సఫారీలు.. కంగారెత్తించారు

లఖ్‌నవూ: తాజా వన్డే ప్రపంచక్‌పలో దక్షిణాఫ్రికా అంచనాలకు మించే రాణిస్తోంది. అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌లో సమష్టిగా కదం తొక్కుతూ ప్రత్యర్థి జట్లను వణికిస్తోంది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 134 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. డికాక్‌ (106 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 109) బ్యాట్‌ నుంచి మరో శతకం నమోదు కాగా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ (44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మ్యాక్స్‌వెల్‌, స్టార్క్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో ఆసీస్‌ 40.5 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్‌ (46) మాత్రమే ఆకట్టుకున్నాడు. రబాడకు మూడు.. కేశవ్‌, షంసీ, జాన్సెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డికాక్‌ నిలిచాడు.

అటు పేస్‌.. ఇటు స్పిన్‌: కొత్త బంతితో పేసర్లు స్వింగ్‌తో పాటు సీమ్‌ను రాబట్టడంతో పాటు స్పిన్నర్లు కూడా టర్న్‌ సాధించడంతో ఆసీస్‌ బ్యాటర్లు కంగారెత్తారు. ముఖ్యంగా రబాడ పిచ్‌ను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ కీలక వికెట్లతో భరతం పట్టగా.. ఎన్‌గిడి అత్యంత పొదుపు (8-2-18-1)గా బౌలింగ్‌ చేశాడు. వీరి ధాటికి లబుషేన్‌ మాత్రమే ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు మార్ష్‌ (7), వార్నర్‌ (13) వరుస ఓవర్లలో వెనుదిరిగారు. అప్పటికి స్కోరు 23 పరుగులు మాత్రమే. స్మిత్‌ (19)ను రబాడ ఎల్బీ చేయడంతో పవర్‌ప్లేలోనే ఆసీస్‌ టాపార్డర్‌ను కోల్పోయింది. ఈ దశలో ఓ వైపు వికెట్లు టపటపా పడుతున్నా.. లబుషేన్‌ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. మ్యాక్స్‌వెల్‌ (3)ను కేశవ్‌ రిటర్న్‌ క్యాచ్‌తో, స్టొయినిస్‌ (5)ను రబాడ అవుట్‌ చేయడం దెబ్బతీసింది. అయితే చివర్లో స్టార్క్‌ (27) నుంచి లబుషేన్‌కు సహకారం అందడంతో ఏడో వికెట్‌కు 69 పరుగులు జత చేరాయి. కానీ స్టార్క్‌ను జాన్సెన్‌.. లబుషేన్‌ను కేశవ్‌ వరుస ఓవర్లలో అవుట్‌ చేయడంతో ఆసీస్‌ 143/8 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో కెప్టెన్‌ కమిన్స్‌ (22), జంపా (11 నాటౌట్‌) తొమ్మిదో వికెట్‌కు 32 రన్స్‌ జోడించినా ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి. 41వ ఓవర్‌లో స్పిన్నర్‌ షంసీ.. కమిన్స్‌, హాజెల్‌వుడ్‌ (2) వికెట్లను తీసి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు.

డికాక్‌ మెరుపులు:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు ఆసీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. డికాక్‌-బవుమా (35) తొలి వికెట్‌కు 108 పరుగులు జత చేశారు. 20వ ఓవర్‌లో బవుమాను మ్యాక్స్‌ అవుట్‌ చేయడంతో ఇద్దరి శతక భాగస్వామ్యం ముగిసింది. డుస్సెన్‌ (26) ఉన్నకాసేపు వేగం చూపి జంపా చేతికి చిక్కాడు. ఇక 30వ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో డికాక్‌ సెంచరీ పూర్తిచేశాడు. అనంతరం స్వల్ప వ్యవధిలోనే డికాక్‌ను మ్యాక్స్‌ బౌల్డ్‌ చేసినా.. మార్‌క్రమ్‌, క్లాసెన్‌ జోడీ మాత్రం విరుచుకుపడ్డారు. చివర్లో మిల్లర్‌ (17), జాన్సెన్‌ (26) సైతం విలువైన పరుగులు జోడించడంతో 300+ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది.

5 క్యాచ్‌లు వదిలేశారు

ఈ మ్యాచ్‌ చూసిన వారికి నిజంగా మైదానంలో ఆడుతోంది ఐదుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టేనా? అనే సందేహం రాకమానదు. దక్షిణాఫ్రికాపై పసలేని బ్యాటింగ్‌కు తోడు.. చెత్త ఫీల్డింగ్‌తో ఏకంగా ఐదు క్యాచ్‌లను జారవిడిచి ఓ పసికూన టీమ్‌ మాదిరి ప్రదర్శనతో ఆశ్చర్యపరిచింది. మార్‌క్రమ్‌ ఒక పరుగు దగ్గర ఉన్నప్పుడు కమిన్స్‌కు రిటర్స్‌ క్యాచ్‌ ఇచ్చినా అందుకోలేకపోయాడు. ఆ తర్వాత మార్‌క్రమ్‌ చెలరేగి 44 బంతుల్లోనే 56 పరుగులతో అదరగొట్టాడు. ఆరంభంలో ఓపెనర్‌ బవుమా 19 రన్స్‌ దగ్గర ఇచ్చిన క్యాచ్‌ను కీపర్‌ ఇన్‌గ్లి్‌స వదిలేశాడు. కాసేపటికే బౌండరీ దగ్గర మరో క్యాచ్‌ను సబ్‌స్టిట్యూట్‌ ఎబాట్‌ అందుకుని రోప్‌ దాటేశాడు. అంతలోనే తను లోపలికి విసిరినా అక్కడే ఉన్న స్టార్క్‌కు దూరంగా వెళ్లింది. అలాగే 48వ ఓవర్‌లో మిల్లర్‌ క్యాచ్‌ను స్టార్క్‌, జాన్సెన్‌ క్యాచ్‌ను స్టొయినిస్‌ వదిలేయడం ఆసీ్‌సను దెబ్బతీసింది.

దక్షిణాఫ్రికా: డికాక్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 109; బవుమా (సి) వార్న్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 35; డుస్సెన్‌ (సి-సబ్‌) ఎబాట్‌ (బి) జంపా 26; మార్‌క్రమ్‌ (సి) హాజెల్‌వుడ్‌ (బి) కమిన్స్‌ 56; క్లాసెన్‌ (సి) ఇన్‌గ్లి్‌స (బి) హాజెల్‌వుడ్‌ 29; మిల్లర్‌ (బి) స్టార్క్‌ 17; జాన్సెన్‌ (సి) వార్నర్‌ (బి) స్టార్క్‌ 26; రబాడ (నాటౌట్‌) 0; కేశవ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 50 ఓవర్లలో 311/7. వికెట్ల పతనం: 1-108, 2-158, 3-197, 4-263, 5-267, 6-310, 7-311. బౌలింగ్‌: స్టార్క్‌ 9-1-53-2; హాజెల్‌వుడ్‌ 9-0-60-1; మ్యాక్స్‌వెల్‌ 10-1- 34-2; కమిన్స్‌ 9-0-71-1; ఆడమ్‌ జంపా 10-0-70-1; మిచెల్‌ మార్ష్‌ 1-0-6-0; స్టొయినిస్‌ 2-0-11-0.

ఆస్ర్టేలియా: మార్ష్‌ (సి) బవుమా (బి) జాన్సెన్‌ 7; వార్నర్‌ (సి) వాన్‌ డర్‌ డుస్సెన్‌ (బి) ఎన్‌గిడి 13; స్మిత్‌ (ఎల్బీ) రబాడ 19; లబుషేన్‌ (సి) బవుమా (బి) కేశవ్‌ 46; ఇన్‌గ్లి్‌స (బి) రబాడ 8; మ్యాక్స్‌వెల్‌ (సి అండ్‌ బి) కేశవ్‌ 3; స్టొయినిస్‌ (సి) డికాక్‌ (బి) రబాడ 5; స్టార్క్‌ (సి) డికాక్‌ (బి) జాన్సెన్‌ 27; కమిన్స్‌ (సి) మిల్లర్‌ (బి) షంసీ 22; జంపా (నాటౌట్‌) 11; హాజెల్‌వుడ్‌ (సి) రబాడ (బి) షంసీ 2; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 40.5 ఓవర్లలో 177 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-27, 2-27, 3-50, 4-56, 5-65, 6-70, 7-139, 8-143, 9-175, 10-177. బౌలింగ్‌: ఎన్‌గిడి 8-2-18-1; జాన్సెన్‌ 7-0- 54-2; రబాడ 8-1-33-3; కేశవ్‌ 10-0-30-2; షంసీ 7.5-0-38-2.

పాయింట్ల పట్టిక

జట్లు ఆ గె ఓ ఫ.తే పా ర.రే.

దక్షిణాఫ్రికా 2 2 0 0 4 2.360

న్యూజిలాండ్‌ 2 2 0 0 4 1.958

భారత్‌ 2 2 0 0 4 1.500

పాకిస్థాన్‌ 2 2 0 0 4 0.927

ఇంగ్లండ్‌ 2 1 1 0 2 0.553

బంగ్లాదేశ్‌ 2 1 1 0 2 -0.653

శ్రీలంక 2 0 2 0 0 -1.161

నెదర్లాండ్స్‌ 2 0 2 0 0 -1.800

ఆస్ట్రేలియా 2 0 2 0 0 -1.846

అఫ్ఘానిస్థాన్‌ 2 0 2 0 0 -1.907

1 ప్రపంచకప్‌ టోర్నీలో ఆసీస్‌ జట్టుకు ఇదే భారీ ఓటమి (134

రన్స్‌తో).

వరల్డ్‌క్‌పలో తొలి రెండు ఓటములు నమోదు చేయడం 1992 తర్వాత ఆసీ్‌సకిదే తొలిసారి. అలాగే ఈ జట్టు వరుసగా నాలుగు ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఓడడం గమనార్హం.

2 ప్రపంచకప్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన రెండో దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా డికాక్‌ నిలిచాడు. 2011లో డివిల్లీర్స్‌ ఈ ఫీట్‌ సాధించాడు. అలాగే వన్డేల్లో తమ జట్టు తరఫున ఎక్కువ సెంచరీలు (19) చేసిన రెండో ఓపెనర్‌గా డికాక్‌. హషీమ్‌ ఆమ్లా (27) ముందున్నాడు.

5 ఈ ఏడాది వరుసగా ఐదో వన్డేలోనూ 300+ స్కోరు సాధించిన దక్షిణాఫ్రికా.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *