ఖమ్మంలో మెడికో ఆత్మహత్య

తెలంగాణలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువక ముందే వరంగల్‌ జిల్లాకు చెందిన మరో మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లాలో మెడికో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిరది. మమతా మెడికల్‌ కాలేజీకి చెందిన సముద్రాల మానసవరంగల్‌ జిల్లాకు చెందిన సముద్రాల మానస ఖమ్మంలో మమతా మెడికల్‌ కాలేజీలో బీడీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. కాలేజీకి సవిూపంలో ఉన్న హాస్టల్‌ లో ఉంటూ కాలేజీకి వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హాస్టల్‌ గదిలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది మానస. ఇది గమనించి విద్యార్థినులు హాస్టర్‌ నిర్వాహకులకు చెప్పారు. వారు మానస గది తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లే సమయానికే జరగకూడదని నష్టం జరిగిపోయింది. మంటల్లో కాలిపోయి మానస చనిపోయినట్లు నిర్ధారించారు. హాస్టల్‌ నిర్వాహకుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మెడికో విద్యార్థిని మానస ఓ పెట్రోల్‌ బంకుకు వెళ్లింది. పెట్రోల్‌ బంక్‌ లో మానస పెట్రోల్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా పోలీసులకు ఈ విషయం తెలిసింది. వైద్య విద్యార్థిని మానస స్వస్థలం వరంగల్‌ కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వరంగల్‌ జిల్లాకే చెందిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వేధింపులు భరించలేక తానే పాయిజన్‌ ఇంజక్షన్‌ తీసుకుని బలవన్మరణానికి పాల్పడిరది ప్రీతి. తొలుత అపస్మారక స్థితిలో గమనించిన తోటి విద్యార్థినులు మేనేజ్‌ మెంట్‌ కు సమాచారం అందించగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ కు తరలించారు. పాయిజన్‌ ఇంజక్షన్‌ తీసుకున్న తరువాత నాలుదైదు రోజులు చికిత్స పొందిన ప్రీతి చివరకు బ్రెయిన్‌ డెడ్‌ అయింది. చివరగా ప్రీతి చనిపోయినట్లు ఆసుపత్రి ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *