జన ఘన భారత్‌… జీర్ణించుకోలేకపోతున్న డ్రాగన్‌

జనాభా పరంగా చైనాను వెనక్కి నెట్టి భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని ఐరాస విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో నంబర్‌.1గా ఉన్న చైనాను ఇండియా అధిగమించింది. 142.86 కోట్ల జనాభాతో ముందు వరుసలో నిలిచింది. అయితే, జనాభా విషయంలో తొలి స్థానం కోల్పోవడాన్ని డ్రాగన్‌ దేశం జీర్ణించుకోలేకపోతోంది. అదేమంత పెద్ద విషయం కాదంటూ.. క్వాలిటీ కాదు.. క్వాంటిటీ చూడాలంటూ తన అక్కసు వెళ్లగక్కింది.ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం.. భారత్‌ జనాభా 142.86 కోట్లుగా నమోదైంది. చైనా జనాభా 142.57 కోట్లుగా ఉంది. అంటే భారత్‌ కంటే చైనా జనాభా దాదాపు 29 లక్షలు తక్కువ. చైనాను భారత్‌ అధిగమించడంపై చైనా తరఫున ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ను స్పందన కోరగా..‘‘జన సంఖ్యలో క్వాంటిటీ (సంఖ్య) కాదు.. క్వాలిటీ (నాణ్యత) చూడాలి. జనాభా సంఖ్య ముఖ్యమే కానీ టాలెంట్‌ అంతకంటే ముఖ్యం. చైనా జనాభా 140 కోట్లు. అందులో 900 మిలియన్‌ (90 కోట్ల మంది) శ్రామికవర్గం ఉంది. వారిలో సగటున 10.5 ఏళ్ల పాటు విద్యనభ్యసించిన వారు ఉన్నారు’’ అని వాంగ్‌ అన్నారు.ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం భారత దేశ జనాభాలో 0`14 ఏళ్ల వయసు కలిగిన వారి సంఖ్య 25 శాతం కాగా.. 10`19 ఏళ్ల వయసు కలిగిన వారి సంఖ్య 18 శాతంగా ఉంది. 10`24 ఏళ్ల వయసున్న వర్గం 26 శాతం మంది ఉన్నారు. 15`64 ఏళ్ల గ్రూప్‌లో ఉన్న వారు భారత్‌లో 68 శాతం మంది ఉన్నారు. 65 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 7 శాతంగా ఉంది. మరోవైపు ప్రపంచ అత్యధిక జనాభా జాబితాలో 34 కోట్ల మందితో అమెరికా మూడో స్థానంలో నిలిచింది.ఐక్యరాజ్యసమితి బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దాదాపు 3 మిలియన్ల మంది ఆధిక్యతతో ఈ ఏడాది మధ్య నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ‘‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌, 2023 ప్రకారం భారతదేశ జనాభా చైనా యొక్క 1.4257 బిలియన్ల నుండి 1428.6 మిలియన్లు లేదా 1.4286 బిలియన్లకు వెంటనే పెరుగుతుందని పేర్కొంది. 340 మిలియన్ల జనాభాతో అమెరికా మూడో స్థానంలో ఉందని కూడా నివేదిక పేర్కొంది. ఈ డేటాలో ఫిబ్రవరి 2023 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఉంటుంది. మునుపటి ఐరాస డేటాను ఉపయోగించి, జనాభా శాస్త్రవేత్తలు ఈ నెలలో చైనాను భారత్‌ అధిగమిస్తుందని అంచనా వేశారు. అయితే ఐరాస యొక్క తాజా నివేదికలో ఈ మార్పు ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేదు.భారతదేశం మరియు చైనా నుండి వచ్చిన డేటాలో అనిశ్చితి కారణంగా తేదీని గుర్తించడం అసాధ్యం అని జనాభా విభాగం అధికారులు తెలిపారు. ముఖ్యంగా భారతదేశం యొక్క చివరి జనాభా గణన 2011లో నిర్వహించబడిరది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన తదుపరి జనాభా గణన కూడా ఆలస్యమైంది.భారతదేశం మరియు చైనాలు 8.045 బిలియన్ల ప్రపంచ జనాభాలో మూడిరట ఒక వంతు పంచుకుంటున్నాయి. అయితే ఈ రెండు ఆసియా దిగ్గజాల జనాభా వృద్ధి రేటు నెమ్మదిగా ఉంది. గత ఏడాది, ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనా జనాభా తగ్గిపోయింది. ఆ పతనాన్ని చారిత్రాత్మక మలుపుగా చూడాలి. ఎందుకంటే ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు మరియు ప్రపంచానికి తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది.ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2011 నుండి భారతదేశ వార్షిక జనాభా పెరుగుదల సగటున 1.2%. గత 10 ఏళ్లలో ఇది 1.7%. ఙఔఈఖం భారతదేశ ప్రతినిధి ఆండ్రియా వోజ్నార్‌ మాట్లాడుతూ భారతదేశంలోని సర్వే ఫలితాలు ప్రజలలో జనాభా పెరుగుదలపై ఆందోళనలు విస్తృతంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. 2011 తర్వాత ఇండియాలో జనాభాను లెక్కించలేదు. 2021లో జరగాల్సి జనగణన కరోనా వల్ల ఆలస్యమైంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం, భారతదేశ జనాభాలో దాదాపు పావు వంతు మంది 14 ఏళ్లలోపు ఉన్నారు. జనాభాలో 68 శాతం మంది 15 నుంచి 64 ఏళ్ల మధ్య ఉన్నవారు కాగా, 7 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారు.వివిధ ఏజెన్సీల అంచనాల ప్రకారం భారతదేశ జనాభా, 3 దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుంది. 165 కోట్లకు చేరుకుంటుంది. అక్కడ్నుంచి తగ్గుముఖం పడుతుంది.ఇక ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ జనాభా 8.045 బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. యూరోప్‌, అమెరికాతో పాటు, జపాన్‌ లాంటి కొన్ని ఆసియా దేశాల్లో జనాభా తగ్గిపోతోంది.అదే సమయంలో, ఆండ్రియా వోజ్నార్‌ జనాభా గణాంకాల గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని వ్యక్తిగత హక్కులు మరియు ప్రాధాన్యతలను సమర్థిస్తే, అది పురోగతి, అభివృద్ధికి చిహ్నంగా చూడవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *