సీఎంఓ షిఫ్టింగ్‌ సాధ్యమేనా

విశాఖపట్టణం, అక్టోబరు 17
త్వరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్‌ అవుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖకు అన్నిఅనుకూలతలు ఉన్నాయని సిఎం పునరుద్ఘాటించారు. విశాఖలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థాలు ఉన్నాయని, మెడికల్‌, ఇంజనీరింగ్‌, డిగ్రీ కాలేజీలతో 12`15వేల మంది ఏటా ఇంజనీర్లు విశాఖ నుంచివస్తున్నారని చెప్పారు. 14 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 4మెడికల్‌ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీతో ఎడ్యుకేషనల్‌ హబ్‌గా విశాఖ ఉందన్నాఅక్టోబర్‌లో ఇక్కడకు వచ్చే ప్రయత్నం చేస్తామని.. అయితే డిసెంబర్‌నుంచి ఇక్కడే ఉంటామని క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. పరిపాలనా విభాగంతో పాటు అధికారులు కూడా ఇక్కడికే వస్తారని తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీవిశాఖపట్నమని.. నగరంలో మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు తరహాలో విశాఖ ఐటీ హబ్‌ గా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.గుంటూరుప్రాంత రైతులను మోసం చేసి విశాఖకు సీఎం జగన్‌ ఎందుకు వెళుతున్నారో సమాధానం చెప్పాలన్నారు జనసేన ఖంఅ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌. అసలు ఉత్తరాంధ్రలో ఇన్‌ఫోసిస్‌ స్టార్ట్‌ చేసింది కేవలంశాటిలైట్‌ సెంటర్‌ మాత్రమేనన్నారు నాదెండ్ల. ఇందులోఎంతమందికిఉద్యోగాలిచ్చారనిప్రశ్నించారు.విశాఖ రాజధానిని ఎవరూ స్వాగతించడం లేదంటోంది టీడీపీ. ఇవాళ సీఎం పర్యటనకు అడ్డుకునేందుకువిఫలయత్నం చేశారు ఆ పార్టీ నాయకులు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును హౌస్‌ అరెస్టు చేశారు పోలీసులు.ఇప్పటికే విశాఖలో సీఎంవో, ఇతర కీలక అధికారులకార్యాలయాలకు అవసరమైన భనవాలు గుర్తించేందుకు ఉన్నతస్థాయి కమిటీ వేశారు.భజన తర్వాత హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, ఇప్పటికైనా మించి పోయింది ఏమి లేదని విశాఖను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అన్ని అనుకూలతలు ఉన్న నగరం ఇదొక్కటే అన్నారు. విభజనతో హైదరాబాద్‌ వంటి నగరం నగరం ఇప్పటి వరకు ఆంధ్రాకు లేకుండా పోయిందని చెప్పారు. ఈ తరహా ఐటీ పరిశ్రమలు రావడం వల్ల విశాఖ కూడా త్వరగా ఎదుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో మౌలికవసతుల ఏర్పాటుపై దృష్టి సారించింది. తొలుత దసరా నుంచే పాలన ప్రారంభించాలని భావించినా..కమిటీ నివేదిక ఆధారంగా భవనాల లభ్యత చూసుకుని ఒకేసారి విశాఖకు తరలి వెళ్లాలని సీఎం నిర్ణయించారు. మొత్తానికి సీఎం చేసిన తాజా ప్రకటన మరోసారి రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *