కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం…జూన్‌లో మిలిటరీ గూఢచారి ఉపగ్రహం ప్రయోగం

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మిలిటరీ గూఢచారి ఉపగ్రహాన్ని జూన్‌లో ప్రయోగించనుంది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా ధృవీకరించింది.సైనిక నిఘా ఉపగ్రహం నంబర్ 1 జూన్‌లో ప్రయోగించనున్నట్లు నార్త్ కొరియా అధికార పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్-ఛైర్మన్ రి ప్యోంగ్ చోల్ పేర్కొన్నారు.(Military Spy Satellite) ఉత్తర కొరియా (North Korea)అధినేత కిమ్ జోంగ్ ఉన్ మొట్టమొదటి సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని పరిశీలించారు.

అమెరికా, దాని భాగస్వాముల సైనిక కదలికలను పర్యవేక్షించడం అవసరమని చెబుతూ మిలిటరీ గూఢచారి ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ వారంలోనే గూఢచారి ఉపగ్రహ ప్రయోగం జరగవచ్చని ప్యోంగ్యాంగ్ తమకు తెలియజేసినట్లు జపాన్ తెలిపింది. ఆంక్షలను ధిక్కరించే బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ప్లాన్ చేస్తుందని టోక్యో హెచ్చరించింది.ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఈ నెలలో(Confirms June Launch) మొట్టమొదటి సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగానికి సిద్ధం చేసి దానికి గ్రీన్ లైట్ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *