త్వరలో టెట్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూలై 8, (న్యూస్‌ పల్స్‌)
త్వరలో టెట్‌ నోటిఫికేషన్‌ రాబోతుంది. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తోంది. అయితే డీఎస్పీపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అప్డేట్‌ లేదు. గతేడాది టెట్‌ పరీక్ష నిర్వహించిన విద్యాశాఖ… వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రకటన జారీ కాలేదు. ఇప్పటికే టెట్‌ పరీక్ష నిర్వహించి… ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో మరోసారి టెట్‌ నోటిఫికేషన్‌ ఇస్తారా…? నేరుగా డీఎస్సీనే నిర్వహిస్తారా అన్న చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఫలితంగా మరోసారి టెట్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు చెప్పినట్లు అయింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016 మే 22, 2017 జులై 23, 2022 జూన్‌ 12న టెట్‌ పరీక్షలు నిర్వహించారు. మరో నెలలో ఏడాది గడుస్తున్నందున మళ్లీ టెట్‌ జరపాల్సి ఉంటుంది. ఏడాది కాలంలో డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులైన వారు 20వేలకు పైగా ఉంటుంది. గత కొంతకాలంగా మరో టెట్‌ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ పరీక్షను జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి నిర్వహించబోయే పరీక్షకు కూడా దాదాపు 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం డీఎడ్‌, బీఎడ్‌ పాసైన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతేనే ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే టీఆర్‌టీ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. టెట్‌లో వచ్చిన మార్కులకు టీఆర్‌టీ ర్యాంకింగ్‌లో 20 శాతం వెయిటేజీ ఉన్నందున టెట్‌లో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. టెట్‌ లో అర్హత లేకపోతే ఈ పరీక్షలకు హాజరుకాలేరు.పైగా టెట్‌ ఉత్తీర్ణత లేకపోతే ప్రైవేటు పాఠశాలల్లో కూడా బోధన చేయడానికి వీలుండదు.రాష్ట్రంలో స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ పోస్టులు 13 వేల వరకు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న సమస్యలతో పాటు టీచర్‌ పోస్టుల భర్తీ, మన ఊరు`మన బడి పురోగతిపై చర్చించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయింది. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రి వర్గ ఉప సంఘం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఖాళీల భర్తీకి జులై 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నారు. వీటిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో 527 మంది లెక్చరర్‌ పోస్టులను, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో 341 పోస్టులను, హోనరేరియం కింద 50 టీఎస్‌కేసీ ఫుల్‌ టైమ్‌ మెంటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా 1,940 గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ పోస్టుల కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుందిటీచర్ల హేతుబద్ధీకరణనేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 15 వేల వరకు టీచర్‌ ఉద్యోగాలకు సంబంధించి టీఆర్టీ నోటిఫికేషన్‌ రావొచ్చు. అయితే దీనిపై ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు వచ్చినప్పటికీ? నోటిఫికేషన్లు జారీ కాలేదు. నిరుద్యోగులు కూడా భారీ సంఖ్యలో టీఆర్టీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *