రాజేందర్‌ వర్సెస్‌ రాఘవరెడ్డి

టీ కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయి నాయకుల మధ్య ఉన్న వైరం కాస్తా.. ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళింది. తమకు నచ్చని, లేదా ప్రత్యర్థి అనుకున్నా నాయకులపై జిల్లా స్థాయిలోనే క్రమశిక్షణా సంఘం పేరుతో అనర్హత వేటు వేస్తున్నారు. బలమైన వర్గం వారికి ఫలానా నాయకుడు నచ్చలేదంటే?అధికారికంగానే పార్టీ నుంచి గెంటేయడం, సభ్యత్వాన్ని రద్దు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తున్నట్టు..? క్రమశిక్షణను దారిలో పెట్టాల్సిన నాయకులంతా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై అసలు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ పట్టించుకుంటున్నారా అన్నది మరో బిగ్‌ క్వశ్చన్‌.వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌? జనగామ డిసిసి అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మధ్య వైరం కొనసాగుతోంది. జంగాపై.. రాష్ట్ర నాయకులకు సమాచారం ఇవ్వడంతో పాటు క్రమశిక్షణ కమిటీకి నాయని రాజేందర్‌ ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోలేదంటూ తానే? ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి.. జనగామ జిల్లా అధ్యక్షుడి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. అదెలా కుదురుతుందన్నది రాఘవ ప్రశ్న. కానీ.. అదే ప్రశ్నని నాయని రివర్స్‌లో అడుగుతున్నారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు వరంగల్‌లో పాదయాత్ర చేయగా లేనిది.. ఆయన సభ్యత్వాన్ని నేను రద్దు చేస్తే తప్పొచ్చిందా అని అడుగుతున్నారు. కానీ?ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఒక్క విషయం ఉంది. ఇద్దరూ చేసింది తప్పే. కానీ.. ఆ తప్పుల్ని సరిదిద్దాల్సిన అధినాయకత్వం సైలెంట్‌గా తమాషా చూడ్డంతోనే సమస్యలు పెరుగుతున్నాయని అంటున్నారు స్థానిక నాయకులు. ఘర్షణ వాతావరణం పెరగడానికి కూడా గాంధీభవన్‌ వైఖరే కారణం అన్నది వాళ్ళ వెర్షన్‌.మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ పరంగా జనగామ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పొన్నాలకు వ్యతిరేకంగా అక్కడ కొమ్మూరు ప్రతాపరెడ్డిని ఎంకరేజ్‌ చేస్తున్నారు పార్టీ నాయకులు. ఇన్నాళ్ళు పొన్నాల మౌనంగా భరిస్తూ వచ్చినా ఇప్పుడు అది ఘర్షణకి దారితీసింది. క్రమశిక్షణ కమిటీకి కొమ్మూరి ప్రతాపరెడ్డి పై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదనేది పొన్నాల వాదన. మరోవైపు జనగామ జిల్లాకు చెందిన డిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌? కొమ్మూరి ప్రతాపరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొమ్మూరి? నన్ను సస్పెండ్‌ చేసే హక్కు ఎవరికీ లేదు అంటూ వాదనకు దిగారు. తాజాగా సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర సందర్భంగా పొన్నాల , కొమ్మూరి ప్రతాపరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నాయకుల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఒకరిని ఒకరు పార్టీ నుంచి సస్పెండ్‌ చేసుకునే పరిస్థితి వచ్చింది. కామారెడ్డి జిల్లా నుంచి ఈ సస్పెన్షన్ల వ్యవహారం కొనసాగుతూ వస్తోంది.సమస్య ఏదైనా పార్టీ అగ్ర నాయకత్వం పట్టించుకోవడం లేదనేది జిల్లా నాయకుల వాదన. క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన ఫిర్యాదులు పెండిరగ్‌లో ఉండడం వల్లనే ఇలాంటివి తెరవిూదకి వస్తున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. జిల్లాల స్థాయిలో నాయకులకు సస్పెండ్‌ చేసే హక్కు ఉందా ? లేదా? అనేది కూడా తెలుసుకోకుండా ఎవరికి వారు నచ్చకుంటే వేటేస్తూ లెటర్స్‌ ఇచ్చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర నాయకత్వంతో పాటుగా? రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్‌ నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.. ఇదే పరంపర కొనసాగితే పార్టీ పరిస్థితి ఏమవుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *