14 నుంచి కేసీఆర్‌ జిల్లాల టూర్లు

కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. సవిూకృత కలెక్టరేట్ల భవనాల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అదే విధంగా జిల్లాల్లో సభలు నిర్వహించి కేడర్‌కు దిశానిర్దేశం చేసి వారిలో జోష్‌ నింపనున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పరిపాలన అంతా ఒకే చోట నిర్వహించే విధంగా నిర్మిస్తున్న సవిూకృత జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. గత కొన్ని నెలలుగా ప్రారంభోత్సవాలు వాయిదాపడుతూ వస్తున్నాయి. కోట్లరూపాయలతో నిర్మించినవి నిరూపయోగంగా మారుతున్నాయి.అయితే ఇన్ని రోజులు మంచి రోజులు లేకపోవడంతో కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు ఖరారు కాలేదు. పెండిరగ్‌ పనులు పూర్తి, ప్రారంభోత్సవాలు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల 14న తొలుత వికారాబాద్‌ జిల్లా నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. సవిూకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించడంతో పాటు మెడికల్‌ కళాశాల భవన నిర్మాణానికి, జిల్లా కోర్టు భవన సముదాయానికి శంకుస్ధాపన చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం ప్రారంభిస్తారు. అయితే రోజురోజుకు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.వికారాబాద్‌ జిల్లా తర్వాత నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాయాలు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దసరా రోజున నూతన సచివాలయం, అమరుల స్మృతి వనంను సైతం ప్రారంభించనున్నట్లు సమాచారం.టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రంలో నిర్మించారు. అయితే కొన్నింటిని సీఎం కేసీఆర్‌, మంత్రులు ప్రారంభించారు. ఇంకా కొన్ని కార్యాలయాల భవనాలు పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచడం లేదు. అయితే నిరూపయోగంగా మారుతున్నాయి. ఆ కార్యాలయాల్లోనే నియోజకవర్గాల వారీగా నేతలకు శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తారని నేతలు పేర్కొన్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. అయితే అవి ప్రారంభం కాకపోవడం, పార్టీ శ్రేణులకు శిక్షణ సైతం వాయిదా పడుతోనే ఉంది. అవి ఎప్పుడు ప్రారంభానికి నోచుకుంటాయో చూడాల్సిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *