16 మంది Ips అధికారుల బదిలీ

ఏడాది కాలంగా ఒకే ప్రాంతం లో పనిచేస్తున్న 16 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. జోషి శ్రీనాథ్‌ మహదేవ్‌ – ఎస్పీ లోకాయుక్త, కేఎం శాంతరాజ్‌ – బెస్కాం, సీకే బాబా – ఆగ్నేయ డీసీపీ, సంజీవ్‌పాటిల్‌ – బెళగావి ఎస్పీ, కళాకృష్ణ స్వామి – తూర్పు డీసీపీ, హరీశ్‌పాండే – ఏసీబీ ఎస్పీ, లక్ష్మణ్‌ హింబరిగి – బెంగళూరు పశ్చిమ డీసీపీ, నాగేశ్‌ – చిక్కబళ్లాపుర ఎస్పీ, శ్రీనివాసగౌడ – సెంట్రల్‌ డీసీపీ, మిథున్‌కుమార్‌ – సీఐడీ ఎస్పీ, కృష్ణకాంత్‌ – దక్షిణ డీసీపీ, హరిరామ్‌ శంకర్‌ – హాసన్‌ ఎస్పీ, జైప్రకాశ్‌ – బాగల్కోటె ఎస్పీ, శోభారాణి – ఏసీబీ ఎస్పీ, శివాన్షు రాజ్‌పుథ్‌ – హుమ్నాబాద్‌ ఏఎస్పీగా బదిలీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *