మొత్తం 40 నియోజకవర్గాల్లో 2018లో బీజేపీ, 12 స్వింగ్‌ సీట్లు సహా 21 స్థానాలు గెల్చుకుంది. కాంగ్రెస్‌ 15, జేడీఎస్‌ 5 స్థానాల్లో గెలుపొందాయి. వొక్కలిగ కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న ఓల్డ్‌ మైసూరుగా పిలిచే దక్షిణ కర్నాటక లో జేడీఎస్‌ బలంగా ఉంది. 2018 లో ఇక్కడ జేడీఎస్‌ 26 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్‌ 11, బీజేపీ 9 స్థానాల్లో గెలిచాయి. ఈ సారి ఈ ప్రాంతంలో బీజేపీ 41 మంది వొక్కలిగ అభ్యర్థులను బరిలో నిలిపింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *