పసుపు బోర్డు ప్రకటనతో గ్రాఫ్‌ పెరిగినట్టేనా

నిజామాబాద్‌, అక్టోబరు 3
నిజామాబాద్‌ పసుపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ మహబూబ్‌నగర్‌ బహిరంగ సభ వేదికగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. తొమ్మిదేండ్ల పాటు అసాధ్యం.. కుదరదు.. అని కేంద్ర మంత్రులు తేల్చి చెప్పగా ఇప్పుడు ఎలా సాధ్యమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా పసుపు బోర్డు అంశాన్ని బీజేపీ వాడదల్చుకున్నదని, దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్‌ పడిపోతూ ఉండడంతో తెలంగాణ నుంచి ఉన్న నాలుగు ఎంపీ సీట్లను పదిలంగా కాపాడుకునే ఉద్దేశంతోనే మోడీ నోటి ద్వారా ఈ ప్రకటన వచ్చిందన్న మాటలు వినిపిస్తున్నాయి.తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ కేంద్రంపైన ఈ ఒత్తిడి ఉన్నది. అప్పటి వాణిజ్య మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు అసాధ్యమంటూ అనేక సందర్భాల్లో తేల్చి చెప్పారు. తొమ్మిదేండ్లుగా అదే విధానం కొనసాగింది. పసుపు బోర్డును ఏర్పాటు చేయకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వంద రూపాయల బాండ్‌ పేపర్‌ విూద ఆ నియోజకవర్గ రైతులకు రాతపూర్వకంగా హావిూ ఇచ్చారు. మరో ఎనిమిది నెలల్లో ఆయన పదవీకాలం పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ పసుపు బోర్డు హావిూని నిలబెట్టుకోలేదు.నిజానికి 2014లో నిజామాబాద్‌ ఎంపీగా కల్వకుంట్ల కవిత గెలిచిన తర్వాత జూన్‌ 12న అప్పటి వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను స్వయంగా కలిసి పసుపు బోర్డు ఏర్పాటుపై మెమొరాండం ఇచ్చి విజ్ఞప్తి చేశారు. పసుపు రైతుల సంక్షేమంతోపాటు ఆ పంటకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌, నిజామాబాద్‌ జిల్లాలో పండుతున్న నాణ్యమైన వెరైటీ తదితరాలను పరిగణనలోకి తీసుకుని బోర్డును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. పరిశోధన ద్వారా మరిన్ని ఫలితాలు ఉంటాయని నొక్కిచెప్పారు. బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు మాత్రమే కాక ఎగుమతిపరంగానూ దేశానికి జరిగే మేలును ఆమె వివరించారు.మసాలా దినుసుల కోసం ఉన్న బోర్డు నుంచి పసుపును విడదీసి ప్రత్యేకంగా బోర్డును నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. రబ్బరు, కొబ్బరి తదితరాలకు బోర్డులు ఉన్నట్లుగానే పసుపు కోసం ప్రత్యేకంగా బోర్డును నెలకొల్పితే పరిశోధనలు జరిగి మేలు రకాలైన పంటను ఉత్పత్తి చేయవచ్చని సూచించారు. ఎంపీగా ఉన్న ఐదేండ్ల పాటు ఈ అంశాన్ని లోక్‌సభలో పలుమార్లు ప్రస్తావించారు. తన ఐదేండ్ల పదవీకాలంలో బోర్డు ఏర్పాటులో విఫలం కావడంతో రైతుల్లో నిరాశా నిస్పృహలు, అసంతృప్తి చివరకు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఓటమికి కారణమయ్యాయి. దీన్ని పసిగట్టిన బీజేపీ అభ్యర్థి ఎంపీ అరవింద్‌ ఎన్నికలకు ముందే 2019 మార్చిలోనే బాండ్‌ పేపర్‌ ద్వారా రైతులకు హావిూ ఇవ్వడం ఆయన గెలుపొందడానికి కారణమైంది.పసుపు బోర్డు ఏర్పాటులో ఆశించిన ఫలితం రాకపోవడం 2019లో కవిత ఓటమికి కారణమైనట్లుగానే ఈసారి ధర్మపురి అర్వింద్‌ కు చేదు అనుభవం తప్పదని గ్రహించినందునే స్వయంగా ప్రధాని మోడీ తెలంగాణ గడ్డ విూద నుంచి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయాల్సి వచ్చిందన్న చర్చలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్‌ ఎంపీ సురేశ్‌రెడ్డి 2021లో రాజ్యసభలో పసుపు బోర్డు అంశాన్ని లేవనెత్తినప్పుడు కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కుదరదంటూ తేల్చి చెప్పారు. మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల సైతం పార్లమెంటు వేదికగా దీన్నే నొక్కిచెప్పారు. నిజామాబాద్‌ ఎంపీగా కవిత ఉన్నప్పుడే ఇక్కడి నుంచి రైతుల్ని ఢల్లీికి తీసుకెల్లి అప్పటి వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌తోనూ చర్చలు జరిపారు. పసుపు నుంచి వ్యాల్యూ ఎడిషన్‌ కోసం పరిశ్రమలను స్థాపించడానికి, రైతుల నుంచి నేరుగా పసుపును కొనుగోలు చేయడానికి పతంజలి సంస్థ ప్రతినిధి బాబా రాందేవ్‌తోనూ చర్చించారు.బీఆర్‌ఎస్‌ అడిగినప్పుడు ఓకే చెప్పడం ద్వారా బీజేపీకి పొలిటికల్‌ మైలేజ్‌ రాదనే ఉద్దేశంతోనే ఇంతకాలం రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తనంతట తానుగా నెలకొల్పడం ద్వారా గ్రాఫ్‌ పెంచుకోవచ్చనేది ఈ నిర్ణయం వెనక ఉద్దేశం అనేది బహిరంగ రహస్యం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *